చీరాల గోరంట్ల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు ఏడాది పూర్తి త్వరలో ఆరోగ్యశ్రీ సేవలు – పేదలకు అన్ని రకాల వైద్య సదుపాయాలు.

0
232

చీరాల: చీరాల పట్టణంలో గత పదేళ్లుగా వైద్య సేవలు అందిస్తున్న శ్రీ గోరంట్ల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నూతన భవనంలో ఆధునిక పరికరాలతో అత్యవసర వైద్య సేవలు అందిస్తూ ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా హాస్పిటల్ ఎండి డాక్టర్ గోరంట్ల రాజేష్   ఆధ్వర్యంలో ప్రారంభించి ఏడాది పూర్తి అయిన సందర్భంగా హాస్పిటల్ యాజమాన్యం కీలక ప్రకటనలు చేసింది. ఈ సందర్భంగా మాట్లాడిన డాక్టర్ రాజేష్, త్వరలోనే ఈ హాస్పిటల్‌లో ఆరోగ్యశ్రీ సేవలు ప్రారంభం కానున్నాయని వెల్లడించారు.
ఆరోగ్యశ్రీ అమలులోకి వచ్చిన వెంటనే పేద ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు ఉచితంగా అందించేందుకు హాస్పిటల్ సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న వైద్య సిబ్బందికి అదనంగా, మరిన్ని అనుభవజ్ఞులైన స్పెషలిస్ట్ డాక్టర్లను తీసుకురావడం ద్వారా అత్యాధునిక వైద్య సేవలు అందించనున్నట్లు పేర్కొన్నారు.
ఈ హాస్పిటల్‌లో జనరల్ మెడిసిన్‌తో పాటు వివిధ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి ఒక్కరూ గోరంట్ల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను సందర్శించి ఇక్కడి సేవలను తెలుసుకోవాలని కోరారు.

 

#Narendra

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: లారీని ఢీకొన్న ఐచర్ వాహనం
పుంగనూరు నూతన బైపాస్ రోడ్డులో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. మరమ్మతుల కారణంగా రోడ్డు పక్కన...
By Kothuru Murali 2026-05-18 15:17:01 0 106
Andhra Pradesh
పుంగనూరు: మురుగు కాలువలో మృతదేహం కలకలం
పుంగనూరు పట్టణంలోని విద్యుత్ కార్యాలయం ఎదుట మురుగు కాలువలో మంగళవారం ఒక మృతదేహం కలకలం రేపింది....
By Kothuru Murali 2026-06-02 15:34:30 0 132
Telangana
నేటి నుంచి చిలుకూరు ఆలయ బ్రహ్మోత్సవాలు
తెలంగాణ తిరుపతిగా పేరు గాంచిన చిలుకూరు బాలాజీ దేవాలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. నేడు సెల్వార్...
By Veeresh Kumar 2026-03-27 07:24:24 0 574
Andhra Pradesh
విద్యుత్ స్తంభం కూలి మహిళకు తీవ్ర గాయాలు.
అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలంలో బుధవారం పాలెంపల్లె పంచాయతీ సికారిపాలెంకు చెందిన శాంతి (30) తన...
By Pagadala Venkateswar 2026-06-18 05:01:36 0 100
Telangana
శిదిలావస్థలో వున్నా పశువుల ఆసుపత్రి
నిజామాబాదు డిస్టిక్, మొగుపాల్ మండలం, కులస్పూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన పశువుల ఆసుపత్రి ఇప్పుడు...
By Chakrala Sadhanand 2026-08-08 14:20:21 0 374
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com