మంత్రి నారా లోకేష్ ఆత్మీయ విందు

0
263

*ప్ర‌చురణార్థం* *14-02-2026*

 

మంత్రి నారా లోకేష్ ఆత్మీయ విందుకు ఎంపీ కేశినేని శివనాథ్ కుటుంబ స‌మేతంగా హాజరు

మంత్రి నివాసంలో సకుటుంబ సమేతంగా ప్ర‌జా ప్ర‌తినిధుల‌ ఆత్మీయ కలయిక

 

విజ‌య‌వాడ : గుంటూరు, విజయవాడ పార్లమెంటు పరిధిలోని ప్రజాప్రతినిధులతో ఐటీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ నిర్వహించిన ఆత్మీయ విందు సమావేశానికి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), స‌తీమ‌ణి కేశినేని జాన‌కి ల‌క్ష్మీ, కుమారుడు కేశినేని వెంక‌ట్ తో కలిసి హాజరయ్యారు. 

 

శనివారం మధ్యాహ్నం ఉండవల్లిలోని మంత్రి నారా లోకేష్ నివాసంలో నిర్వహించిన ఆత్మీయ విందు స‌మావేశం లో ఎంపీ కేశినేని శివనాథ్ కుటుంబసభ్యులతో పాల్గొని, మంత్రి లోకేష్‌తో పాటు ఇతర ప్రజాప్రతినిధులతో స్నేహపూర్వకంగా ముచ్చటించారు. మంత్రి నారా లోకేష్ ఎంపీ కేశినేని శివ‌నాథ్ స‌తీమ‌ణి జాన‌కి ల‌క్ష్మీ కి మంగ‌ళ‌గిరి చేనేత చీర బ‌హుక‌రించారు. అలాగే యువ‌నాయ‌కుడు కేశినేని వెంక‌ట్ తో ప్ర‌త్యేకంగా మాట్లాడి భవిష్య‌త్ ప్ర‌ణాళిక‌లు అడిగి తెలుసుకుని త‌న స‌హ‌కారం ఎప్పుడు వుంటుంద‌ని తెలిపారు.

 

రాజకీయాలకు అతీతంగా కుటుంబ సభ్యుల బాగోగులు, పిల్లల విద్య, క్రీడలపై చర్చలు సాగిన ఈ కార్యక్రమంలో, అందరూ ఒకేచోట భోజనం చేస్తూ ఆహ్లాదకరమైన వాతావరణంలో గడప‌టం, . త‌న‌ కుటుంబ సభ్యులతో కలిసి ఈ ఆత్మీయ విందులో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రజాప్రతినిధుల మధ్య స్నేహబంధాలను మరింత బలోపేతం చేస్తాయని తెలిపారు. మంత్రి లోకేష్ ప్ర‌జాప్ర‌తినిధుల కుటుంబాల‌తో ఆత్మీయ విందు స‌మావేశ కార్య‌క్ర‌మం చేప‌ట్టి ఏపీ రాజ‌కీయాల్లో నూత‌న ఒర‌వ‌డికి శ్రీకారం చుట్టార‌ని కొనియాడుతూ...మంత్రి నారా లోకేష్ లో ఒక రాజ‌నీతిజ్ఞుడు క‌నిపిస్తున్నాడ‌ని ప్ర‌శంసించారు.

Search
Categories
Read More
Rangareddy
దానం నాగేందర్ లాంటి వాళ్లను చూస్తే జనాల్లో రాజకీయ నాయకుల మీద ఉండే గౌరవం పోతుంది
ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసిండు ‎మళ్లీ...
By Ponnala Srinivasrao 2026-08-17 01:10:19 0 233
BMA
TRP Reforms 2025: Fighting Urban Bias in Broadcasting
The Ministry of Information and Broadcasting introduced new TRP guidelines in July 2025,...
By JoinBMA 2026-08-21 09:48:13 0 58
Andhra Pradesh
FFC ఫ్యాక్టరీ కాంప్లెక్స్ నిర్మాణాన్ని ప్రారంభించిన సీఎం.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి నుండి సోమవారం మొలకలదిన్నెలో ఎఫ్‌ఎఫ్‌సీ ఫ్యాక్టరీ...
By Pagadala Venkateswar 2026-05-26 05:47:08 0 125
Andhra Pradesh
విజయవాడ క్యాంప్ కార్యాలయంలో ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా వంగలపూడి అనిత గారి ఘన నివాళి
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు...
By Rajini Kumari 2026-01-18 14:21:08 0 412
Tamilnadu
Tamil Nadu Promotes Cultural Heritage and Tamil Language
Tamil Nadu continues to strengthen its commitment to preserving cultural heritage and promoting...
By Fathima Safa 2026-06-29 10:44:46 0 164
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com