Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • బాచుపల్లి అగ్ని ప్రమాదం
    Quthbullapur Fire Accident: మేడ్చల్ జిల్లా బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి వేళ భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నిజాంపేట సర్కిల్‌ ప్రగతి నగర్ కమాన్‌ సమీపంలోని మియాపూర్ రోడ్డులో ఉన్న ఫర్నీచర్ మార్కెట్‌లో మంటలు చెలరేగడంతో బీభత్సం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సుమారు 35వరకు దుకాణాలు కాలి బూడిదయ్యాయి. కోట్లాది రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది. అయితే అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి...
    433 Views
  • CMతో కలెక్టర్ నిశాంత్ కుమార్ అల్పాహార విందు: అభివృద్ధిపై చర్చ.
    గురువారం అమరావతి సచివాలయంలో జరుగుతున్న ఆరు జిల్లాల కలెక్టర్ల సదస్సులో భాగంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టర్లకు అల్పాహార విందు ఇచ్చారు. ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ముఖ్యమంత్రిని కలిసి జిల్లాలో జరుగుతున్న ప్రగతి, వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. జిల్లాలో అమలు అవుతున్న ప్రభుత్వ పథకాలు, పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల పురోగతిని ఆయన ముఖ్యమంత్రికి వివరించారు.
    365 Views
  • రైతులకు ‘అన్నదాత సుఖీభవ’, పీఎం కిసాన్ నిధుల విడుదల.
    అన్నమయ్య జిల్లాలో 1,88,408 మంది రైతులకు మూడో విడత అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ కింద రూ. 108.37 కోట్లు విడుదలైనట్లు జిల్లా వ్యవసాయ శాఖ జేడీ శివనారాయణ గురువారం తెలిపారు. మదనపల్లె నియోజకవర్గంలోని బీడీఎస్ ఫంక్షన్ హాల్, మొలకలదిన్నె క్రాస్ వద్ద సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు నిధుల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. రైతులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
    328 Views
  • ​శాంతిభద్రతలపై సీఎం సమీక్ష: పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎస్పీ.
    అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం జరిగిన శాంతిభద్రతల సమీక్షా సమావేశంలో అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ ధీరజ్ పాల్గొన్నారు. జిల్లాలో నేరాల నియంత్రణ, మహిళల భద్రత, గంజాయి నిర్మూలనకు తీసుకుంటున్న చర్యలను వారు ముఖ్యమంత్రికి వివరించారు. శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడకూడదని, ప్రజలకు రక్షణ కల్పించడమే ప్రథమ ప్రాధాన్యతగా పనిచేయాలని ముఖ్యమంత్రి అధికారులను...
    337 Views
  • అన్నమయ్య జిల్లాలో పోలీసుల స్పెషల్ డ్రైవ్.
    అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు, జిల్లా వ్యాప్తంగా పోలీసులు గురువారం ముమ్మర వాహన తనిఖీలు చేపట్టారు. రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా, హెల్మెట్ ధరించనివారు, సీట్ బెల్ట్ వాడనివారు, మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ప్రధాన కూడళ్లలో గంజాయి, మద్యం అక్రమ రవాణాపై నిఘా ఉంచడంతో పాటు, పట్టణాల్లో ఫుట్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. నిబంధనలు పాటించి, ప్రమాద రహిత...
    327 Views
  • TTD: టీటీడీ కీలక నిర్ణయం.. బాసర తరహాలో తిరుపతిలో అక్షరాభ్యాసం సౌకర్యం.
    వకుళమాత ఆలయం వద్ద చిన్నారులకు అక్షరాభ్యాసం 'అక్షర గోవిందం' పేరుతో కొత్త కార్యక్రమానికి శ్రీకారం బాసర ఆలయం తరహాలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభం అక్షరాభ్యాసం తర్వాత ఏడు వస్తువులతో ప్రత్యేక కిట్ పంపిణీ తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ ఓ శుభవార్త అందించింది. తెలంగాణలోని ప్రసిద్ధ బాసర జ్ఞానసరస్వతీ ఆలయం తరహాలో తిరుపతి సమీపంలోని పేరూరులో ఉన్న శ్రీ వకుళమాత ఆలయంలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించేందుకు...
    332 Views
  • Chandrababu: ప్రతి ప్రాణమూ విలువైందే.. నిబంధనల అమలులో కఠినంగా ఉండండి: కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు.
    రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ఠ‌ కార్యాచరణ చేపట్టాలని అధికారులకు సీఎం ఆదేశం మహిళలపై నేరాల విషయంలో జీరో టాలరెన్స్ విధానం పాటించాలని స్పష్టీక‌ర‌ణ‌ బాణసంచా యూనిట్లు, పేలుడు పదార్థాల నిల్వలపై 15 రోజుల్లో తనిఖీలు పూర్తి చేయాలని గడువు గంజాయి, డ్రగ్స్, రౌడీయిజంపై ఉక్కుపాదం మోపాలని చంద్రబాబు దిశానిర్దేశం రోడ్ సేఫ్టీ పరికరాల కోసం రూ.44 కోట్లు విడుదల చేస్తామని ప్రభుత్వ ప్రకటన...
    381 Views