Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • సీఎంకి ఘన స్వాగతం పలికిన ప్రజా ప్రతినిధులు
    ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ, వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు జిల్లా పర్యటనకు విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మంత్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. విజయవాడ నుంచి వాయుమార్గంలో చీపురుపల్లి మండలం రావివలస వద్ద ఏర్పాటుచేసిన హెలిపాడ్ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఇంఛార్జి మంత్రి సీఎంకు స్వాగతం పలికారు. #BOIENA RAJESH 
    331 Views
  • తమ్ముడి మృతిపై అన్న అనుమానం: పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన.
    మదనపల్లి మండలం వలసపల్లికి చెందిన పురుషోత్తం శనివారం తాలూకా పోలీస్ స్టేషన్ వద్ద నిరసన తెలిపారు. తన తమ్ముడు దివాకర్ జనవరి 4న అదృశ్యమైనా, పోలీసులు ఫిబ్రవరి 10 వరకు కేసు నమోదు చేయలేదని ఆయన ఆరోపించారు. నెల రోజులుగా స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోలేదని, ఇప్పుడు గణేష్ అనే వ్యక్తి తన తమ్ముడిని చంపేశాడని చెప్పడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
    306 Views
  • బాపట్ల కు చెందిన దంపతులు శ్రీశైలం మల్లన్నకు బంగారు రుద్రాక్ష మాల హారం విరాళం
    *బాపట్ల కి చెందిన దంపతులు.. శ్రీశైలం మల్లన్న ఆలయానికి బంగారు రుద్రాక్ష మాల, హారం విరాళం*       *********       శ్రీశైలం దేవస్థానానికి బంగారు రుద్రాక్ష రుద్రాక్ష బంగారు హారం విరాళంగా ఇచ్చారు భక్తులు. బాపట్ల కు చెందిన దాతలు మాధవి కుటుంబ సభ్యులు 43 గ్రాముల బంగారు రుద్రాక్ష మాల,30 గ్రాముల బంగారు హారం విరాళంగా స్వామి వారికి అందజేశారు.     నంద్యాల...
    283 Views
  • విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి: డీఈవో.
    జాతీయ సైన్స్ దినోత్సవం పురస్కరించుకుని మదనపల్లిలోని బాలాజీ నగర్ ఉన్నత పాఠశాలలో సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఈవో సుబ్రహ్మణ్యం, ఏపీసీ అనూరాధ విద్యార్థుల ప్రదర్శనలను ప్రశంసించారు. విద్యార్థులు పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా, నిత్య జీవితంలో శాస్త్రీయ దృక్పథాన్ని, తార్కిక ఆలోచనలను అలవర్చుకోవాలని, సి. వి. రామన్ స్ఫూర్తితో సృజనాత్మకతను పెంపొందించుకుని దేశాభివృద్ధికి తోడ్పడాలని...
    300 Views
  • కూటమి ప్రభుత్వంలో ప్రాణాంతకంగా మారిన పాలు
    రాష్ట్రంలో టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజారోగ్య వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందని జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు విమర్శించారు. శనివారం తన క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలు, కలుషిత నీటి కారణంగా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు తరచుగా వెలుగు చూస్తున్నాయి అని పేర్కొన్నారు. #Boiena Rajesh 
    305 Views
  • శ్రీవారి లడ్డుపై నిజాల ఆవిష్కరణ
    *📢 తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై నిజాల ఆవిష్కరణ! 🙏*   కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ నిప్పులు   నేడు విజయవాడలోని లబ్బీపేట శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద గల కళ్యాణ మండపంలో "హిందూ ధర్మ పరిరక్షణ వేదిక" మరియు సెంట్రల్ మాజీ శాసనసభ్యులు, సెంట్రల్ వైసిపి ఇంచార్జ్ మల్లాది విష్ణు గారి ఆధ్వర్యంలో శనివారం నాడు "తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై నిజాలు" శ్రీవారి...
    540 Views
  • వైఎస్సార్సీపీ మహిళా విభాగం: వెటర్నరీ వైద్యుడిపై విచారణకు డిమాండ్
    అన్నమయ్య జిల్లా, మదనపల్లెలో వెటర్నరీ వైద్యుడు డాక్టర్ సిరిల్ లారెన్స్ నిర్లక్ష్యం, అధికార దుర్వినియోగంపై పూర్తి స్థాయి విచారణ జరపాలని వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి బీరంగి రేవతి డిమాండ్ చేశారు. వెటర్నరీ కౌన్సిల్ తనిఖీలో అవకతవకలు బయటపడ్డాయని, ప్రభుత్వం సమగ్ర విచారణ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఈ ఘటన మదనపల్లెలో చోటుచేసుకుంది.
    329 Views