Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • మదనపల్లెలో టమాటా ధరల పతనం: రైతుల ఆందోళన.
    ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా మదనపల్లె మార్కెట్‌లో టమాటా ధరలు ఒక్కరోజులోనే భారీగా పడిపోయాయి. నిన్న 24 కిలోల బాక్స్‌కు రూ.320 వరకు పలికిన ధర, ఈరోజు రూ.250కు పడిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మార్కెట్‌లో లావాదేవీలు 24 కిలోల బాక్స్‌ల ఆధారంగానే జరుగుతున్నాయి. నిన్న మంచి డిమాండ్ ఉన్నప్పటికీ, ఈరోజు మార్కెట్ మందగించింది
    268 Views
  • పుంగునూరు నియోజకవర్గం:సదుంలో చత్రపతి శివాజీ జయంతి
    పుంగనూరు నియోజకవర్గం, సదుంలో చత్రపతి శివాజీ జయంతిని పలువురు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శివాజీ మహారాజ్ ధైర్యసాహసాలు, సమర్థ పరిపాలన, ప్రజల భద్రత, న్యాయపాలనకు ప్రతీకగా నిలిచారని కొనియాడారు. ఆయన పరిపాలనా వ్యవస్థలో వివిధ వర్గాల ప్రతిభావంతులకు అవకాశం ఇచ్చి, సమానత్వాన్ని ప్రోత్సహించారని తెలిపారు# కొత్తూరు మురళి.  
    293 Views
  • హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత
    హైదరాబాద్: అమీన్‌పూర్‌ పరిధిలో పోలీసులు భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ప్రత్యేక ఆపరేషన్‌ బృందం (SOT) పోలీసులు నిర్వహించిన దాడిలో సుమారు రెండున్నర కిలోల OPM డ్రగ్స్ పట్టుబడ్డాయి.
    ఈ కేసులో రాజస్థాన్‌కు చెందిన ముగ్గురిని అరెస్ట్ చేశారు. డ్రగ్స్‌ను నగరానికి అక్రమంగా తరలించి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
    సీజ్ చేసిన డ్రగ్స్ విలువ లక్షల్లో ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అరెస్టు చేసిన వారిని విచారిస్తున్నామని, ఈ రాకెట్ వెనుక మరెవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
    138 Views
  • పుంగనూరు నియోజకవర్గం కొత్తూరు మురళి: అగ్నిప్రమాదంలో 140 చెట్లు దగ్ధం
    పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలో గురువారం ఖలీల్ సాహెబ్ కు చెందిన రెండు ఎకరాల మామిడి తోటలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు 140 మామిడి చెట్లు దగ్ధమయ్యాయి. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి.
    283 Views
  • మదనపల్లిలో రోడ్డు ప్రమాదం – చిరు వ్యాపారికి తీవ్ర గాయాలు.
    మదనపల్లెలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చిరు వ్యాపారి టి. శ్రీనివాసులు తీవ్రంగా గాయపడ్డారు. వ్యక్తిగత పనిమీద బైక్‌పై వెళ్తుండగా గురుకుల పాఠశాల రోడ్డులో ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది. స్థానికులు శ్రీనివాసులును వెంటనే ఆసుపత్రికి తరలించారు. టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
    301 Views
  • మదనపల్లెలో బాలిక హత్య కేసులో నిందితుడి తల్లి ఉద్యోగం తొలగింపు.
    మదనపల్లెలో ఏడేళ్ల బాలిక హత్య కేసులో సంచలనం రేపుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన కులవర్ధన్ తల్లి అంజలిని ఉద్యోగం నుంచి తొలగించారు. అంజలి వెంకటేశ్వరపురం ప్రభుత్వ పాఠశాలలో ఆయాగా పనిచేస్తోంది. తన కుమారుడు చేసిన హత్య ఘటనకు సంబంధించి ఆమెపై కూడా పోలీసులు కేసు నమోదు చేసి ఏ2 నిందితురాలిగా చేర్చారు. ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు పాఠశాల హెచ్ఎం రమణమ్మ గురువారం అంజలిని ఆయా ఉద్యోగం నుంచి తొలగించినట్లు...
    344 Views
  • మదనపల్లెలో బాలికపై హత్యాచారం.. A2 ఇంటి వద్ద పహారా.
    మదనపల్లెలో బాలికపై అత్యాచారం, హత్య కేసులో ఏ2 నిందితురాలు తలారి అంజలి ఇంటి వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిందితుడు కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో, కేసులోని కీలక ఆధారాలు చెరిగిపోకుండా SP దీరజ్, DSP మహీంద్ర ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకున్నారు. సోమవారం జరిగిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. దర్యాప్తు వేగవంతం చేసేందుకు పోలీసులు ఇంటిని తమ అధీనంలో ఉంచారు.
    293 Views
  • పుంగునూరు నియోజకవర్గం : అగ్నిప్రమాదంలో 140 చెట్లు దగ్ధం
    పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలో గురువారం ఖలీల్ సాహెబ్ కు చెందిన రెండు ఎకరాల మామిడి తోటలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు 140 మామిడి చెట్లు దగ్ధమయ్యాయి. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి.
    286 Views
  • మదనపల్లెలో దంపతులపై దాడి – తీవ్ర గాయాలు.
    మదనపల్లె మండలం, పొన్నేటి పాళ్యం పంచాయతీ, పనసమాకులపల్లె గ్రామంలో గురువారం రైతు శంకర (48), అతని భార్య ఆదిలక్ష్మి (38)లపై ప్రత్యర్థులు కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఆవులు పొరుగు పొలంలో పంట మేసాయనే సాకుతో పాటు పాత కక్షలను కారణంగా చేసుకుని ఈ దాడి జరిగినట్లు బాధితులు తెలిపారు. గాయపడిన దంపతులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు.
    298 Views
  • మదనపల్లె బాలిక హత్య కేసు –రేపిస్ట్ మృతదేహం చెత్తకుప్పలో ఖననం.
    మదనపల్లెలో బాలికపై హత్యాచారం కేసులో నిందితుడు కులవర్ధన్ మృతదేహాన్ని తల్లిదండ్రులు, బంధువులు స్వీకరించకపోవడంతో, మున్సిపల్ సిబ్బంది గురువారం రాత్రి అతన్ని ఖననం చేశారు. చెత్తకుప్పలో మృతదేహాన్ని శ్మశానానికి తరలించడం జరిగింది. బాలికలు, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే కామాంధుల శవాలు చెత్తతో సమానమని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం, పోలీసులు ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు...
    265 Views