Tirumala Laddu: తిరుమల కల్తీ లడ్డూ కేసులో కీలక మలుపు.. రూ. 234 కోట్ల హవాలా.. రంగంలోకి దిగిన ఈడీ.

0
372

తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అంశం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. లడ్డూ వ్యవహారంలో జరిగిన పలు అవకతవకలను సీబీఐ సిట్ తన నివేదికలో వెల్లడించింది. నెయ్యి వాసన వచ్చేందుకు పలు రసాయనాలతో నెయ్యిని తయారు చేశారని సిట్ తెలిపింది. ఆర్థిక అవకతవకలు, అవినీతి ఇందులో ఉన్నాయని వెల్లడించింది. టెండర్ల మంజూరు, నెయ్యి సరఫరా, ల్యాబ్ పరీక్షల నివేదిక విషయంలో అవినీతి చోటు చేసుకుందని సిట్ గుర్తించింది. 

 

సిట్ నివేదిక ప్రకారం కొన్ని కాంట్రాక్టుల ద్వారా వచ్చిన లాభాలను హవాలా మార్గంలో పలు నగరాలకు మళ్లించారు. ఢిల్లీ, చెన్నై, విజయవాడ, హైదరాబాద్ వంటి నగరాల్లో హవాలా నెట్ వర్క్ ల ద్వారా డబ్బు తరలింపులు జరిగాయి. సుమారు రూ. 234.5 కోట్లకు పైగా డబ్బు హవాలా మార్గంలో తరలించారు. ఈ నేపథ్యంలో, ఈ వ్యవహారంలోకి ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగ ప్రవేశం చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ అధికారికంగా విచారణ ప్రారంభించింది. ఈడీ దర్యాప్తులో అసలైన నిజాలు, సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Search
Categories
Read More
Andhra Pradesh
ప్రజలు వాహనదారులు ట్రాఫిక్ మళ్లింపు మార్గాలను అనుసరించి పోలీసులకు సహకరించాలి మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ గారు
ప్రజలు, వాహనదారులు ట్రాఫిక్ మళ్లింపు మార్గాలను అనుసరించి పోలీసులకు సహకరించాలి: మార్కాపురం జిల్లా...
By Chennaiah Kati 2026-06-27 03:26:37 0 150
Andhra Pradesh
నిషేధించిన ఆ గ్రామంలో ప్రవేశిస్తే 5000 జరిమానా
చింతూరు మండలం గూడూరు గ్రామ ప్రజలు ఐస్ క్రీమ్ ఆటో లు బండ్ల మీద నిషేధం విధించారు తమగ్రామంలో ఐస్...
By Shyamala Yadagiri 2026-03-21 04:07:54 0 350
Gujarat
New Govt Push: Protecting Eco-Sensitive Zones in India
he central government is accelerating the identification of Environmentally Sensitive Areas (ESA)...
By Lokeshwari Panthadi 2026-07-01 06:37:36 0 151
Telangana
కోతుల దాడిలో వ్యక్తి మృతి...
భూపాలపల్లి: కోతుల దాడిలో వ్యక్తి మృతి... భారత్ అవాజ్ న్యూస్ భూపాలపల్లి జిల్లా: కేంద్రంలోని జవహర్...
By Gujile Ramu 2026-05-01 03:54:19 0 304
Rangareddy
ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ పాదయాత్ర...
దుండిగల్: దుండిగల్ సర్కిల్ పరిధిలోని బౌరంపేట్‌లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా...
By Ponnala Srinivasrao 2026-08-08 01:15:07 0 128
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com