కార్మికుల హక్కుల కోసం అంబేద్కర్ స్ఫూర్తితో పోరాటం – లేబర్ కోడ్స్ రద్దు చేయాలి: ఆమ్ ఆద్మీ పార్టీ

0
515

కాకినాడ: కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న లేబర్ కోడ్స్ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని, వాటిని తక్షణమే రద్దు చేసి కార్మికుల ప్రయోజనాలను పరిరక్షించే విధంగా చట్టాలను సవరించాలని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తోకల వరదరాజ సాంచి డిమాండ్ చేశారు. కాకినాడలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కృషి ఫలితంగా ఏర్పడిన లేబర్ కౌన్సిల్, ట్రేడ్ యూనియన్ చట్టాల ద్వారా కార్మికులకు లభించిన హక్కులను హరించేలా లేబర్ కోడ్స్ ఉన్నాయని విమర్శించారు. కార్మికుల హక్కుల కోసం అంబేద్కర్ స్ఫూర్తితో పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కాళ్ళూరి కృష్ణమోహన్ మాట్లాడుతూ, కార్మికులకు వ్యతిరేకంగా కేంద్రం తీసుకువస్తున్న లేబర్ కోడ్స్ అశాస్త్రీయమైనవని అన్నారు. కార్మిక సమాజానికి నష్టం కలిగించే విధంగా కేంద్రం వ్యవహరిస్తోందని విమర్శించారు. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్‌ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ నరాల శివ పాల్గొన్నారు. కాకినాడ, కాకినాడ రూరల్, కాకినాడ సిటీ ప్రాంతాల్లో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించబడింది.

Search
Categories
Read More
SURAKSHA
Ajoy Kumar Singh, IAS: Driving Jharkhand's Governance Forward
The Journey Begins "Leadership in governance is about turning policies into meaningful progress...
By Fathima Safa 2026-07-28 12:45:18 0 261
BMA
Censoring Satire: The IT Rules and Meme Takedowns
The Indian government’s aggressive use of IT Rules to demand the takedown of political meme...
By JoinBMA 2026-08-21 18:43:39 0 343
Andhra Pradesh
పుంగనూరు: పుంగునూరు పట్టణం లో వెలసిన సుగుటూరు గంగమ్మ జాతరకు రెండో చాటింపు ఇదే
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో ఈ నెల 10, 11 తేదీలలో సుగుటూరు గంగమ్మ జాతర జరగనుంది. ఈ...
By Kothuru Murali 2026-03-07 06:54:48 0 203
Andhra Pradesh
గాంధీనగరం పరిసరాల్లో ఏనుగుల సంచారం
కొమరాడ మండలం గాంధీనగరం పరిసరాల్లో ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు పర్యవేక్షణ అధికారులు గురువారం...
By Boiena Rajesh 2026-08-27 03:50:04 0 124
Madhya Pradesh
Madhya Pradesh Accelerates Industrial Growth in 2026
Madhya Pradesh continues to strengthen its industrial landscape by attracting investments across...
By Fathima Safa 2026-07-06 07:42:17 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com