బాపట్ల జిల్లా: చిన్నగంజాం మండలం సోపిరాల, కొత్తపాలెం గ్రామలలో దేవాలయాలను సందర్శించిన జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపిఎస్ గారు. సంబంధిత శాఖ అధికారులతో ప్రత్యేక సమన్వయ సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ గారు అన్ని శాఖలు సమన్వయంతో వ్యవహరిస్తూ శివరాత్రి ఉత్సవాలను సమర్ధవంతంగా నిర్వహించాలి. ఏటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపడుతున్నాం. భక్తులు...
బాపట్ల: పొట్టి శ్రీరాములు ఏరియా వైద్యశాలకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ వారిని ఆరోగ్యం వంతులుగా తీర్చిదిద్దుతున్నామని బాపట్ల ఏరియా వైద్యశాల సూపర్డెంట్ డాక్టర్ సిద్ధార్థ అన్నారు. గురువారం ఏరియా వైద్యశాలలో సిబ్బంది పనితీరు, ఎక్సరే, స్కానింగ్, రక్త పరీక్షలు, మందులు పంపిణీ చేసే గది, ఎమర్జెన్సీ వార్డ్, సాధారణ వార్డులు క్షుణంగా పరిశీలించి వైద్యశాలలో చికిత్స పొందుతున్న రోగుల వద్దకు...
ఈరోజు అనగా 11-2-2026 న ఉదయం 11 గంటలకు ఆంధ్ర రత్న భవన్ పార్టీ ఆఫీసు నందు ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి అల్కా లాంబ గారి ఆదేశాల మేరకు శ్రీమతి ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రేట్రీ ఇంచార్జ్ శ్రీమతి కమలాక్షి గారు ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ సెక్రేట్రీ ఇన్చార్జి శ్రీమతి ఆదితా గారు ఆదేశాలతో ఈరోజు ఉదయం 11 గంటలకు మహిళా కాంగ్రెస్ సమావేశం చేపట్టడం జరిగింది. ఈ సమావేశంలో ఆదిత గారు...
పుంగనూరు అగ్నిమాపక కేంద్ర పరిధిలోని చిలకవారి గ్రామంలో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో రమణప్ప అనే రైతుకు చెందిన వరిగడ్డివాములు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ. 25 వేల వరకు నష్టం జరిగినట్లు అగ్నిమాపక అధికారి తెలిపారు# కొత్తూరు మురళి.
పుంగనూరు రౌడీషీటర్ డీజే భాస్కర్ కర్ణాటక నంగిలి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్యకు గురికావడం తెలిసిందే. ఈ కేసులో మూలాలు మదనపల్లెలో ఉన్నట్లు బయటపడింది. డెడ్ బాడీ ఆంధ్ర సరిహద్దులో దొరికింది. దీనిపై కేసు నమోదు చేసిన సంగిలి పోలీసులు విభిన్నకోణాల్లో దర్యాప్తు సాగించారు. అనంతరం మదనపల్లెలోని ఓ పెట్రోల్ బంకులో పనిచేసే యువతి నుంచి కొన్ని వివరాలు రాబట్టినట్లు సమాచారం# కొత్తూరు మురళి .
గురువారం పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం, బూరగమంద సచివాలయంలో ఎమ్మార్వో ప్రమీల ఆధ్వర్యంలో పిఎం ఉజ్వల్ యోజన పథకం కింద పలువురు ఎస్టీలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు, స్టవ్, రెగ్యులేటర్, పైప్ పంపిణీ చేశారు. రేషన్ కార్డు ఉండి గ్యాస్ కనెక్షన్లు లేనివారు ఈ నెలాఖరులోపు దరఖాస్తు చేసుకోవాలని ఏజెన్సీ నిర్వాహకులు వంశీ తెలిపారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు# కొత్తూరు మురళి.