Bill Gates: బిల్ గేట్స్‌కు గన్నవరంలో మంత్రి లోకేశ్ ఘన స్వాగతం.

0
234

ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న బిల్ గేట్స్

బిల్ గేట్స్ ‌కు స్వాగతం పలికిన మంత్రులు నారా లోకేశ్, అనిత, అచ్చెన్నాయుడు సత్యకుమార్ యాదవ్

సచివాలయం వద్ద స్వాగతం పలకనున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక ఛైర్మన్ బిల్ గేట్స్ గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు మంత్రులు నారా లోకేశ్, వంగలపూడి అనిత, కె.అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్‌తో పాటు జిల్లా అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం బిల్ గేట్స్‌తో పాటు అధికారులు, మంత్రుల బృందం సచివాలయానికి బయల్దేరారు.  

 

ఈ పర్యటనలో బిల్ గేట్స్‌తో పాటు ఫౌండేషన్‌కు చెందిన ఆరుగురు ప్రతినిధుల బృందం కూడా సచివాలయానికి రానుంది. అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ ‌తో వారు సమావేశమవుతారు. సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ (ఆర్టీజీఏస్)ను బిల్ గేట్స్ సందర్శించనున్నారు. ఆర్టీజీఎస్ ద్వారా అమలవుతున్న విధానాలు, అందుతోన్న ఫలితాలను సీఎం చంద్రబాబు గేట్స్‌కు వివరించనున్నారు. 

 

అనంతరం సీఎం, మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు బిల్ గేట్స్ బృందంతో సమావేశమై.. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో రాష్ట్రంలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో అమలు చేస్తున్న ప్రాజెక్టులను మరింత విస్తరించే అంశంపై కీలక చర్చలు జరపనున్నారు.

Search
Categories
Read More
SURAKSHA
Bangalore Police Help Elderly Lost In Market Area
 Today Bangalore Police helped an 80-year-old man lost near Chickpet Market. Officers traced...
By Kalaga Sailaja 2026-07-06 06:46:39 0 90
Andhra Pradesh
విభిన్న ప్రతిభావంతుల జీవితాల్లో వెలుగు నింపుతున్న కూటమి ప్రభుత్వం
విభిన్న ప్రతిభావంతుల జీవితాల్లో వెలుగు నింపుతున్న కూటమి ప్రభుత్వం. దర్శి మండల కేంద్రంలోని...
By Chennaiah Kati 2026-07-07 02:59:49 0 113
Andhra Pradesh
యోగాంధ్ర-2026: రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది రిజిస్ట్రేషన్.. సీఎం సమీక్షలో కీలక ఆదేశాలు.
  యోగాంధ్ర-2026: రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది రిజిస్ట్రేషన్.. సీఎం సమీక్షలో కీలక ఆదేశాలు...
By Pagadala Venkateswar 2026-06-18 05:16:26 0 106
Gujarat
Patan District Demands Urgent Bush Clearance for Road Safety
Commuters and local residents in Gujarat’s Patan district are raising urgent demands for...
By Lokeshwari Panthadi 2026-06-27 08:38:47 0 148
Andhra Pradesh
మదనపల్లెలో మల్చింగ్ పేపర్ల విక్రయాలపై ఆకస్మిక సోదాలు.
మదనపల్లెలో మల్చింగ్ పేపర్లను అధిక ధరలకు విక్రయిస్తున్నారన్న ఫిర్యాదులపై జిల్లా యంత్రాంగం చర్యలు...
By Pagadala Venkateswar 2026-03-11 03:11:49 0 203
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com