డ్రైనేజీలో పడిన గోమాతను కాపాడిన స్థానికులు
Posted 2026-02-17 15:51:47
0
214
చీరాల: చీరాల మున్సిపల్ పరిధిలోని సంఘం థియేటర్ ఎదురుగా ఉన్న రోడ్డులో గోమాత ప్రమాదవశాత్తు జారి డ్రైనేజీ కాలువలో పడిపోయింది. ఈ ఘటనను గమనించిన ప్రజలు, అటుగా వెళ్తున్న వ్యక్తులు వెంటనే స్పందించి సహాయ చర్యలు ప్రారంభించారు.
ఈ విషయాన్ని తెలుసుకున్న చీమకుర్తి బాలకృష్ణ తక్షణమే మున్సిపల్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న మున్సిపల్ సిబ్బంది, స్థానికుల సహకారంతో గోమాతను సురక్షితంగా కాలువ నుంచి బయటకు తీశారు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు.
గోమాతకు స్వల్ప గాయాలు మాత్రమే కావడంతో పెద్ద ప్రమాదం తప్పిందని తెలిపారు. గోమాతను రక్షించేందుకు శ్రమించిన వార్డు ప్రజలు, మున్సిపల్ సిబ్బంది, గో పరిరక్షణ సమితి నాయకులను చీమకుర్తి బాలకృష్ణ అభినందించారు.
ఈ సందర్భంగా సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
#Narendra
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
కాంగ్రెస్ సోషల్ మీడియా నాపై తప్పుడు ప్రచారం చేస్తుంది.
కాంగ్రెస్ సోషల్ మీడియా తన పై తప్పుడు ప్రచారం చేస్తుందని బీఆర్ఎస్ నాయకుడు రాజీవ్ సాగర్.....
శ్రీ రేణుకా దేవి ఎల్లమ్మ ఆలయ పునర్ నిర్మాణానికి ఆర్థిక సాయం అందించండి
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా / అల్వాల్.
మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్...
శ్రీ జగదాంబికా అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎంపీ ఈటెల రాజేందర్
మన తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల ప్రతీక బోనాల పండుగ.. ఆషాఢ మాసంలో తొలి బోనం ను గోల్కొండ లోని శ్రీ...
నిమ్మనపల్లిలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, మరొకరికి గాయాలు.
గురువారం రాత్రి నిమ్మనపల్లి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా,...
చిక్కులకు చెక్ – ఆస్తులకు ఊరట.|
● 22-A జాబితాలో సర్వే నంబర్ల పొరపాటుపై వక్ఫ్ బోర్డు స్పష్టత
● మల్లాపూర్, మల్కాజ్‌గిరి...