Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • కాకినాడ: ఎమ్మెల్సీ అనంత బాబు చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
    డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబుకు కష్టాలు మరింత పెరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కేసు విచారణను వేగవంతం చేసింది. గురువారం సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్‌ను కోర్టులో దాఖలు చేసినట్లు సమాచారం. ఈ కేసులో కీలక పరిణామంగా, కాకినాడ ఎన్డీపీఓ మనీశ్ దేవరాజు పాటిల్ దర్యాప్తు ఆధారంగా అనంతబాబు భార్యను ఏ–2గా చేర్చారు. దీంతో కేసు...
    1.9K Views
  • రోడ్డు ప్రమాదంలో యువ అధ్యాపకుని దుర్మరణం
    తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువ అధ్యాపకుడు మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులోని ప్రైవేటు కళాశాలలో అధ్యాపకునిగా పనిచేస్తున్న అనపర్తికి చెందిన కోకా దినేష్ (25) ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వివరాల ప్రకారం, శనివారం సూరంపాలెంలోని ఆదిత్య కళాశాలకు పనిమీద వెళ్లిన దినేష్, తిరిగి బైక్‌పై ఇంటికి వస్తున్నారు. ఈ సమయంలో...
    1.9K Views
  • కొంకుదురులో మహాశివరాత్రి వేడుకలు భక్తజనంతో కిటకిటలాడిన త్రిముఖ లింగేశ్వర స్వామి ఆలయం
    తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం కొంకుదురులోని శ్రీ బాలా త్రిపుర సుందరీ సమేత త్రిముఖ లింగేశ్వర స్వామి వారి దేవాలయం మహాశివరాత్రి పర్వదినాన భక్తిశ్రద్ధలతో కళకళలాడింది. ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారి దర్శనానికి బారులు తీరగా, ఆలయ ప్రాంగణం భక్తజన సముద్రంగా మారింది. మహాశివరాత్రి సందర్భంగా ఆలయాన్ని ప్రత్యేక పుష్పాలంకరణలతో సుందరంగా తీర్చిదిద్దారు. వేదమంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక...
    2K Views
  • ABHA (ఆయుష్‌మన్ భారత్ హెల్త్ అకౌంట్) హెల్త్ కార్డ్ అనేది ఒక డిజిటల్ హెల్త్ ఐడీ, ఇది మీ అన్ని వైద్య రికార్డులను సురక్షితంగా నిల్వ చేస్తుంది మరియు భారతదేశంలో ఎక్కడైనా హెల్త్‌కేర్ సేవలను సులభంగా పొందేందుకు సహాయపడుతుంది. ఇది 14-సంఖ్యల ప్రత్యేక ఐడీ, ఇది హాస్పిటల్‌లు, క్లినిక్‌లు మరియు డయాగ్నోస్టిక్ సెంటర్‌ల మధ్య మీ ఆరోగ్య సమాచారాన్ని సృష్టించడానికి, నిర్వహించడానికి మరియు పంచుకోవడానికి అనుమతిస్తుంది. ¹ ² ³

    _ప్రధాన ప్రయోజనాలు:_
    - _మెడికల్ రికార్డులకు సులభ ప్రాప్యత_: ప్రతి అపాయింట్‌మెంట్‌కు ఫైల్‌లు లేదా ప్రిస్క్రిప్షన్‌లను తీసుకెళ్లాల్సిన అవసరం లేదు
    - _సురక్షితంగా పంచుకోవడం_: డాక్టర్‌లు మరియు హాస్పిటల్‌లతో ఆరోగ్య సమాచారాన్ని డిజిటల్‌గా షేర్ చేయండి
    - _వ్యక్తిగతీకరించిన ఆరోగ్య సంరక్షణ_: డాక్టర్‌లకు మీ పూర్తి ఆరోగ్య చరిత్రకు ప్రాప్యత ఉంటుంది
    - _వయస్సు పరిమితులు లేవు_: అన్ని వయసుల భారతీయ పౌరులకు అందుబాటులో ఉంది
    - _ఆదాయ పరిమితులు లేవు_: ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు

    _యోగ్యతా ప్రమాణాలు:_
    - భారత పౌరసత్వం
    - చెల్లుబాటులో ఉన్న ఆధార్ కార్డ్ లేదా డ్రైవింగ్ లైసెన్స్
    - ఆధార్‌కి లింక్ చేయబడిన మొబైల్ నంబర్
    - నిర్దిష్ట వయస్సు పరిమితులు లేవు

    _ఎలా దరఖాస్తు చేయాలి:_
    1. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ABDM) వెబ్‌సైట్‌ని సందర్శించండి లేదా ABHA యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి
    2. ఆధార్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ ఉపయోగించి ఖాతాను సృష్టించండి
    3. OTPతో మొబైల్ నంబర్‌ను ధృవీకరించండి
    4. వ్యక్తిగత వివరాలను పూరించండి మరియు ABHA నంబర్‌ను రూపొందించండి
    5. మీ ABHA కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసి ప్రింట్ చేసుకోండి
    2.5K Views
  • *టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య* .
    *టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య*  ఏపీ – మంగళగిరి మండలం: పెదవడ్లపూడిలో కుటుంబ కలహాలు విషాదానికి దారితీశాయి. టీవీ సౌండ్ తగ్గించమన్న విషయంపై జరిగిన వాగ్వాదం చివరికి హత్యకు దారితీసింది. పోలీసుల సమాచారం ప్రకారం, పెదవడ్లపూడికి చెందిన షేక్ అహ్మద్ (26) ఏసీ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. ఏడాదిన్నర క్రితం క్రాంతి అనే మహిళతో పరిచయం ఏర్పడి, అది వివాహేతర...
    416 Views
  • చీరాల మండలం కొత్తపాలెం గ్రామపంచాయతీ పరిధిలో ఆటో ఢీకొని 18 నెలల పాప మృతి
    చీరాల: చీరాల మండలం కొత్తపాలెం గ్రామపంచాయతీ పరిధిలోని దళిత నగర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. 18 నెలల చిన్నారి సాయి దుర్గ రహదారిపై ఆడుకుంటూ ఉండగా, ప్రమాదవశాత్తు ఒక ఆటో ఆమెపై నుంచి వెళ్లినట్లు సమాచారం.పాప తల్లి పేరు పూజ, తండ్రి పేరు యాదగిరి శివకృష్ణ. భార్యాభర్తలు గత మూడు సంవత్సరాలుగా కుటుంబ కలహాల కారణంగా వేర్వేరుగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో పూజ తన ముగ్గురు పిల్లలతో కలిసి తన తల్లి ఇంటి వద్ద...
    348 Views
  • బాపట్ల తీర ప్రాంత అభివృద్ధికి అనువైన విధానాలను రూపొందించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్, ఐ.ఏ.ఎస్.
    బాపట్ల: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతినిధి బృందం, బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్, ఐ.ఏ.ఎస్. గారి నేతృత్వంలో, నాలుగు రోజుల అధ్యయన పర్యటన నిమిత్తం Goa రాష్ట్రానికి చేరుకుంది. పర్యటనలో భాగంగా గురువారం ప్రతినిధి బృందం మొదటగా రాష్ట్ర గవర్నర్ Pusapati Ashok Gajapathi Raju గారిని మర్యాదపూర్వకంగా కలుసుకుని, ఈ పర్యటన ఉద్దేశ్యం మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము బాపట్ల తీర ప్రాంత...
    308 Views
  • అమరావతిలో కుప్పడం చీరకు జాతీయ అవార్డు, చేనేత వస్త్రాలను ధరించండి
    అమరావతి: చీరాల శాసనసభ్యులు ప్రత్యేక అభినందనలు స్వీకరించారు అసెంబ్లీ ఆవరణలో ఆప్కో ఆధ్వర్యంలో చీరాల కుప్పడం చీరలు కొనుగోలు చేసిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు.మంత్రి ఆధ్వర్యంలో కుప్పడం చీర కొనుగోలు చేసి, కుప్పడం ప్రత్యేకతను వివరించిన చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య.కుప్పడం చీరకు జాతీయ అవార్డు లభించడంతో చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య, చీరాల నేతన్నను ప్రత్యేకంగా అభినందించిన మంత్రి...
    324 Views
  • మదనపల్లెలో రాస్తారోకో - 30 మందికి 41 నోటీసులు జారీ.
    మదనపల్లెలో ఏడేళ్ల బాలిక హత్యకు నిరసనగా రాస్తారోకో నిర్వహించిన 30 మందికి డీఎస్పీ మహీంద్ర గురువారం సాయంత్రం 41 నోటీసులు జారీ చేశారు. మంగళవారం జరిగిన ఈ హత్యకు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు రోడ్లపై బైఠాయించి, పోలీసు విధులకు ఆటంకం కలిగించారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో పాల్గొన్న వారిని గుర్తించి, కేసు నమోదు చేసి, నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు.
    294 Views
  • మదనపల్లిలో 60 లక్షల భూమి అగ్రిమెంట్ వివాదం: మోసం, బెదిరింపుల ఆరోపణలు.
    అన్నమయ్య జిల్లా మదనపల్లిలో భూ విక్రయ వ్యవహారం వివాదాస్పదమైంది. ఎస్బీఐ కాలనీకి చెందిన శ్రీరాములు, డీకే తేజస్విని పేరుపై ఉన్న రెండు ఎకరాల భూమిని అమ్ముతామని చెప్పి రూ.60 లక్షలకు అగ్రిమెంట్ చేసుకుని మోసం చేశారని బాధితుడు శుక్రవారం ఆరోపించారు. కే.అమర్నాథ్ 2022 నుంచి డబ్బు విషయంలో ఇబ్బందులు పెడుతున్నాడని, డబ్బు అడిగితే రౌడీలతో బెదిరిస్తున్నాడని వాపోయారు. అగ్రిమెంట్ తన భార్య వై లక్ష్మీదేవి పేరుపై...
    260 Views