Posts
See what everyone’s up to and what’s on their minds
Posts
-
-
మదనపల్లె: మదనపల్లె మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులో జనసేన పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి మల్లిక ఎన్నికల ప్రచారాన్ని జోరుగా నిర్వహిస్తున్నారు. వార్డులోని ప్రజలను కలుసుకుంటూ తనకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. ఆమెకు మద్దతుగా జనసేన పార్టీ నాయకురాలు జయ భవ్య ప్రచారంలో పాల్గొని ఓటర్లను కలిసి పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా జయ భవ్య మాట్లాడుతూ, మదనపల్లె పట్టణ అభివృద్ధి కోసం కూటమి అభ్యర్థులకు ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి శ్రీరామ్ కుమార్ చినబాబును గెలిపించడంతో పాటు, 5వ వార్డు జనసేన కౌన్సిలర్ అభ్యర్థి మల్లికను కూడా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల సమస్యల పరిష్కారం, వార్డు అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగాలని అభ్యర్థులు కృషి చేస్తారని తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.8 Views
-
Madanapalle: మదనపల్లె మున్సిపాలిటీ పరిధిలోని 35వ వార్డులో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. వైఎస్సార్సీపీ కౌన్సిలర్ అభ్యర్థి శారదమ్మ వార్డులో విస్తృతంగా పర్యటిస్తూ ఓటర్లను కలుసుకుని ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆమెకు మద్దతుగా మాజీ మున్సిపల్ చైర్మన్ మనుజా రెడ్డి ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా మనుజా రెడ్డి మాట్లాడుతూ, 35వ వార్డు ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. వార్డు అభివృద్ధి, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. శారదమ్మకు మద్దతుగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రచారంలో పాల్గొంటున్నారని చెప్పారు. మదనపల్లె పట్టణ సమగ్ర అభివృద్ధి కోసం వైఎస్సార్సీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి జింక వెంకట చలపతిని గెలిపించాలని మనుజా రెడ్డి ప్రజలను కోరారు. ఎన్నికల ప్రచారంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఓటర్లను కలిసి తమ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.8 Views
-
*మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని నవీన్ రావు గెస్ట్ హౌస్ లో జరిగిన మరిపెడ, చిన్నగూడూరు, సీరోలు మండలాల బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొని ప్రసంగించిన మహబూబాబాద్ మాజీయంపి, ఎమ్మెల్సీ ఎన్నికల నియోజకవర్గ ఇంచార్జ్, మాలోత్ కవిత, మాజీమంత్రి, డోర్నకల్ మాజీఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్, మహబూబాబాద్ జిల్లాగ్రంధాలయసంస్థ మాజీచైర్మన్ గుడిపుడి నవీన్ రావు తదితరులు..*
*సమన్వయ సమావేశంలో పాల్గొన్న ఆయా మండలాల పరిధిలోని బిఆర్ఎస్ పార్టీ నాయకులు...*5 Views -
Madanapalle: మదనపల్లె పట్టణంలోని 1, 2, 3వ వార్డుల్లో వైఎస్సార్సీపీ కౌన్సిలర్ అభ్యర్థులకు మద్దతుగా నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ నాయకులకు మూడవ వార్డు ప్రజల తరఫున రుక్సార్ సుల్తానా, మహమ్మద్ హనీఫ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమంలో మదనపల్లె వైసీపీ సమన్వయ కార్యకర్త నిస్సార్ అహ్మద్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి, సీనియర్ నాయకులు బాబ్జాన్, మాజీ మున్సిపల్ చైర్మన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి జింకా వెంకటచలపతి, యువ నాయకుడు శశాంక్ రెడ్డి పాల్గొని కౌన్సిలర్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.5 Views
-
-
ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. ఇది దశలవారీగా బలపడి "అతి తీవ్ర తుపాను"గా మారి ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకొచ్చే ప్రమాదం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 28వ తేదీ ఉదయం బాపట్ల, విశాఖపట్నం మధ్య తీరాన్ని దాటే సూచనలు ఉన్నాయని, ఈ మేరకు ఆంధ్రప్రదేశ్, యానాం తీరాలకు ఆరెంజ్ మెసేజ్ జారీ చేసింది. తుపాను ప్రభావంతో భారీ వర్షాలు, ప్రచండ గాలులు వీచే అవకాశం ఉండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
ఆదివారం ఉదయం 11:30 గంటల సమయానికి ఈ తీవ్ర వాయుగుండం విశాఖపట్నానికి ఆగ్నేయంగా 870 కిలోమీటర్ల దూరంలో, కాకినాడకు 960 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. అదేవిధంగా, మచిలీపట్నానికి 1,060 కిలోమీటర్లు, బాపట్లకు 1,130 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం గంటకు 5 కిలోమీటర్ల నెమ్మది వేగంతో నైరుతి దిశగా కదులుతున్న ఈ వ్యవస్థ, సోమవారం (అక్టోబర్ 26) ఉదయానికి తుపానుగా మారనుంది.
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, ఈ తుపాను అక్టోబర్ 27 ఉదయానికి తీవ్ర తుపానుగా, అక్టోబర్ 28 ఉదయానికి అతి తీవ్ర తుపానుగా రూపాంతరం చెందుతుంది. అనంతరం వాయవ్య దిశగా పయనించి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించి, ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలోకి రానుంది. అక్టోబర్ 28వ తేదీ మధ్యాహ్నంలోపు బాపట్ల-విశాఖపట్నం మధ్య, యానాం సమీపంలో ఇది తీరం దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. తీరం దాటే సమయంలో గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో పెను గాలులు వీస్తాయని, గరిష్ఠంగా గంటకు 140 కిలోమీటర్ల వేగాన్ని కూడా తాకే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.3 Views -
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. వారాంతపు సెలవుల నేపథ్యంలో శనివారం నుంచి తిరుమల కొండపై భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనం కోసం సుమారు 18 గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు వెల్లడించారు.
భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోయాయి. దీంతో క్యూ లైన్లు వెలుపల ఉన్న శిలాతోరణం వరకు విస్తరించాయి. వారాంతం కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
కాగా, నిన్న (శనివారం) ఒక్కరోజే 81,768 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, వీరిలో 34,018 మంది తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.57 కోట్లుగా నమోదైనట్లు టీటీడీ పేర్కొంది.3 Views