మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు గత బీ ఆర్ఎస్ హయాంలో 900 కోట్ల అక్రమ ఆస్తులు కూడబెట్టారని దీనిపై విచారణ జరపాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జల కాంతం డిమాండ్ చేశారు. కరీంనగర్లో ఆయన మాట్లాడుతూ ఇసుక దందా, అక్రమాలతో మధు ఈ ఆస్తులు సంపాదించారని ఆరోపించారు.మంత్రి శ్రీధర్ బాబుని విమర్శించే నైతిక అర్హత మధుకు లేదని నోటిని అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలం, కందూరు ఉన్నత పాఠశాలలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో మూడవ తరగతి విద్యార్థిని మోక్షిత వేసిన రకరకాల యోగాసనాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సెక్రటరీ జయశంకర ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చిన్నారి ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది# కొత్తూరు మురళి.
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో ఆదివారం నక్కబండ ప్రాంతంలో ఇంటి గోడను ఓ కారు ఢీకొట్టింది. అతివేగంగా కారు నడుపుతున్న మైనర్ బాలుడు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న ఇంటిపైకి దూసుకు వెళ్లి గోడను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం దెబ్బతింది. కారులో ఉన్న బాలుడికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు# కొత్తూరు మురళి.
శుభారామ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా.ఎస్.కె. అన్నార్ ఆదేశాల మేరకు, యోగా మాస్టర్ మరియు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు భగవాన్ కళాశాలకు విచ్చేసి అధ్యాపకులకు, విద్యార్థులకు యోగాసనాలు వేయించి, యోగా ద్వారా సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని తెలిపారు. వైస్ ప్రిన్సిపల్ టి. రాజశేఖర్, అధ్యాపక బృందం, విద్యార్థులు సూర్య నమస్కారం, ప్రాణాయామం వంటి...
పుంగనూరు మండలం, బర్నేపల్లి గ్రామానికి చెందిన శోభన్ బాబు ఆదివారం చిత్తూరులో నీట్ పరీక్ష రాయడానికి వెళ్ళాడు. ఆధార్ కార్డు జిరాక్స్ సరిపోతుందని భావించిన అతడు, పరీక్ష కేంద్రంలో ఒరిజినల్ ఆధార్ కార్డు తప్పనిసరి అని తెలియడంతో ఆందోళనకు గురయ్యాడు. చిత్తూరు పోలీసులు స్పందించి, అతడిని నెట్ సెంటర్కు తీసుకెళ్లి ఆధార్ కార్డును డౌన్లోడ్ చేయించి, సమయానికి పరీక్షా కేంద్రానికి చేర్చారు. పోలీసుల...
అన్నమయ్య జిల్లా, ముదివేడు గ్రామానికి చెందిన 10 ఏళ్ల ఆలియా అనే చిన్నారికి గుండెలో రంధ్రం ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబానికి చెందిన ఆలియా చికిత్స కోసం ఆమె కుటుంబ సభ్యులు ఎంపీ మిథున్ రెడ్డిని ఆశ్రయించారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న ఎంపీ మిథున్ రెడ్డి, ఆదివారం ఆమె వైద్య చికిత్సకు అవసరమైన పూర్తి ఆర్థిక సహాయాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా...
అన్నమయ్య జిల్లా, రామసముద్రం మండలం మాలేనత్తం గ్రామానికి చెందిన ఆదెమ్మ ఆదివారం తమ వ్యవసాయ పొలంలో పనులు చేసుకుంటుండగా వర్షం కురిసింది. తల దాచుకోవడానికి ఐచర్ వాహనం కిందకు వెళ్ళగా, డ్రైవర్ బండిని ముందుకు కదిలించడంతో వెనుక చక్రాల కింద నలిగిపోయింది. స్థానికులు ఆమెను పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. పూర్తి వివరాలు పోలీసు విచారణలో తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి....
పుంగనూరు మండలంలోని రాయలపేట రోడ్డులోని మొరంపల్లి వద్ద సోమవారం తెల్లవారుజామున ముని వెంకటప్పకు చెందిన వరిగడ్డివామి అగ్నిప్రమాదానికి గురైంది. స్థానికులు సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో రైతుకు సుమారు రూ. 40 వేల వరకు నష్టం జరిగినట్లు అంచనా వేయబడింది. రాతి కూసాలు, కోయలు సగభాగం మంటల్లో కాలిపోయాయని అగ్నిమాపక శాఖ అధికారి సుబ్బరాజు తెలిపారు#...
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, పాల్యం, కల్లూరు పంచాయతీలలో సోమవారం తెల్లవారుజామున ఒక ఒంటరి ఏనుగు పంటలకు తీవ్ర నష్టం కలిగించింది. గోగులమ్మ వంక నుంచి వచ్చిన ఏనుగు కోటపల్లి వద్ద మామిడి చెట్లను ధ్వంసం చేసి, పశుగ్రాసం, పైపులను తొక్కి విరిచివేసిందని రైతులు గోపి, యుగంధర్ తెలిపారు. అనంతరం ఏనుగు అడవిలోకి వెళ్లిపోయింది. ఈ ఘటనతో స్థానిక రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు# కొత్తూరు మురళి.