Madanapalle: మదనపల్లె పట్టణంలోని 1, 2, 3వ వార్డుల్లో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ అభ్యర్థులకు మద్దతుగా నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ నాయకులకు మూడవ వార్డు ప్రజల తరఫున రుక్సార్ సుల్తానా, మహమ్మద్ హనీఫ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమంలో మదనపల్లె వైసీపీ సమన్వయ కార్యకర్త నిస్సార్ అహ్మద్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి, సీనియర్ నాయకులు బాబ్జాన్, మాజీ మున్సిపల్ చైర్మన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి జింకా వెంకటచలపతి, యువ నాయకుడు శశాంక్ రెడ్డి పాల్గొని కౌన్సిలర్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.
9 Views