Bharat Aawaz

కరపలో పెరుగుతున్న ప్రమాదాలు, దొంగతనాలు – ప్రజల్లో ఆందోళన

Ratna Sekhar
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
356
Views

కాకినాడ జిల్లా: కరప మండలంలో వరుసగా చోటుచేసుకుంటున్న దొంగతనాలు మరియు రోడ్డు ప్రమాదాలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కేవలం గురువారం ఒక్కరోజే కరపలో రెండు రోడ్డు ప్రమాదాలు, పెనుగుదురు వద్ద మరో ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా రాత్రివేళల్లో దొంగల బెడద అధికమైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాలు, కాలనీల్లో పోలీసు పర్యవేక్షణ పెంచి, పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిణామాలతో మండలంలో శాంతిభద్రతలపై ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.