Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • బైక్ ర్యాలీ...
    ఫీజు రీయింబర్స్‌మెంట్, జాబ్ క్యాలెండర్, యూత్ డిక్లరేషన్ హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల గారి ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరం లో భారీ బైక్ ర్యాలీ..
    448 Views
  • నిజామాబాద్
    తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో, ఇందిరా పార్క్ లో ఏర్పాటు చేసినటువంటి మహా ధర్నా కార్యక్రమంలో పాల్గొనదాంపల్లి జ్యోతి మురళీకృష్ణ, 39 వ డివిజన్ కార్పొరేటర్ & బీజేపీ జిల్లా కార్యదర షి
    259 Views
  • కాంగ్రెస్ వైఫల్యాలపై బీఆర్ఎస్ సమరభేరి: నిజామాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ

    ఎన్నికల హామీలను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం: మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ ధ్వజం

    వెయ్యికి పైగా బైక్‌లతో బీఆర్ఎస్ శ్రేణుల భారీ ప్రదర్శన

    ప్రజా సమస్యలపై పోరాటం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిక

    తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత బిగాల గణేష్ తీవ్రస్థాయిలో విమర్శించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ప్రజా పోరాటంలో భాగంగా శనివారం నిజామాబాద్ నగరంలో యువత, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వెయ్యి మందికి పైగా యువకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
    పాత కలెక్టర్ గ్రౌండ్ నుంచి ప్రారంభమైన ఈ బైక్ ర్యాలీ ఫూలాంగ్ ఎక్స్ రోడ్, వర్ని ఎక్స్ రోడ్, ఖిల్లా ఎక్స్ రోడ్, పవన్ టాకీస్ రోడ్, నెహ్రూ పార్క్, బస్ స్టాండ్ మీదుగా సాగి తిరిగి పాత కలెక్టర్ గ్రౌండ్ వద్ద ముగిసింది.

    గణేష్ బిగాల గారు మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు 6 గ్యారెంటీలు, 420 హామీలిచ్చి ప్రజలను తీవ్రంగా మోసం చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలన అట్టర్ ప్లాప్‌గా మారిందని, ప్రజా సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయని విమర్శించారు.

    ఏ ప్రభుత్వానికైనా సర్దుబాటు చేసుకునేందుకు కొంత సమయం ఇవ్వాలనే ఉద్దేశంతో కేసీఆర్ వేచి చూశారని, అయితే ప్రజా సమస్యలు తీవ్రమవుతుండటంతో పోరాట బాట పట్టక తప్పలేదన్నారు. మహిళలు, రైతులు, నిరుద్యోగుల తరఫున బీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తోందని స్పష్టం చేశారు.

    ఫీజు రీయింబర్స్‌మెంట్, జాబ్ క్యాలెండర్, యూత్ డిక్లరేషన్ వంటి హామీల అమలులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, నిరుద్యోగ యువతకు వెంటనే స్పష్టమైన భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు.

    గత బీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు నేడు కాంగ్రెస్ పాలనతో పోల్చి చూస్తున్నారని, రానున్న రోజుల్లో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

    కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారెంటీలు, పెండింగ్ హామీలను వెంటనే అమలు చేయాలని, లేనిపక్షంలో ప్రజల పక్షాన పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు
    328 Views
  • ఉపాధ్యాయులు విద్యార్థులకు పునాది లాంటి వాళ్లు
     నందవరం మండల కేంద్రంలోMPPS స్పెషల్ పాఠశాల హెచ్ఎం ఎండి శ్రీనివాసులు గారు నిర్వహించిన గురుపూజోత్సవ వేడుకల్లో నందవరం గ్రామ పెద్దలు, పాఠశాల యాజమాన్య కమిటీ మండల విద్యాశాఖాధికారి, ప్రధానోపాధ్యాయులను, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు ... ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా MEO దాసరి గోవింద్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 14 మంది ఉపాధ్యాయులను శాలువా, పూలదండలతో ఘనంగా సన్మానించి, సమాజ...
    405 Views
  • నిజామాబాద్
    నందిపేట్ గ్రామంలోని 6వ, 7వ వార్డుల్లో దోమల నివారణ కోసం స్ప్రే చేయడం జరిగింది.   ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని దోమల వ్యాప్తిని అరికట్టేందుకు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు.
    Like
    1
    238 Views
  • నిజామాబాద్
    ఆర్మూర్ లో గణేష్ ఉత్సవాలు శాంతియుతంగా నిర్వహిద్దాం!   గణేష్ ఉత్సవాల నేపథ్యంలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించిన #NizamabadCP పి. సాయి చైతన్య, IPS.   మండపాల నిర్వాహకులు పోలీసుల అనుమతులు తీసుకుని, భద్రతా, శబ్ద పరిమితులు, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.   నిమజ్జన వేడుకల్లో సంయమనం పాటిస్తూ, మత సామరస్యాన్ని కాపాడేందుకు పోలీసులకు సహకరించాలని కోరారు.    
    324 Views
  • కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో భారీగా గంజాయి తోటలపై దాడి 460 మొక్కలు స్వాధీనం, నలుగురు అనుమానితుల అదుపు
    🎤కుమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాను గంజాయి రహితంగా మార్చడమే లక్ష్యంగా పోలీసులు ఉక్కుపాదం మోపారు. సిర్పూర్ (యు) పోలీస్ స్టేషన్ పరిధిలోని బూర్నూర్ గ్రామ పంచాయతీ పరిధిలో గల జీర్లగాట్, గుట్టగూడ గ్రామ శివార్లలో పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. వ్యవసాయ భూముల్లో గుట్టుచప్పుడు కాకుండా సాగు చేస్తున్న 460 గంజాయి మొక్కలను మూడు వేర్వేరు కేసుల్లో పోలీసులు స్వాధీనం...
    515 Views
  • స్టడీ హాళ్లే టార్గెట్.. ల్యాప్‌టాప్‌లే లూట్.|
    ● ఇద్దరి అరెస్ట్.. రూ.7.60 లక్షల విలువైన 19 ల్యాప్‌టాప్‌లు స్వాధీనం ● మూడు కమిషనరేట్ల పరిధిలో 16 చోరీ కేసులతో సంబంధం ● మల్కాజిగిరి పరిధిలో అల్వాల్ సహా పలు స్టేషన్లలో కేసులు ఆల్వాల్, సెప్టెంబర్ 5: స్టడీ హాళ్లలో విద్యార్థులు విరామ సమయంలో బయటకు వెళ్లడాన్ని అవకాశంగా చేసుకుని ల్యాప్‌టాప్‌లు అపహరిస్తున్న వ్యక్తితో పాటు, వాటిని కొనుగోలు చేస్తున్న మరో వ్యక్తిని హైదరాబాద్ సిటీ...
    334 Views
  • కేటీఆర్ కారుకు తృటిలో ప్రమాదం.. లారీ ఢీ.|
    ● అలుగునూర్ వద్ద ఘటన.. కేటీఆర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు ● కారు వెనుక డోర్‌ను ఢీకొట్టిన లారీ ● గతంలోనూ కేటీఆర్ పర్యటనల్లో ప్రమాద ఘటనలు ఆల్వాల్, సెప్టెంబర్ 5: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కరీంనగర్ పర్యటనలో తృటిలో ప్రమాదం తప్పింది. అలుగునూర్ చౌరస్తా వద్ద కేటీఆర్ ప్రయాణిస్తున్న కారు వెనుక డోర్‌ను పక్కగా వెళ్తున్న లారీ ఢీకొట్టింది.  ఈ సమయంలో కేటీఆర్...
    224 Views