Ayyanna Patrudu: నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు... కీలక నిర్ణయం తీసుకున్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు!

0
189

ఇకపై డిజిటల్ విధానంలోనే ఎమ్మెల్యేల హాజరు నమోదు చేయాలని నిర్ణయించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు

వైసీపీ ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగానికి మాత్రమే హాజరై, మిగతా సమావేశాలకు దూరంగా ఉంటున్న వైనం 

కొందరు సభ్యులు హాజరు రిజిస్టర్‌పై సంతకం చేసి వెంటనే వెళ్లిపోతున్నారని ఆరోపణలు 

 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యేల వరుస గైర్హాజరుపై శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై డిజిటల్ విధానంలోనే ఎమ్మెల్యేల హాజరు నమోదు చేయాలని నిర్ణయించారు. సభకు హాజరుకాకుండా కొందరు సభ్యులు జీతాలు తీసుకోవడం, ఎమ్మెల్యేలుగా కొనసాగడం ఎంత వరకు సబబని స్పీకర్ ఇప్పటికే పలుమార్లు అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తనకు ఉన్న విచక్షణాధికారాలతో హాజరు విధానంపై కఠిన నిర్ణయం తీసుకున్నారు.

 

అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఇప్పటి వరకు వైసీపీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగానికి మాత్రమే హాజరై, మిగతా సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. వరుసగా 60 రోజుల పాటు శాసనసభ సమావేశాలకు గైర్హాజరైతే అనర్హత వేటు వేయొచ్చని చట్టంలో నిబంధన ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే గవర్నర్ ప్రసంగానికి మాత్రమే హాజరైతే అది సమావేశాలకు హాజరైనట్టు పరిగణనలోకి రాదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. 

 

ఈ నేపథ్యంలో గతంలో కొందరు సభ్యులు హాజరు రిజిస్టర్‌పై సంతకం చేసి వెంటనే వెళ్లిపోతున్నారని ఆరోపణలు రావడంతో అలాంటి పరిస్థితులకు చెక్ పెట్టేందుకే డిజిటల్ హాజరు విధానాన్ని స్పీకర్ అమలు చేయాలని నిర్ణయించారు. కాగా, ఈరోజు గవర్నర్ ప్రసంగం తర్వాత జరిగే బీఏసీ సమావేశంలో సభ ఎన్నిరోజులు నిర్వహించాలనేదానిపై నిర్ణయం తీసుకోనున్నారు. 

Search
Categories
Read More
SURAKSHA
పాస్‌పోర్ట్ సేవలకు తెలంగాణ పోలీసులకు జాతీయ అవార్డు
గర్వకారణం. దేశంలోనే ఉత్తమ పోలీసు పాస్‌పోర్ట్ ధ్రువీకరణ సేవలకు Telangana Police కి...
By Kalaga Sailaja 2026-06-30 05:50:47 0 80
Andhra Pradesh
NVIDIA in AP
NVIDIA has come forward to work with the AP government to create an AI ecosystem in Andhra...
By Terli Ashok 2026-01-25 05:27:57 0 260
Andhra Pradesh
తమిళనాడులో కొనసాగుతున్న సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారం
తమిళనాడు/కృష్ణగిరి/తళి   *తమిళనాడులో కొనసాగుతున్న ఏపీ సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారం.*...
By Rajini Kumari 2026-04-20 14:29:49 0 151
Andhra Pradesh
గుంటూరులో మున్సిపల్ కార్మికుల ధర్నా
మునిసిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నగర కార్యదర్శి...
By John Baji 2025-12-29 10:06:10 0 230
Andhra Pradesh
ఒక రోజు ముందే పెన్షన్లు నేడే పంపిణీ
ఎపీ ప్రభుత్వం ప్రతి నేల ఒకటో తారీఖు ఇచ్చే పెన్షన్లు ఒక రోజు ముందే ఇవ్వడం జరుగుతుంది.యన్.టి.ఆర్...
By Karapati Gopi 2025-12-31 01:03:41 0 699
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com