Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • మార్కెట్ డైరెక్టర్ రెడ్డప్ప జన్మదిన వేడుకల్లో ప్రముఖుల సందడి.
    అన్నమయ్య జిల్లా మదనపల్లెలో మార్కెట్ డైరెక్టర్ డాన్స్ రెడ్డప్ప జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో జై భీమ్ నాయకులు భాస్కర, ఎర్రబెల్లి సమరసింహారెడ్డి, బొమ్మశెట్టి పురుషోత్తం ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వారు రెడ్డప్పకు శుభాకాంక్షలు తెలిపి, ఆయన సమాజ సేవను కొనియాడారు. టిడిపి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది.
    313 Views
  • మదనపల్లె : నేడు జిల్లా ఇన్చార్జ్ సమీక్ష
    అన్నమయ్య జిల్లా అభివృద్ధి పనులపై జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నేడు. సమీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు మదనపల్లి పబ్లిక్ రిలేషన్స్ అధికారి భరత్ కుమార్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సమీక్షలో ప్రభుత్వ పథకాల అమలు, పెండింగ్ పనుల పురోగతిపై అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశానికి జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు...
    337 Views
  • పుంగనూరు: మోహిని అవతారంలో జగన్మోహనకారుడు
    పుంగనూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఐదవ రోజు శనివారం, స్వామివారు మోహిని అవతారంలో పట్టణ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ అలంకారాన్ని వీక్షించడానికి భారీ సంఖ్యలో భక్తులు మాడవీధులకు తరలివచ్చారు# కొత్తూరు మురళి.
    271 Views
  • AP Teachers: ఏపీ టీచర్లకు కొత్త అటెండెన్స్ రూల్స్.. ఇక నిమిషం ఆలస్యమైనా 'లేట్'.
    ఉదయం 9 గంటలలోపు పాఠశాలలకు హాజరు తప్పనిసరి హాఫ్-డే లీవులు, ఔట్-టైమ్‌పైనా కఠినమైన రూల్స్ జారీ నిమిషం ఆలస్యమైనా సెలవుగా పరిగణిస్తామని హెచ్చరిక కొత్త నిబంధనలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఉపాధ్యాయ సంఘాలు ఏపీలో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల హాజరుకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ కొత్త, కఠినమైన నిబంధనలను అమల్లోకి తెచ్చింది. క్రమశిక్షణ, సమయపాలనను మెరుగుపరిచే లక్ష్యంతో ఈ మార్గదర్శకాలను జారీ చేసింది....
    Like
    1
    340 Views
  • కృష్ణాపురంలో చోరీపై కేసు నమోదు చేసిన పోలీసులు
    పుంగనూరు మండలం, కృష్ణాపురం గ్రామంలో రైతు దేవేంద్ర నాయుడుకు చెందిన నాలుగు మేకలను శుక్రవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు చోరీ చేశారు. ఈ ఘటనపై బాధితుడు దేవేంద్ర నాయుడు పుంగనూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏఎస్ఐ అశ్వత్ నారాయణ శనివారం తెలిపిన వివరాల ప్రకారం, కేసు నమోదు చేసుకుని, దుండగులను గుర్తించి పట్టుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు# కొత్తూరు మురళి.
    275 Views
  • పుంగనూరు: టెంపో - బైక్ ఢీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు
    శనివారం రాత్రి పుంగనూరు మండలం ఉలవలదిన్నె వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పుంగనూరు నుంచి కమతంపల్లి వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా వస్తున్న టెంపో బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న వెంకటరెడ్డి (45), విశ్వనాథ్ (55)లకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని వెంటనే 108 వాహనంలో ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు# కొత్తూరు మురళి.
    381 Views
  • అలాంటి వాటిని నమ్మకండి: పుంగనూరు కమిషనర్
    పుంగనూరు మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి పేరుతో కొందరు వ్యక్తులు రాంగ్ కాల్స్ చేస్తూ, ఇంటి, నీటి పన్నులు, ట్రేడ్ లైసెన్స్ దారుల నుండి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆయన తెలిపారు. ఇలాంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత వ్యక్తుల ఫోన్ కాల్స్‌ను నమ్మవద్దని ఆయన ప్రజలకు సూచించారు. రెండు రోజులుగా ఈ తరహా ఘటనలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు# కొత్తూరు మురళి .
    254 Views
  • పుంగనూరు: మత్సవతారంలో దర్శనమిచ్చిన వెంకటేశ్వరుడు
    పుంగనూరులో శ్రీకళ్యాణ వేంకటరమణ స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం శ్రీవారు మత్స్యావతారంలో సూర్యప్రభ వాహనంపై పురవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. మహిళలు కర్పూర హారతులు సమర్పించగా, కోలాటాలు, చెక్క భజనలు, అన్నమయ్య కీర్తనలు, వాయిద్యాలతో కనువిందు చేశారు. టీటీడీ అధికారులు ఈ కార్యక్రమాలను పర్యవేక్షించారు# కొత్తూరు మురళి.
    279 Views
  • అడవి తల్లి దీవెన.... గుంజేడు ముసలమ్మ జాతర!
    ఈ జాతర కేవలం మొక్కుల పండుగే కాదు. గిరిజన సంస్కృతికి అద్దం పట్టే వేదిక ఈనెల 4 నుండి గుంజేడులో జాతర భారీగా తరలిరానున్న భక్తులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్న దేవాదాయ శాఖ మహబూబాబాద్/కొత్తగూడ, మార్చి 2(భారత్ అవాజ్)::మండలంలోని దట్టమైన అటవీ ప్రాంతం.. ప్రకృతి ఒడిలో పరవశించే ఆధ్యాత్మిక కేంద్రం గుంజేడు. ఇక్కడ కొలువైన శ్రీ ముసలమ్మ అమ్మవారు భక్తుల పాలిట కల్పవల్లిగా విరాజిల్లుతున్నారు. రెండేళ్లకు ఒకసారి...
    5K Views