క్రైమ్ కౌంటర్ న్యూస్....
మార్కాపురం జిల్లా...
*రేపు ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్టమైన బందోబస్త్ ఏర్పాట్లు చేసిన మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.,*
బందోబస్తు సమర్థవంతంగా నిర్వర్తించేందుకు పోలీసు అధికారులు మరియు సిబ్బందికి బ్రీఫింగ్ నిర్వహించిన జిల్లా ఎస్పీ,
*బందోబస్తు నిర్వహించే సమయంలో విధులు పట్ల పోలీస్ సిబ్బంది అప్రమత్తతో ఉండాలి: జిల్లా ఎస్పీ*...
🎤 కొమురం భీం ఆసిఫాబాద్, భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్,
ఆసిఫాబాద్: అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆసిఫాబాద్ పట్టణంలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 2K రన్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ నితికా పంత్, ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి రన్‌ను ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతు....
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండల సరిహద్దులో ఉన్న రేగల్లుకు చెందిన ముగ్గురు గురువారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. స్థానికుల వివరాల మేరకు రేగల్లుకు చెందిన కొందరు ఆటోలో పీర్ల పండగకు కలికిరి మండలంలోని దూదేకులపల్లికి వెళ్లారు. పండగ చూసుకొని తిరుగు ప్రయాణంలో వస్తుండగా టానా వడ్డిపల్లి వద్ద కారు, ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ ముబారక్, మెహరున్ బి, ఆమె మనవడు వాహిద్ అక్కడికక్కడే మృతి...
చిత్తూరు జిల్లా, పుంగనూరులో గత 20 రోజులుగా తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, అధికారులు స్పందించడం లేదని స్థానికులు వాపోతున్నారు. పాఠశాలల్లోని బోర్లు కూడా పనిచేయకపోవడంతో చిన్నపిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై తక్షణమే స్పందించి, తాగునీటిని అందించాలని శుక్రవారం స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ సమస్యపై ఎటువంటి స్పందన లేదని, త్వరలో పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నారు# కొత్తూరు మురళి.
పుంగనూరు పట్టణం మున్సిపల్ కార్యాలయం సమీపానగల శ్రీ విరుపాక్షి మారెమ్మ శుక్రవారం సందర్భంగా నవధాన్యాల అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారి మూలవిరాట్ కు పంచామృతాలతో అభిషేకించారు. తర్వాత నవధాన్యాలతో అలంకరించి ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.
తిరుపతిలోని ఉండు యూత్ హాస్టల్ లో జై తెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10వ తరగతి పరీక్షల్లో తెలుగులో వందకు వంద మార్కులు సాధించిన విద్యార్థినులు హర్షిత, టి.నవ్య, అఫ్రీన్ ఖాన్, గాయత్రి, ఏ.నవ్యలను ప్రశంసా పత్రాలు, మెడల్స్ తో శుక్రవారం సత్కరించారు. ఈ కార్యక్రమానికి ఫౌండేషన్ జిల్లా వ్యవస్థాపకులు శ్రీనివాసులు అధ్యక్షత వహించారు. వంద మార్కులు సాధించేలా కృషి చేసిన పుంగనూరు జిల్లా పరిషత్ ఉన్నత బాలికోన్నత పాఠశాల...
పుంగనూరు నియోజకవర్గ ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ అధికారి చంద్రశేఖర్ రెడ్డి శనివారం ఎస్ఐఆర్ ప్రక్రియపై మాట్లాడుతూ, ప్రజలు ఎస్ఐఆర్ నమోదుపై అపోహలు పెట్టుకోవద్దని సూచించారు. ఫారం నింపే విధానాన్ని వివరించిన ఆయన, ఓటర్లు కచ్చితమైన సమాచారం ఇవ్వాలని, తప్పుడు సమాచారం ఇస్తే శిక్ష తప్పదని హెచ్చరించారు# కొత్తూరు మురళి .