Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • హామీలు అమలు చేయాలి.. దీక్షలు ఆగాలి.|
    ● అల్వాల్ జేఏసీ చైర్మన్ పటోళ్ల సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో దీక్షలు ● ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని డిమాండ్ అల్వాల్, సెప్టెంబర్ 30: తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరుతూ అల్వాల్ సర్కిల్ తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు 14వ రోజుకు చేరుకున్నాయి.  జేఏసీ చైర్మన్ పటోళ్ల సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ...
    210 Views
  • ఆసిఫాబాద్ ఎస్ఐ జాడే శ్యామ్‌రావు గారి పదవీ విరమణ ఎస్పీ గారి చేతుల మీదుగా ఘన సన్మానం
    🎤ఆసిఫాబాద్, ప్రతినిధి (భారత్ ఆవాజ్ న్యూస్ ): ఆసిఫాబాద్ సబ్-ఇన్‌స్పెక్టర్ (SI) శ్యామ్‌రావు గారు ఉద్యోగ బాధ్యతల నుండి పదవీ విరమణ పొందిన సందర్భంగా జిల్లా ఎస్పీ (Superintendent of Police) గారి చేతుల మీదుగా పోలీస్ కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. పోలీస్ శాఖలో సుదీర్ఘ కాలం పాటు విశేష సేవలు అందించి, శాంతిభద్రతల పరిరక్షణలో మరియు ప్రజా సేవలో నిరంతరం ముందున్న శ్యామ్‌రావు గారి ఉత్తమ విధి...
    265 Views
  • స్కూల్ గేమ్స్ ఫెన్సింగ్ సెలక్షన్ లిస్ట్ విడుదల
    స్కూల్ గేమ్స్ ఫెన్సింగ్ సెలక్షన్ లిస్ట్ విడుదల   అండర్-14, అండర్-17 బాలబాలికల విభాగాల్లో 48 మంది ఎంపిక   మంచిర్యాల: ఈ నెల 26న మంచిర్యాలలో నిర్వహించిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఫెన్సింగ్ అండర్-14, అండర్-17 బాలబాలికల జోనల్ స్థాయి ఎంపిక పోటీలకు సంబంధించిన సెలక్షన్ లిస్ట్‌ను నిర్వాహకులు విడుదల చేశారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను తదుపరి స్థాయి పోటీలకు ఎంపిక చేశారు.  ...
    294 Views
  • కన్హా హాస్పిటల్ ప్రారంభం.. ప్రజలకు మరింత చేరువగా వైద్యం.|
    ● మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు చేతుల మీదుగా ప్రారంభం ● ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి రావాలి: ఎమ్మెల్యే అల్వాల్, సెప్టెంబర్ 30: హైదరాబాద్ అల్వాల్‌లోని పంచశీల ఎంప్లాయీస్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన కన్హా హాస్పిటల్‌ను మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు నాణ్యమైన...
    203 Views
  • నిజామాబాద్ జిల్లా కలెక్టర్ శ్రీ భవేష్ మిశ్రా, I.A.S. గారితో కలిసి ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే శ్రీ పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి గారు నందిపేట్ మండలంలోని లక్కంపల్లి SEZను సందర్శించారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే శ్రీ భూపతిరెడ్డి గారు కూడా ఈ పర్యటనలో పాల్గొన్నారు.

    ఈ సందర్భంగా లక్కంపల్లి SEZను ఆనుకుని ఉన్న ప్రాంతాలను పరిశీలించి, ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అనువైన స్థలం, భవిష్యత్తులో రిఫైనరీ ఏర్పాటుకు ఉన్న అవకాశాలు, స్థానిక రైతాంగానికి కలిగే ప్రయోజనాలు తదితర అంశాలపై అధికారులతో చర్చించారు.

    రెండు జిల్లాల్లో ఇప్పటికే సుమారు 17 వేల ఎకరాలకు పైగా ఆయిల్ పామ్ సాగులో ఉందని, భవిష్యత్తులో మరో 5 వేల ఎకరాల వరకు సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందని సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో లక్కంపల్లి SEZ సమీపంలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అనుకూలతపై సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను సూచించారు.

    స్థల నిర్ధారణ పూర్తయిన వెంటనే ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు సంసిద్ధత వ్యక్తం చేశారని తెలిపారు.

    రైతులు స్వచ్ఛందంగా ఆయిల్ పామ్ సాగు వైపు ముందుకు రావాలని సుదర్శన్ రెడ్డి కోరారు. రైతులకు అధిక ఆదాయం కల్పించడంతో పాటు, జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుతో ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని తెలిపారు.

    వంట నూనెతో పాటు అనేక ఉత్పత్తుల్లో వినియోగించే ఆయిల్ పామ్‌కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని పేర్కొన్నారు. ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

    లక్కంపల్లి SEZ ప్రాంతంలో రైస్ బ్రాన్ ఆయిల్, సోయా పరిశ్రమల ఏర్పాటుకు కూడా అనుకూలమైన స్థలాలు అందుబాటులో ఉన్నాయని, వీటి ఏర్పాటుకు కృషి చేస్తామని సుదర్శన్ రెడ్డి తెలిపారు.*

    *అలాగే మధ్యప్రదేశ్‌లో సేంద్రియ విధానంలో చేపడుతున్న కూరగాయల సాగు పద్ధతులను అధ్యయనం చేసి, నందిపేట్ ప్రాంతంలో కూడా అదే తరహాలో కూరగాయల సాగును ప్రోత్సహించే దిశగా చర్యలు తీసుకుంటామని అన్నారు.

    ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రైతులు అందుబాటులో ఉన్న నీటి వనరులను పొదుపుగా, జాగ్రత్తగా వినియోగించుకోవాలని సూచించారు.
    272 Views
  • విజయవాడలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) గారు
    విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లోని మాకినేని బసవ పున్నయ్య స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పట్టాల పంపిణీ కార్యక్రమంలో జగ్గయ్యపేట శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) గారు పాల్గొన్నారు._ ఈ కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పాల్గొని లబ్ధిదారులకు పట్టాలను అందజేశారు. ఈ...
    254 Views
  • బుచ్చంపేట పిహెచ్సి పరిధిలో ఏజెన్సీ గ్రామాలలో దోమతెరల పంపిణీ
    రోలుగుంట మండలంలోని బుచ్చంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న ఏజెన్సీ ప్రాంత గ్రామాలైన పెద్దపేట, ఎం. పెదపేట, సింగరాజుపేట, చటర్జీపురం గ్రామాల్లో బుధవారం దోమతెరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.వైద్యాధికారి ఎల్. శివప్రసాద్ తన సిబ్బందితో కలిసి గ్రామాల్లో పర్యటించి ప్రతి ఇంటికి దోమతెరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో మాట్లాడుతూ ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో దోమల ద్వారా వ్యాపించే...
    297 Views
  • బుచ్చంపేట పిహెచ్సి పరిధిలో ఏజెన్సీ గ్రామాలలో దోమతెరల పంపిణీ
    రోలుగుంట మండలంలోని బుచ్చంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న ఏజెన్సీ ప్రాంత గ్రామాలైన పెద్దపేట, ఎం. పెదపేట, సింగరాజుపేట, చటర్జీపురం గ్రామాల్లో బుధవారం దోమతెరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.వైద్యాధికారి ఎల్. శివప్రసాద్ తన సిబ్బందితో కలిసి గ్రామాల్లో పర్యటించి ప్రతి ఇంటికి దోమతెరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో మాట్లాడుతూ ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో దోమల ద్వారా వ్యాపించే...
    73 Views
  • రోలుగుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పిన్లాన్ విద్యా విధానంపై తల్లిదండ్రులకు అవగాహన
    రోలుగుంట పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫిన్లాండ్ విద్యా విధానంపై తల్లిదండ్రులు, ఎస్ఎంసి చైర్మన్, సభ్యులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డు గ్రహీత, ఫిన్లాండ్ విద్యా పర్యటన చేసిన ఉపాధ్యాయిని పి.వి.ఎం. నాగజ్యోతి ఈ కార్యక్రమంలో ఫిన్లాండ్ లో తాను ప్రత్యక్షంగా పరిశీలించిన విద్యా ప్రమాణాలు, బోధనా పద్ధతులు, తరగతి గది కార్యకలాపాలు, విద్యార్థులకు అందుబాటులో ఉన్న...
    302 Views
  • రోలుగుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పిన్లాన్ విద్యా విధానంపై తల్లిదండ్రులకు అవగాహన
    రోలుగుంట పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫిన్లాండ్ విద్యా విధానంపై తల్లిదండ్రులు, ఎస్ఎంసి చైర్మన్, సభ్యులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డు గ్రహీత, ఫిన్లాండ్ విద్యా పర్యటన చేసిన ఉపాధ్యాయిని పి.వి.ఎం. నాగజ్యోతి ఈ కార్యక్రమంలో ఫిన్లాండ్ లో తాను ప్రత్యక్షంగా పరిశీలించిన విద్యా ప్రమాణాలు, బోధనా పద్ధతులు, తరగతి గది కార్యకలాపాలు, విద్యార్థులకు అందుబాటులో ఉన్న...
    84 Views