Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • మార్కాపురం జిల్లా ప్రజలకు విజ్ఞప్తి
    మార్కాపురం జిల్లా ప్రజలకు విజ్ఞప్తి Chief Commissioner of Land Administration Smt. G.Jayalakshmi, IAS - expected to visit tomorrow as too many complaints on revenue from markapuram రేపు అనగా గురువారం మార్కాపురం జిల్లా కేంద్రoలో CCLA కమిషనర్ జయలక్ష్మి IAS గారి పర్యటన ఉన్నట్లు సమాచారం. జిల్లా ప్రజలు, రెవిన్యూ అధికారుల చేతిలో నష్ట పోయిన బాధితులు తమ తమ సమస్యలు కమిషనర్ గారి దృష్టిలో పెట్టి అవినీతి...
    221 Views
  • దొనకొండ చెరువులకు మహార్దశ – డా గొట్టిపాటి లక్ష్మీ
    దొనకొండ చెరువులకు మహార్దశ – డా గొట్టిపాటి లక్ష్మీ ఒంగోలులో జరిగిన ప్రకాశం జిల్లా సమీక్షా మండలి సమావేశంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, ప్రకాశం జిల్లా కలెక్టర్ పి. రాజబాబు, మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిలతో కలిసి దర్శి టిడిపి...
    473 Views
  • నిజామాబాద్:మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి, ఆకస్మిక తనిఖీ
    ఈరోజు మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి (Mother & Child Hospital), నిజామాబాద్‌ను సందర్శించి ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలు, పరిశుభ్రత, విభాగాల పనితీరు మరియు ప్రజలకు అందుబాటులో ఉంచిన సమాచార బోర్డులను క్షుణ్ణంగా పరిశీలించాను. తనిఖీ సందర్భంగా H.D. Unit, A.N.C. Clinic, జీవనధార ఫార్మసీ మరియు ఆసుపత్రిలోని ఇతర విభాగాల పనితీరును పరిశీలించి, రోగులకు మరింత నాణ్యమైన,...
    242 Views
  • మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి, నిజామాబాద్‌లో ఆకస్మిక తనిఖీ
    128 Views
  • పెండింగ్ డీఏలు విడుదల చేయాలి
    ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగులో ఉన్న నాలుగు డీఏలు విడుదల చేయాలని INTCU రాష్ట్ర నాయకుCI బి.సాయికృష్ణ డిమాండ్ చేశారు. బొబ్బిలి ఎన్జీవో హోంలో బుధవారం విద్యుత్ ఉద్యోగుల సమావేశం నిర్వహించి నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఏప్రిల్ ఒకటికి అమలు చేయాల్సిన వేతన సవరణ చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరారు. #Boiena Rajesh
    256 Views
  • టిడ్కో కాలనీల్లో మౌలిక వసతులు త్వరగా పూర్తి చేయాలి: VZM కలెక్టర్
    జిల్లాలోని అన్ని టిడ్కో కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో సారిపల్లి, సోనియానగర్, నెల్లిమర్ల, బొబ్బిలి, రాజాం టిడ్కో కాలనీల్లో ఇళ్ల నిర్మాణం, తాగునీరు, రోడ్లు, డ్రైన్లు, విద్యుత్ తదితర పనుల పురోగతిని సమీక్షించారు. సోనియానగర్లో తాగునీటి పథకం పనులు వెంటనే ప్రారంభించాలన్నారు....
    281 Views
  • Ivvaltnunchi bonalu
    గోల్కొండ కోటపై శ్రీ జగదాంబ మహంకాళి అమ్మ వారికి తొలి బోనం సమర్పణతో ఆషాఢమాస ఆధ్యాత్మిక మహోత్సవాలు ఘనంగా ప్రారంభమవుతున్న ఈ పవిత్ర వేళ, ఆ జగన్మాత ప్రతి ఇంటా ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సుఖశాంతులు ప్రసాదించాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రార్థించారు.   తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగ భక్తి, శక్తి, ఐక్యతకు చిరస్మరణీయ చిహ్నమని పేర్కొన్నారు. అమ్మవారిపై అచంచల...
    181 Views
  • హుజూర్నగర్ ఎక్సైజ్ అధికారుల దాడులు – 3 లీటర్ల సారా స్వాధీనం, 400 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం

    హుజూర్నగర్, జూలై 15: హుజూర్నగర్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని మఠంపల్లి మండలం లాలీ తండా గ్రామానికి చెందిన బానోత్ భగ్నా అనే వ్యక్తి టీవీఎస్ వాహనంపై అక్రమంగా సారాను తరలిస్తుండగా, ఎక్సైజ్ అధికారి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు దాడులు నిర్వహించారు.

    ఈ దాడుల్లో టీవీఎస్ వాహనాన్ని స్వాధీనం చేసుకుని, అందులో ఉన్న 3 లీటర్ల అక్రమ సారాను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిపై ఎక్సైజ్ చట్టాల ప్రకారం కేసు నమోదు చేశారు.

    దర్యాప్తులో భాగంగా నిందితుడికి చెందిన సారా తయారీకి వినియోగించే 400 లీటర్ల బెల్లం పానకాన్ని గుర్తించి స్వాధీనం చేసుకుని, అధికారులు అక్కడికక్కడే ధ్వంసం చేశారు.

    ఈ దాడుల్లో ఎస్‌ఐ జగన్మోహన్ రెడ్డి, కానిస్టేబుళ్లు గురువయ్య, గోపిరెడ్డి మరియు డ్రైవర్ ఉపేందర్ పాల్గొన్నారు.
    390 Views
  • హుజూర్నగర్ ఎక్సైజ్ అధికారుల దాడులు – 3 లీటర్ల సారా స్వాధీనం, 400 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం

    హుజూర్నగర్, జూలై 15: హుజూర్నగర్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని మఠంపల్లి మండలం లాలీ తండా గ్రామానికి చెందిన బానోత్ భగ్నా అనే వ్యక్తి టీవీఎస్ వాహనంపై అక్రమంగా సారాను తరలిస్తుండగా, ఎక్సైజ్ అధికారి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు దాడులు నిర్వహించారు.

    ఈ దాడుల్లో టీవీఎస్ వాహనాన్ని స్వాధీనం చేసుకుని, అందులో ఉన్న 3 లీటర్ల అక్రమ సారాను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిపై ఎక్సైజ్ చట్టాల ప్రకారం కేసు నమోదు చేశారు.

    దర్యాప్తులో భాగంగా నిందితుడికి చెందిన సారా తయారీకి వినియోగించే 400 లీటర్ల బెల్లం పానకాన్ని గుర్తించి స్వాధీనం చేసుకుని, అధికారులు అక్కడికక్కడే ధ్వంసం చేశారు.

    ఈ దాడుల్లో ఎస్‌ఐ జగన్మోహన్ రెడ్డి, కానిస్టేబుళ్లు గురువయ్య, గోపిరెడ్డి మరియు డ్రైవర్ ఉపేందర్ పాల్గొన్నారు.
    410 Views
  • శ్రీ చైతన్య పాఠశాలలో 'పోలీస్ అక్క' అవగాహన సదస్సు

    మహిళల భద్రతపై విద్యార్థినులకు పోలీసుల సూచనలు

    హుజూర్‌నగర్, జూలై 15 (భారత్ ఆవాజ్): మహిళల భద్రత, సాధికారతపై విద్యార్థినుల్లో అవగాహన పెంపొందించే లక్ష్యంతో హుజూర్‌నగర్ పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో 'పోలీస్ అక్క' కార్యక్రమాన్ని నిర్వహించారు.

    హుజూర్‌నగర్ 2వ ఎస్సై హనుమాన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పోలీస్ అక్క మహిళా కానిస్టేబుళ్లు ఎస్. సింధు, ఏ. లావణ్యతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు మహిళల భద్రత, చట్టపరమైన హక్కులు, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోలీసుల సహాయం ఎలా పొందాలో వివరించారు.

    ఎస్సై హనుమాన్ మాట్లాడుతూ, విద్యార్థినులు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా భయపడకుండా వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా ప్రతి మహిళకు, ప్రతి విద్యార్థినికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

    మహిళా కానిస్టేబుళ్లు ఎస్. సింధు, ఏ. లావణ్య మాట్లాడుతూ, మహిళలపై వేధింపులు, సైబర్ నేరాలు, వ్యక్తిగత భద్రత వంటి అంశాలపై అవగాహన కలిగి ఉండటం ఎంతో అవసరమన్నారు. బాధితులకు పోలీస్ శాఖ అందించే కౌన్సెలింగ్, మార్గదర్శకత్వం, చట్టపరమైన సహాయం గురించి వివరించారు.

    కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, పెద్ద సంఖ్యలో విద్యార్థినులు పాల్గొని పోలీస్ అధికారులతో తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.

    ఫోటో క్యాప్షన్: హుజూర్‌నగర్ శ్రీ చైతన్య పాఠశాలలో నిర్వహించిన 'పోలీస్ అక్క' అవగాహన కార్యక్రమంలో విద్యార్థినులకు సూచనలు చేస్తున్న ఎస్సై హనుమాన్, మహిళా కానిస్టేబుళ్లు ఎస్. సింధు, ఏ. లావణ్య.

    — భారత్ ఆవాజ్

    రిపోర్టర్: మల్ల రాంబాబు
    663 Views