Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • 2026 అంతర్జాతీయ యువత లేఖారచన పోటీ తేదీ మార్పు.
    కడప డివిజన్ తపాలా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న 2026 అంతర్జాతీయ యువత లేఖారచన పోటీ తేదీ మారినట్లు అన్నమయ్య జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్రహ్మణ్యం బుధవారం తెలిపారు. పరిపాలనా కారణాల వల్ల ముందుగా ఫిబ్రవరి 14న నిర్వహించాల్సిన ఈ పోటీని ఫిబ్రవరి 22 (ఆదివారం)కు వాయిదా వేశారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా అవగాహన కల్పించాలని ఉప విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు, పాఠశాలల...
    476 Views
  • మదనపల్లి: నేడు విద్యార్థులకు అవగాహన సదస్సు.
    యువత, విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిస కాకుండా అవగాహన కల్పించేందుకు గురువారం సర్వోదయ డి అడిక్షన్ సెంటర్ ఆధ్వర్యంలో ప్రత్యేక సదస్సు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు బుధవారం డీఈవోను వారు కలిశారు. గురువారం సాయంత్రం 3 గంటలకు మదనపల్లి పట్టణంలోని జ్ఞానోదయ స్కూల్లో తొలి కార్యక్రమం నిర్వహిస్తామని పేర్కొన్నారు. మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడమే...
    274 Views
  • అన్నమయ్య జిల్లా డీపీఎంఓగా బాధ్యతలు స్వీకరించిన రమేష్ బాబు.
    అన్నమయ్య జిల్లా ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్ ఆఫీసర్ (డీపీఎంఓ)గా డాక్టర్ రమేష్ బాబు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. నిమ్మనపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్‌గా పనిచేసిన ఆయనకు జిల్లా వైద్యాధికారి డాక్టర్ లక్ష్మీనరసయ్య ఈ కీలక బాధ్యతలను అప్పగించారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపిన డాక్టర్ రమేష్ బాబు, జిల్లాలో ప్రభుత్వ వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ...
    286 Views
  • వెట్టిచాకిరి చేయిస్తున్నారని కలెక్టర్‌కు డాక్టర్ల ఫిర్యాదు.
    మదనపల్లె జిల్లా ఆస్పత్రి అత్యవసర విభాగంలో కేవలం నలుగురు డాక్టర్లతోనే వెట్టిచాకిరి చేయిస్తున్నారని క్యాజువాలిటీ డాక్టర్లు అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్‌కు బుధవారం ఫిర్యాదు చేశారు. గతంలో పది మంది డాక్టర్లు పనిచేసేవారని, ప్రస్తుతం మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్ మరో ఇద్దరిని తగ్గించి నలుగురితోనే విధులు చేయిస్తున్నారని తెలిపారు. లక్షల జీతాలు తీసుకునే ఇద్దరు ఎముకల డాక్టర్లు ఏడాది...
    294 Views
  • వ్యవసాయాo లాభసాటిగా చేసేందుకు డ్రోన్ సేవలు పెంచాలి– కలెక్టర్.
    అన్నమయ్యజిల్లా మదనపల్లి : కలెక్టర్ నిశాంత్ కుమార్, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు డ్రోన్ ఉబెరైజేషన్ సేవలను విస్తరించాలని, ఈ-పంట నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్షలో, పీఎం- కిసాన్ రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య కేటాయింపును త్వరగా పూర్తి చేయాలని, యూరియా కొరత లేకుండా చూడాలని, ఉద్యానవన పంటల సాగును ప్రోత్సహించాలని...
    324 Views
  • పేకాట ఆడుతున్న నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు.
    అన్నమయ్య జిల్లా మదనపల్లి: రామసముద్రం మండలం కనగాని గ్రామ సమీపంలోని బసనపల్లి చెరువు వద్ద పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.9,300 నగదు, నాలుగు మోటార్ సైకిళ్లు, నాలుగు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటన మదనపల్లె ప్రాంతంలో జరిగింది.
    300 Views
  • Chintakayala Ayyanna Patrudu: ఏపీ అసెంబ్లీలో నేటి నుంచి కొత్త టెక్నాలజీ... సీట్లో కూర్చుంటేనే ఆటెండెన్స్!
    Andhra Chintakayala Ayyanna Patrudu Announces New AI Attendance System in AP Assembly ఏపీ అసెంబ్లీలో నేటి నుంచి ఏఐ ఆధారిత హాజరు విధానం. సభ్యులు తమ సీట్లలో కూర్చుంటేనే అటెండెన్స్ నమోదు కొత్త విధానాన్ని అధికారికంగా ప్రకటించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు 2028 డిసెంబర్ నాటికి కొత్త అసెంబ్లీ భవనం సిద్ధమవుతుందని వెల్లడి వైసీపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ ఆసక్తికర వ్యాఖ్యలు   ఆంధ్రప్రదేశ్ శాసనసభలో...
    262 Views
  • పుంగనూరు నియోజకవర్క్క:పై కొడవలితో దాడి తమ్ముడు అరెస్ట్
    పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం దిగువపల్లి గ్రామపంచాయతీ బోయకొండ యానాదిపాలెంలో బుధవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. తమ్ముడు నాగరాజు వేటకొడవలితో అక్క గంగులమ్మపై దాడి చేయడంతో ఆమె ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి, ఎడమ చేతి బొటనవేలు తెగిపోయింది. బాధితురాలిని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి, అనంతరం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. నిందితుడు నాగరాజును కొలింపల్లి బస్‌స్టాప్ వద్ద అరెస్ట్ చేసి పుంగనూరు...
    366 Views
  • పుంగనూరు నియోజకవర్గం : మిగిలిన 24 మండలాలలో బర్డ్ ఫ్లూ గుర్తించలేదు
    అన్నమయ్య జిల్లాలోని పుంగనూరు నియోజకవర్గంలో సదుం మండలం మినహా మిగిలిన 24 మండలాలలో బర్డ్ ఫ్లూ గుర్తించలేదని కలెక్టర్ నిశాంత్ కుమార్ బుధవారం స్పష్టం చేశారు. సదుం మండలంలో బర్డ్ ఫ్లూ సోకిన కోళ్లను పూర్తిగా ఖననం చేశామని, ప్రజలు దీనిపై భయపడాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. చికెన్ ఉత్పత్తులను 100 డిగ్రీల సెల్సియస్ వద్ద వేడి చేసి నిరభ్యంతరంగా తినవచ్చని జెడి గుణశేఖర్ పిళ్ళై తెలియజేశారు# కొత్తూరు మురళి.
    300 Views
  • మదనపల్లిలో భర్తపై భార్య కత్తితో దాడి – హత్యాయత్నం.
    మదనపల్లి మండలంలో గురువారం ఉదయం భార్య శ్యామల, మద్యం తాగి ఇంటికి వచ్చిన భర్త మల్లూరి సుబ్రహ్మణ్యం రెడ్డి (43)పై కొడవలితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన నాయునివారి పల్లిలో జరిగింది. తీవ్రంగా గాయపడిన సుబ్రహ్మణ్యం రెడ్డిని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
    286 Views