Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • రోలుగుంటలో జనసేన నూతన పార్టీ కార్యాలయం ప్రారంభం
    చోడవరం నియోజకవర్గం రోలుగుంట మండలంలో జనసేన పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం, ఆత్మీయ సమావేశం సోమవారం చోడవరం నియోజకవర్గ ఇంచార్జి పీవీఎస్ఎన్ రాజు ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మండలంలోని వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు తరలివచ్చారు.తొలుత పార్టీ నాయకులు, వీర మహిళలు, జనసైనికులు రోలుగుంట గ్రామంలో భారీ కవాతు నిర్వహించి పార్టీ జెండాను...
    68 Views
  • శాంతిభద్రతలకు వైసీపీ భంగం కలిగిస్తోంది: CM
    AP: స్థానిక సంస్థల ఎన్నికల్లో శాంతిభద్రతలకు భంగం కలిగించేలా వైసీపీ వ్యవహరిస్తోందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. ఆ పార్టీ చర్యలను గమనిస్తూ అధికారులను అప్రమత్తం చేయాలని నాయకులకు సూచించారు. ఇవాళ ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్నిచోట్లా గెలవాలని, 2024 ఎన్నికలను మించి ఓట్ల శాతం పెరగాలని స్పష్టం చేశారు. కూటమి పార్టీలతో సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఆదేశించారు.
    237 Views
  • 2026 ఎన్నికల సన్నాహాలపై ఆర్బో సమీక్ష
    తెనాలి.జడ్పిటిసి,ఎంపీటీసీ ఎన్నికల సన్నాహాలను ఆర్వో డి.దుర్గాబాయి సమీక్షించారు. స్థానిక ఎన్విఆర్ కళాశాలలో పంపిణీ కౌంటింగ్ కేంద్రాలు,స్ట్రాంగ్ రూములను ఆమె పరిశీలించారు. తెనాలి మండలంలోని 21 స్థానాలకు 79 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల పిఓ,ఓపిఓ లకు ఇక్కడ శిక్షణ ఇవ్వనున్నారు. 21 నుండి 23 వరకు నామినేషన్లు, 27న ఉపసంహరణ, నవంబర్ 3న పోలింగ్, నవంబర్ ఐదున కౌంటింగ్ జరగనుంది అన్నారు.
    197 Views
  • తెనాలి ఎన్నికల్లో ఆసక్తి చూపుతున్న అభ్యర్థులతో మంత్రి మనోహర్ ముఖాముఖి
    తెనాలి.జనసేన పార్టీ కార్యాలయంలో స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న అభ్యర్థులతో పార్టీ పీఏసీ చైర్మన్, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖాముఖి సమావేశమయ్యారు. ఎన్నికల సందర్భంగా అభ్యర్థుల ఆసక్తి,స్థానిక సమస్యలు, పార్టీ బలోపేతంపై చర్చించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితులపై అభ్యర్థుల అభిప్రాయాలను తెలుసుకున్నారు.
    179 Views
  • తెనాలి. బిజిగా ఉన్నా...... విచారణకు రాలేను. అన్నాబత్తుని...
    తెనాలి. స్థానిక సంస్థల ఎన్నికల పనుల కారణంగా పోలీసుల విచారణకు హాజరు కాలేనని మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ తెలిపారు. ఈ మేరకు తన న్యాయవాది ద్వారా తెనాలి వన్టౌన్ సీఐ కి సమాచారం అందించారు. వైసిపి ఇన్చార్జిగా అభ్యర్థుల ఎంపికలో బిజీగా ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే ఈనెల 23న విచారణకు రావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు.అన్నాబత్తుని 14న తొలి విచారణకు వెళ్లారు.
    174 Views
  • తెనాలి పి ఓ,ఏపీఓ ల సిక్షనను పరిశీలించి న కమిషనర్....
    తెనాలి. రామకృష్ణ కవి కళాక్షేత్రంలో పిఓ, ఏపీఓల శిక్షణను కమిషనర్ రామ అప్పలనాయుడు పరిశీలించారు.ఎన్నికలకు పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించాలని అన్నారు. నిబంధనలను కచ్చితంగా పాటించాలని తెలిపారు. పోలింగ్ ప్రక్రియ, సామాగ్రి వినియోగంపై అవగాహన పెంచుకోవాలని తెలిపారు. పొరపాట్లకు తావు లేకుండా సిబ్బంది సమన్వయంతో,బాధ్యతగా పనిచేసీ ఎన్నికలను సజావుగా విజయవంతం చేయాలని అధికారులను సూచించారు.
    200 Views
  • తెనాలిలో కూటమి చైర్మన్ అభ్యర్థిగా తోటకూర రమణారావు
    తెనాలి.మున్సిపాలిటీ ఎన్నికల కూటమి సీట్ల పంపకంలో జనసేన పార్టీకి కేటాయించారు. దీంతో కూటమి తరపున జనసేన అభ్యర్థులు బరిలోకి దిగనున్నారు. తెనాలి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ప్రముఖ వ్యాపారవేత్త,కాపు నేత,కనకదుర్గమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డు మెంబర్ర్ తోటకూర వెంకట రమణారావు ఖరారయ్యారు. ఈ ప్రకటనతో తెనాలి రాజకీయాల్లో ఎన్నికల వేడి పెరిగింది.పోటీ ఆసక్తికరంగా మారనుంది.
    184 Views
  • బెల్లంపల్లి ఆర్ముడ్ హెడ్ క్వార్టర్స్‌ను సందర్శించిన సీపీ అంబర్ కిషోర్ ఝా
    బెల్లంపల్లి, శనివారం: రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా శనివారం బెల్లంపల్లి ఆర్ముడ్ హెడ్ క్వార్టర్స్‌ను సందర్శించి నిర్వహణ తీరును సమగ్రంగా సమీక్షించారు.ఈ సందర్భంగా హెడ్ క్వార్టర్స్‌లోని ఆర్‌ఐ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయం, స్టోర్ రూమ్, రికార్డుల నిర్వహణ తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఆర్‌ఐ సంపత్‌తో సమావేశమై హెడ్ క్వార్టర్స్‌లో విధులు...
    134 Views
  • నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న INTUC కేంద్ర నాయకులు – కార్మికుల సంక్షేమమే లక్ష్యమని వెల్లడి
    శ్రీరాంపూర్: దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీరాంపూర్ ఏరియాలోని SRP OC, SRP-3 గనుల పరిధిలో ఉన్న మైసమ్మ ఆలయాల్లో చండీయాగం, మహా అన్నదాన కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా INTUC సీనియర్ సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ ధర్మపురి, బెల్లంపల్లి రీజియన్ ఇన్‌చార్జి, సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కాంపల్లి సమ్మన్న, సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్...
    134 Views