డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు: 8 మందికి రూ.10 వేల చొప్పున జరిమానా

0
215

చీరాల: చీరాల ఒకటో పట్టణ ట్రాఫిక్ ఇంచార్జి ఎస్సై పవన్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడిపిన పలువురిని పోలీసులు గుర్తించారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడిన వాళ్లని చీరాల ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. కేసులను పరిశీలించిన మెజిస్ట్రేట్, నిబంధనలను ఉల్లంఘించిన ఎనిమిది మందికి ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున జరిమానా విధించారు.

ఈ సందర్భంగా, ఎస్ఐ, పవన్ మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, ప్రజల ప్రాణాల భద్రత కోసమే ఇటువంటి తనిఖీలు కఠినంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌కు పాల్పడే వాళ్లపై ఇకపై కూడా చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ప్రజలు తమతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడుకోవాలంటే ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని పోలీసులు సూచించారు.

 

#Narendra

Search
Categories
Read More
BMA
Print Circulation Drops: The Financial Crisis Deepens
The Indian print media is facing a severe financial reckoning, with daily newspaper circulation...
By JoinBMA 2026-08-20 07:40:08 0 63
Andhra Pradesh
ఉచిత కంటి వైద్య చికిత్స శిబిరం **
*ఉచిత కంటి వైద్య చికిత్స శిబిరం* మార్కాపురం జిల్లా. పెద్ద దోర్నాల. మండల స్థానిక శివసదనంలో శంకర...
By Chennaiah Kati 2026-03-03 13:05:51 0 282
Andhra Pradesh
రేపు ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్టమైన బందోబస్త్ ఏర్పాట్లు చేసిన మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.,* బందోబస్తు సమర్థవంతంగా నిర్వర్తించేందుకు పోలీసు అధికారులు మరియు సిబ్బందికి బ్రీఫింగ్ నిర్వహించిన
క్రైమ్ కౌంటర్ న్యూస్.... మార్కాపురం జిల్లా...   *రేపు ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్టమైన...
By Chennaiah Kati 2026-06-26 14:40:33 0 101
Andhra Pradesh
అన్నమయ్య జిల్లాలో వార్షికోత్సవాలు ఘనంగా ప్రారంభం
అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లిలో శ్రీ అభీష్టద మృత్యుంజయేశ్వర స్వామి వారి...
By Kothuru Murali 2026-04-23 15:04:04 0 128
Andhra Pradesh
ఆంధ్ర ప్రదేశ్ అమరావతిలో తొలిసారి గణతంత్ర వేడుకలు.
AP: అమరావతి రాజధాని పరిధిలో తొలిసారిగా గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేశారు....
By Pagadala Venkateswar 2026-01-25 06:50:20 0 196
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com