అధిక చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు: కలెక్టర్, ఎస్పీ

0
204
బాపట్ల జిల్లా: ప్రైవేట్ అంబులెన్స్ యజమానులు ప్రభుత్వం నిర్ణయించిన రవాణా చార్జీల మేరకే ఫీజులు వసూలు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ న్యూ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన సమావేశంలో జిల్లా ఎస్పీ ఉమా మహేశ్వరరావు పాల్గొన్నారు.ప్రభుత్వ ఆసుపత్రుల్లో అనివార్య పరిస్థితుల్లో రోగులు మృతి చెందిన సందర్భాల్లో మృతదేహాన్ని గౌరవప్రదంగా తరలించే బాధ్యత సంబంధిత ఆసుపత్రి సూపరింటెండెంట్, మెడికల్ ఆఫీసర్‌లదేనని స్పష్టం చేశారు. అంబులెన్స్ సేవల పేరుతో అదనపు రుసుములు వసూలు చేయడం లేదా ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం సహించబోమని హెచ్చరించారు.ప్రభుత్వం నిర్దేశించిన ధరల పట్టికను అంబులెన్స్ యజమానులు స్పష్టంగా ప్రదర్శించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించినట్లయితే కఠిన చర్యలు తప్పవని తెలిపారు.ఏవైనా ఫిర్యాదులు లేదా సమస్యలు ఉంటే కలెక్టర్ కార్యాలయ కంట్రోల్ రూమ్ నంబర్ 1967 / 7702806804 ను సంప్రదించాలని సూచించారు. సమావేశంలో డీఎంహెచ్‌వో డాక్టర్ విజయమ్మ, డీసీహెచ్ డాక్టర్ పద్మావతి తదితర అధికారులు పాల్గొన్నారు.
అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు..
సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్, ఎస్పీ హెచ్చరించారు. కచ్చితత్వం లేకుండా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం చట్టపరమైన నేరమని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి సంబంధించిన అంశాలపై ఎలాంటి సమాచారం ప్రచారం చేసే ముందు సంబంధిత అధికారుల నుంచి స్పష్టమైన వివరణ తీసుకోవడం తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ప్రజల్లో అపోహలు, గందరగోళం కలిగించే విధంగా పోస్టులు, సందేశాలు పంపితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.
 
#Narendra
Search
Categories
Read More
Telangana
వాటార్ ట్యాంక్లో గణపతి
నిజామాబాద్ జిల్లా కేంద్రములోని ఖిల్లా రోడ్‌లో వినూత్నానంగా వినాయక ఉస్తావాలు...
By Sadaq Sadaq 2026-09-20 16:40:25 0 32
Meghalaya
Meghalaya Strengthens Law and Order Across the State
Meghalaya continues to reinforce its law and order framework through police modernization,...
By Fathima Safa 2026-07-03 16:16:08 0 90
Andhra Pradesh
కలెక్టర్ల సదస్సులో కలెక్టర్ ఎస్పీ
సత్యసాయిజిల్లా : రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలో...
By Vinod Kumar 2026-09-11 17:13:01 0 200
Andhra Pradesh
ఎంఎస్ బేగ్ ని కలిసిన నవ్యాంధ్ర రచయిత సంఘం నాయకులు
*ఎంఎస్ బేగ్ ను కలిసిన నవ్యాంధ్ర రచయితల సంఘం నాయకులు*   విజయవాడ పశ్చిమ ఫిబ్రవరి 21 :...
By Rajini Kumari 2026-02-21 17:11:58 0 186
Andhra Pradesh
విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న ఎమ్మెల్యే కొండయ్య
నేడు చీరాలలో ఎన్ఆర్పిఎం హై స్కూల్ సందర్శించిన సందర్భంగా విద్యార్థులతో కలిసి చీరాల శాసనసభ్యులు...
By Vadlamudi NagaVenkat 2026-03-17 06:12:42 0 680
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com