Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • హైదరాబాద్ కోకాపేట‌లో శార‌దా పీఠానికి కేటాయించిన భూమిని పీఠానికే కొన‌సాగించాల‌ని ముఖ్య‌మంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు. పీఠం భూములు జ‌ల మండ‌లికి కేటాయించిన నేప‌థ్యంలో అక్క‌డ సాగుతున్న నిర్మాణ ప‌నుల విష‌యాల‌ను పీఠం ప్ర‌తినిధులు ముఖ్య‌మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చారు.

    ❇️ ఈ అంశంపై రాష్ట్ర స‌చివాల‌యంలో ముఖ్య‌మంత్రి గారు ఉన్న‌తాధికారుల‌తో స‌మావేశ‌మ‌య్యారు. కోకాపేట భూముల్లో పీఠం ఆధ్వ‌ర్యంలో వివిధ నిర్మాణాల తాజా స్థితిని తెలుసుకున్నారు. పీఠం భూముల‌ను జ‌ల‌మండ‌లికి కేటాయించే స‌మ‌యంలో నిర్మాణాల స్థితిని తెలియ‌జేయ‌క‌పోవ‌డంపై ముఖ్య‌మంత్రి గారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

    ❇️ జ‌ల మండ‌లికి కేటాయింపులు ర‌ద్దు చేసి శారదా పీఠానికే ఆ భూములు కొన‌సాగించాల‌ని ఆదేశించారు. మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్‌ బాబు గారిని క‌లిసి నిర్మాణాలు, ఇత‌ర ప‌రిస్థితుల‌ను వివ‌రించాల‌ని ఈ సందర్భంగా ముఖ్య‌మంత్రి, గారు పీఠం ప్ర‌తినిధుల‌కు సూచించారు.
    86 Views
  • యాక్సిడెంట్.. ఆర్మీ మాజీ ఉద్యోగి మృతి
    విశాఖలో జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయనగరం జిల్లా వాసి మృతి చెందాడు. గజపతినగరం మండలం బంగారమ్మపేట గ్రామానికి చెందిన ఆర్మీ మాజీ ఉద్యోగి గోపాలరావు కొంత కాలంగా విశాఖలో నివాసం ఉంటున్నారు. BHV సమీపంలో గోపాలరావు ప్రయాణిస్తున్న స్కూటీని GVMC లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయన మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. #Boiena Rajesh 
    323 Views
  • ప్రభుత్వం మేల్కొని ప్రజలకు వైద్యం అందించాలి
    కూటమి ప్రభుత్వం మేల్కొని ప్రజలకు వైద్య సేవలు అందించాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు అన్నారు. శనివారం విజయనగరంలో విలేకర్లతో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యం అందక ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారని ఆరోపించారు. రాజమండ్రిలో కల్తీ పాల వల్ల జరిగిన సంఘటన, పలు సంఘటనలను ప్రస్తావనకు తెచ్చారు. కల్తీ విషయంలో ప్రభుత్వం తగు చర్యలు చేపట్టి ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరారు....
    371 Views
  • [28/02, 5:53 pm] null: అమెరికా–ఇజ్రాయెల్ దాడులు: ఇరాన్ ఆర్మీ చీఫ్ అమీర్ హతామీ మృతి
    అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో అమీర్ హతామీ మృతి చెందినట్లు సమాచారం. ఇరాన్ ఆర్మీ కీలకాధికారిగా ఉన్న హతామీ మరణంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.
    ఇరాన్–ఇజ్రాయెల్ పరస్పర దాడులతో పశ్చిమాసియా ప్రాంతం యుద్ధ వాతావరణంలో ఉంది. పలు దేశాలు తమ వైమానిక ప్రదేశాలను తాత్కాలికంగా మూసివేశాయి. భద్రతా కారణాల వల్ల అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు, మార్గమార్పులు చోటుచేసుకుంటున్నాయి.
    ఈ ఉద్రిక్తతలతో ప్రాంతీయ భద్రతపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ఐక్యరాజ్యసమితి సహా పలు దేశాలు ఉద్రిక్తతలు తగ్గించాలని పిలుపునిస్తున్నాయి. పరిస్థితులు ఎలా మలుపుతీసుకుంటాయన్నది ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిగా మారింది.

    [28/02, 6:10 pm] null: గల్ఫ్ యుద్ధ ప్రభావం: బంగారం, వెండి ధరలు మళ్లీ భగ్గుమంటున్నాయి
    గల్ఫ్ ప్రాంతంలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల ప్రభావంతో దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి పెరగడంతో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గుచూపుతున్నారు.
    🔶 బంగారం ధరలు
    10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ఒక్కరోజులోనే రూ.7,000 పెరిగి రూ.1,68,710కు చేరింది.
    22 క్యారెట్ల బంగారం ధర రూ.6,550 పెరిగి 10 గ్రాములకు రూ.1,54,650గా నమోదైంది.
    🔷 వెండి ధరలు
    కిలో వెండి ధర ఒక్కరోజులోనే రూ.25,000 పెరిగింది.
    వెండి మరోసారి రూ.3 లక్షల మార్క్ దాటి ప్రస్తుతం రూ.3,20,000కు చేరింది.
    అంతర్జాతీయ స్థాయిలో డాలర్ మార్పిడి విలువలు, ముడి చమురు ధరల పెరుగుదల, యుద్ధ భయం వంటి కారణాలు ధరలపై ప్రభావం చూపుతున్నాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబోయే రోజుల్లో మరింత హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.
    137 Views
  • వేట్లపాలెం బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ ప్రమాదం.. 21 మంది మృతి
      కాకినాడ జిల్లా కాకినాడ జిల్లాలో తీవ్ర విషాధం చోటు చేసుకుంది. శనివారం సామర్లకోట మండలం వేట్లపాలెంలో భారీ పేలుడు సంభవించింది. ఓ బాణాసంచా తయారీ కేంద్రంలో టపాసులు తయారు చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో భారీగా ఎగిసి పడుతున్న మంటల్లో చిక్కుకుని 21 మంది కార్మికులు సజీవ దహనమై పోయారు. పలువురు గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం...
    1.1K Views