పుంగనూరు నియోజకవర్గంలోని పలు మండలాల ప్రజలు బుధవారం రొంపిచర్ల లో తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ చల్లా బాబు నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో తమ సమస్యలను తెలియజేశారు. చల్లా బాబు ప్రజల సమస్యలను సవివరంగా అడిగి తెలుసుకుని, సంబంధిత అధికారులకు తగిన పరిష్కార మార్గాలు చూపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు# కొత్తూరు మురళి .
బుధవారం పుంగనూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీసీవై పార్టీ కన్వీనర్ హరిబాబు, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు రామచంద్ర యాదవ్ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోలేదని తెలిపారు. అవాస్తవాలు మాట్లాడే నాయకులు బయటకు శత్రువులుగా కనిపిస్తూ లోపల మరొక పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. రామచంద్ర యాదవ్ పొత్తు పెట్టుకున్నారని నిరూపిస్తే తాము రాజకీయాలకు రాజీనామా చేస్తామని, దీనికోసం కాణిపాకంలో...
పుంగనూరు నియోజకవర్గంలోని పలు ఆలయాలలో గురువారం తెలుగు సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకొని విశేష పూజలు నిర్వహించారు. దేవతామూర్తులను పుష్పాలు, ఆభరణాలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. మధ్యాహ్నం పంచాంగ శ్రవణం కార్యక్రమం జరుగుతుందని వేద పండితులు తెలిపారు. నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేశారు.
చౌడేపల్లి మండలంలో బుధవారం రాత్రి కురిసిన అకాల వర్షం బీరపంటకు తీవ్ర నష్టం కలిగించింది. ఖాన్ సాబ్ మిట్ట గ్రామంలో రైతు నూరుల్లాకు చెందిన ఎకరం బీరపంట నేలకొరిగింది. కోత దశలో ఉన్న పంట నష్టపోవడంతో రైతు గురువారం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో పలువురు రైతులు కూడా పంట నష్టపోయారు. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు కూలి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది# కొత్తూరు మురళి .
పుంగనూరు మండల సమీపంలో గల పెద్దపంజాని మండలం, కొలుత్తూరు పంచాయతీ గుండపల్లి గ్రామంలో గురువారం భూ వివాదంలో ఇరువర్గాలు గొడవ పడ్డారు. ఈ గొడవలో గిరీష్ కుమార్ (33) త్రీవంగా గాయపడటంతో కుటుంబ సభ్యులు గిరీష్ కుమార్ ను పుంగనూరు ఏరియా ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది# తూర్పు మురళి.
సోమల చౌడేపల్లి మార్గంలో టమోటా లోడ్ తో వెళ్తున్న ట్రక్ శుక్రవారం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కు ఎటువంటి అపాయం జరగలేదు. ఎదురుగా వస్తున్న కారును తప్పించే క్రమంలో డ్రైవర్ అదుపు తప్పడంతో ట్రక్ బోల్తా పడిందని సమాచారం. ఈ ఘటనలో సుమారు 100 టమోటా బాక్సులు కింద పడి నెలపాలు అయ్యాయి# కొత్తూరు మురళి .
*చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మార్చి 25వ తేదీన ఇందిరాపార్క్ హైదరాబాద్ దగ్గర జరిగె మహా ధర్నాను జయప్రదం చేయండి* తెలంగాణ చేనేత కార్మిక సంఘం *రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వనం శాంత కుమార్ గారి విజ్ఞప్తి*
రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వనం శాంతి కుమార్ గారు, రాష్ట్ర కార్యదర్శి శ్రీ ముషం నరహరి గారు ఈరోజు *చేనేత పారిశ్రామిక సహకార సంఘం నెంబర్ 2, పద్మానగర్, కరీంనగర్ లో ఆప్కో మాజీ...