Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • ప్లాస్టిక్‌కు స్వస్తి.. పర్యావరణ పరిరక్షణే లక్ష్యం! అయ్యప్ప స్వాములకు స్టీల్ ప్లేట్ల పంపిణీ
    ప్లాస్టిక్‌కు స్వస్తి.. పర్యావరణ పరిరక్షణే లక్ష్యం! అయ్యప్ప స్వాములకు స్టీల్ ప్లేట్ల పంపిణీ   తల్లాడ: ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణతో పాటు అయ్యప్ప దీక్షలో ఉన్న స్వాముల ఆరోగ్యంపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో విశ్వబ్రాహ్మణ జర్నలిస్ట్ అసోసియేషన్ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి రుద్రాక్ష నరసింహచారి వినూత్న సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.   తల్లాడ...
    7 Views
  • గుంటూరు, తెనాలిలో 27 28 తేదీలలో పోస్టల్ బ్యాలెట్ కేంద్రాలు
    గుంటూరు నగరపాలక సంస్థ, తెనాలి పురపాలక సంఘం ఈనెల 27,28 తేదీలలో పోస్టల్ బ్యాలెట్ ఫెసిటీలేషన్ కేంద్రాలలో ఏర్పాటు చేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సాయికాంత్ వర్మ ఆదేశించారు.మునిసిపల్ కమిషనర్లు, ఆర్డీవోలు, రిటర్నింగ్ అధికారులు, జోనల్ అధికారులు,రూట్ అధికారులతో జిల్లా ఎన్నికల అధికారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
    6 Views
  • తెనాలిలో 87 నామినేషన్లు ఆమోదం....
    ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. అక్టోబర్ 21 నుంచి 23 వరకు తెనాలి మండలంలో మొత్తం 87 నామినేషన్లు దాఖలు అయ్యాయి.అన్నింటిని ఆమోదించినట్లు రిటర్నింగ్ అధికారి దుర్గాబాయి తెలిపారు. వైసిపి 39,టిడిపి 23,జనసేన 14,బిజెపి 1,స్వతంత్రులు 10, నామినేషన్లు దాఖలైనాయి.నామినేషన్ ఉపసంహరణకు ఈ నెల 27వ తేదీన 3 గంటల వరకు సమయం ఇచ్చారు. పోలింగ్ 3 తేదీ జరగనుంది.
    9 Views
  • తెనాలి డిపోకు రు.2.16 కోట్ల దసరా ఆదాయం
    దసరా సందర్భంగా ఆర్టీసీ నడిపిన ప్రత్యేక బస్సులకు ఆదరణ లభించిందని తెనాలి డిపో మేనేజర్ రాజశేఖర్ తెలిపారు అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు డిపో పరిధిలో రు. 4.29 లక్షల మంది రాకపోకలు సాగించారన్నారు ఇందులో 2.88 లక్షల మంది మహిళలు ఉచిత బస్సు సదుపాయాన్ని వినియోగించుకున్నారని వివరించారు దసరా రద్దీ ద్వారా డిపోకురు.2.16 కోట్ల ఆదాయం సమకూరిందని ఆయన తెలిపారు.
    5 Views