అధిక చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు: కలెక్టర్, ఎస్పీ
Posted 2026-02-11 16:36:51
0
203
బాపట్ల జిల్లా: ప్రైవేట్ అంబులెన్స్ యజమానులు ప్రభుత్వం నిర్ణయించిన రవాణా చార్జీల మేరకే ఫీజులు వసూలు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ న్యూ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన సమావేశంలో జిల్లా ఎస్పీ ఉమా మహేశ్వరరావు పాల్గొన్నారు.ప్రభుత్వ ఆసుపత్రుల్లో అనివార్య పరిస్థితుల్లో రోగులు మృతి చెందిన సందర్భాల్లో మృతదేహాన్ని గౌరవప్రదంగా తరలించే బాధ్యత సంబంధిత ఆసుపత్రి సూపరింటెండెంట్, మెడికల్ ఆఫీసర్‌లదేనని స్పష్టం చేశారు. అంబులెన్స్ సేవల పేరుతో అదనపు రుసుములు వసూలు చేయడం లేదా ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం సహించబోమని హెచ్చరించారు.ప్రభుత్వం నిర్దేశించిన ధరల పట్టికను అంబులెన్స్ యజమానులు స్పష్టంగా ప్రదర్శించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించినట్లయితే కఠిన చర్యలు తప్పవని తెలిపారు.ఏవైనా ఫిర్యాదులు లేదా సమస్యలు ఉంటే కలెక్టర్ కార్యాలయ కంట్రోల్ రూమ్ నంబర్ 1967 / 7702806804 ను సంప్రదించాలని సూచించారు. సమావేశంలో డీఎంహెచ్‌వో డాక్టర్ విజయమ్మ, డీసీహెచ్ డాక్టర్ పద్మావతి తదితర అధికారులు పాల్గొన్నారు.
అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు..
సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్, ఎస్పీ హెచ్చరించారు. కచ్చితత్వం లేకుండా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం చట్టపరమైన నేరమని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి సంబంధించిన అంశాలపై ఎలాంటి సమాచారం ప్రచారం చేసే ముందు సంబంధిత అధికారుల నుంచి స్పష్టమైన వివరణ తీసుకోవడం తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ప్రజల్లో అపోహలు, గందరగోళం కలిగించే విధంగా పోస్టులు, సందేశాలు పంపితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.
#Narendra
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
విజయ పాలదర పెంపు లీటర్కు రెండు రూపాయలు
*విజయ పాల ధరలు పెంపు...లీటరుకు రూ.2, పెరుగు బకెట్లపై రూ.30 వరకు...స్టాండర్డ్ పెరుగు బకెట్ పై...
మల్కాజ్‌గిరి అభివృద్ధిపై ఎమ్మెల్యే భేటీ.|
● పెండింగ్ పనులు, మౌలిక వసతులపై విస్తృత చర్చ
● 22-ఏ జాబితాలోని నివాస ప్రాంతాల సమస్యలపై...
Dr. Puneet Kumar Goel Appointed New Chief Secretary of Manipur
The Appointments Committee of the Cabinet has appointed Dr. Puneet Kumar Goel, a 1991-batch IAS...
J&K Expands Digital Governance and Public Services
Jammu & Kashmir continues to advance digital governance by expanding online public services...
రాష్ట్ర కార్యదర్శి V శ్రీనివాసరావు ముఖ్యమంత్రి కి రాసిన లేఖ
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
విజయవాడ,
విజయవాడ,
తేది : 18...