ట్రాక్టర్ బోల్తా-బాలుడు మృతి

0
320

ట్రాక్టర్ బోల్తా – బాలుడు మృతి

పాత అన్న సముద్రంలో విషాద ఘటన

మార్కాపురం జిల్లా, త్రిపురాంతకం మండలం, పాత అన్న సముద్రం గ్రామం, ఫిబ్రవరి 17 (ప్రతినిధి):

మండలంలోని పాత అన్న సముద్రం గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పసుపులేటి వెంకట చంద్రశేఖర్ అనే బాలుడు ట్రాక్టర్ ప్రమాదంలో మృతి చెందాడు.

స్థానికుల వివరాల ప్రకారం, ఈరోజు మధ్యాహ్నం సుమారు ఒంటిగంట సమయంలో వ్యవసాయ పనుల నిమిత్తం ట్రాక్టర్ నడుపుతున్న సమయంలో అదుపుతప్పి సమీపంలోని కాలువలోకి బోల్తా పడింది. డ్రైవింగ్ సరిగా చేయలేకపోవడం వల్ల ట్రాక్టర్ ఒరిగిపోయి బాలుడు ట్రాక్టర్ కింద ఇరుక్కుపోయినట్లు తెలుస్తోంది. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.

ప్రమాదం గమనించిన గ్రామస్తులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని ట్రాక్టర్‌ను పైకి లేపి బాలుడిని బయటికి తీశారు. అయితే అప్పటికే అతను మృతిచెందినట్లు తెలిసింది. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాద వాతావరణం నెలకొంది. మృతుడి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.వ్యవసాయ పనుల సమయంలో సరైన జాగ్రత్తలు పాటించాలని, అనుభవం లేని వారు వాహనాలు నడపరాదని అధికారులు సూచిస్తున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
రేపు 16 125 టిడిపి కేంద్ర కార్యాలయానికి అధినేత చంద్రబాబు రాక
అమరావతి :   *రేపు (16.12.2025 టీడీపీ కేంద్ర కార్యాలయానికి అధినేత చంద్రబాబు రాక..!* ...
By Rajini Kumari 2025-12-15 08:22:53 0 263
Haryana
Haryana's Agricultural Growth and Farmer Welfare Plans
Haryana is advancing agricultural development through a range of farmer welfare programs aimed at...
By Fathima Safa 2026-06-23 11:19:15 0 145
Andhra Pradesh
రామసముద్రం హెడ్ కానిస్టేబుల్ కిరణ్ కుమార్ కు ఉత్తమ సేవలకు అవార్డు.
రామసముద్రం పోలీస్ స్టేషన్‌లో 2004 బ్యాచ్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ కిరణ్ కుమార్, విధి...
By Pagadala Venkateswar 2026-01-26 11:28:26 0 212
BMA
Journalism Defends Human Rights and Justice
Journalism plays a vital role in defending human rights by exposing injustice, discrimination,...
By JoinBMA 2026-08-20 09:22:03 0 104
Andhra Pradesh
పుంగనూరు:పుంగునూరు పట్టణ పరిధిలో రోడ్డు ప్రమాదం
శనివారం మధ్యాహ్నం పుంగనూరు మండలం, భీమ గాని పల్లి కృష్ణదేవరాయల సర్కిల్ వద్ద బైరెడ్డిపల్లి మండలం...
By Kothuru Murali 2026-02-08 10:13:44 0 215
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com