Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • చీరాలలో అనుమతులు లేకుండా సెల్ టవర్ నిర్మాణం.. జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం – స్థానికుల ఆందోళన
    చీరాల: చీరాల పట్టణంలోని వుడ్ నగర్ ప్రాంతంలో అనుమతులు లేకుండా సెల్ టవర్ నిర్మాణం చేపడుతున్నారనే ఆరోపణలతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్ శశి బాబు గారి నివాస సమీపంలో, డాక్టర్ ఎక్స్‌రే సెంటర్ ఎదుట ఉన్న బహుళ అంతస్తు భవనంపై ఈ టవర్ నిర్మాణ పనులు జరుగుతున్నట్లు సమాచారం.స్థానికుల వాదన ప్రకారం, ఈ నిర్మాణానికి సంబంధించి మున్సిపల్ అధికారుల అనుమతులు తీసుకోలేదని, అలాగే పరిసర...
    562 Views
  • మదనపల్లి: వన్ టౌన్ ఎస్ఐగా రహీముల్లా బాధ్యతల స్వీకారం.
    మదనపల్లి ఒకటో పట్టణ (వన్ టౌన్) పోలీస్ స్టేషన్ ఎస్ఐగా రహీముల్లా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు జరిగిన సాధారణ బదిలీల్లో భాగంగా ఆయన నియమితులయ్యారు. గతంలో ఇక్కడ పనిచేసిన అన్వర్ బాషా రాయచోటికి బదిలీ అయ్యారు. టూ టౌన్ ఎస్ఐగా ఉన్న రహీముల్లాను వన్ టౌన్‌కు బదిలీ చేయగా, చౌడేపల్లి నాగేశ్వరరావును టూ టౌన్ ఎస్ఐగా నియమించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం రహీముల్లా...
    256 Views
  • మదనపల్లి: అర్జీలను పెండింగ్ లేకుండా పరిష్కరించాలి - కలెక్టర్.
    మదనపల్లి కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)'లో జిల్లా కలెక్టర్ నిషాంత్ కుమార్ ప్రజల నుంచి 285 అర్జీలను స్వీకరించారు. డీఆర్వో మధుసూదనరావు, సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణితో కలిసి అర్జీలు స్వీకరించిన కలెక్టర్, ఏ ఒక్క అర్జీని పెండింగ్‌లో ఉంచకుండా, నిర్ణీత కాలపరిమితిలోగా పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు.
    328 Views
  • వాడరేవు–పిడుగురాళ్ల జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం.... మహిళతో పాటు ఏడు గేదెల మృతి..
    బాపట్ల జిల్లా: వాడరేవు నుండి పిడుగురాళ్లకు వెళ్లే జాతీయ రహదారి–167పై సోమవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అశోక్ లేలాండ్ మినీ వ్యాన్ అతివేగంగా వెళ్లి రోడ్డుపై నడుస్తున్న మహిళను మరియు ఆమె వెంట ఉన్న గేదెలను ఢీకొట్టింది.స్థానికుల సమాచారం మేరకు ప్రమాదానికి ప్రధాన కారణం వాహనం అతివేగమేనని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో చీరాల మండలం ఈపురుపాలెం గ్రామం స్థావరం పాలెంకు చెందిన కొమ్మనబోయిన...
    403 Views
  • అక్రిడేషన్ ఉంటేనే జర్నలిస్టా? వాస్తవాలు - అపోహలు....
    సమాజంలో జరిగే విషయాలను సేకరించి, విశ్లేషించి ప్రజల ముందుకు తీసుకువచ్చే ప్రతి వ్యక్తీ జర్నలిస్టే. జర్నలిజం అనేది ఒక బాధ్యతాయుతమైన వృత్తి. అయితే, "అక్రిడేషన్ కార్డు ఉంటేనే జర్నలిస్ట్ అవుతారు" అనేది సమాజంలో ఉన్న ఒక పెద్ద అపోహ. దీని వెనుక ఉన్న అసలు వాస్తవాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం... ఈ విషయాన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ చూద్దాం. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ భారతీయ పౌరులే....
    432 Views
  • Chandrababu Naidu: ప్రజలకు హోలీ శుభాకాంక్షలు చెప్పిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్.
    సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెడుపై మంచి గెలుపునకు సూచిక ఈ పండుగ అన్న సీఎం చంద్రబాబు సమత, మమతలకు హోలీ ప్రతీక అని పేర్కొన్న లోకేశ్ హోలీ పండుగను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. రంగుల పండుగను పురస్కరించుకుని ఈరోజు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' వేదికగా తమ సందేశాలను పంచుకున్నారు.    ఈ...
    340 Views
  • చీరాల తోటవారిపాలెంలో శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఆలయంలో దొంగతనం..
    చీరాల: చీరాల మండలం తోటవారిపాలెం గ్రామంలో వెలసి ఉన్న శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఆలయంలో సోమవారం తెల్లవారుజామున దొంగతనం జరిగింది.గుర్తుతెలియని దుండగుడు ఆలయ తలుపుల తాళాలు పగులగొట్టి గర్భగుడిలోకి ప్రవేశించాడు. అనంతరం ఆలయంలో ఉన్న ఆదాయ హుండీని దొంగిలించి పరారయ్యాడు.ఉదయం ఆలయానికి వచ్చిన గ్రామస్థులు తాళాలు పగిలి ఉండటాన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ...
    360 Views
  • Warm Welcome to @Vadlamudi Naga Venkat Sai!

    We’re thrilled to have you join our reporting team. Hoping & Counting, Your expertise will be a huge asset as we continue to bring high-quality coverage to our channel.

    Please take a moment to check the Pages, Groups, Posts and Messages for our editorial guidelines and current lead list. We look forward to seeing your first story!

    Welcome aboard!
    Bharat Aawaz
    Like
    1
    334 Views
  • AP Farmers: రైతులకు శుభవార్త చెప్పిన ఏపీ కూటమి ప్రభుత్వం.
    ఆంధ్రప్రదేశ్‌లోని వేలాది మంది రైతులకు కూటమి ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. రాష్ట్రవ్యాప్తంగా చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న 46,113 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు సోమవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. సాగు సీజన్ ప్రారంభానికి ముందే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.    ఈ నెలాఖరులోగా పెండింగ్...
    323 Views