Municipal Commissioners Transfers Andhra Pradesh: ఏపీలో మున్సిపల్ కమిషనర్ల బదిలీలు.

0
401

అనంతపురం మున్సిపల్ కమిషనర్‌గా ఎం. జస్వంత్‌రావు నియామకం

 

రాష్ట్రవ్యాప్తంగా పలువురు మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పలు మున్సిపాలిటీలు, యూడీఏలు, కార్పొరేషన్లలో కీలక అధికారుల మార్పులు చేపట్టింది. 

 

అనంతపురం మున్సిపల్ కమిషనర్‌గా ఎం. జస్వంత్‌రావును నియమించగా.. అక్కడ పనిచేస్తున్న బి. బాలస్వామిని విజయనగరానికి బదిలీ చేశారు. పల్నాడు యూడీఏ కార్యదర్శిగా ఉన్న జి. సాంబశివరావును గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో డిప్యూటీ కమిషనర్‌గా నియమించారు. గుంటూరులో ఉన్న టి. వెంకటకృష్ణయ్యను పల్నాడు యూడీఏ సెక్రటరీగా నియమించారు. 

 

గుంతకల్ కమిషనర్‌గా పనిచేస్తున్న సీఎంఏ నయీం అహ్మద్‌ను ఆదోనికి బదిలీ చేయగా.. అక్కడ ఉన్న కృష్ణను సీఆర్‌డీఏకు పంపించారు. ఏలూరు యూడీఏ కార్యదర్శిగా వెయిటింగ్‌లో ఉన్న పి. సింహాచలంను నియమించారు. ఒంగోలు యూడీఏ కార్యదర్శిగా ఉన్న ఆర్‌ చండి దేవసేనను తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలో అసిస్టెంట్ కమిషనర్‌గా బదిలీ చేశారు.  

 

విజయవాడలో శానిటరీ ఇన్స్‌పెక్టర్‌‌గా ఉన్న కె. శివరామ్‌ప్రసాద్‌ను వినుకొండ కమిషనర్‌గా నియమించారు. వినుకొండలో శానిటరీ ఇన్స్‌పెక్టర్‌గా పనిచేస్తున్న ఎం. సుభాష్ చంద్రబోస్‌ను సీడీఎంఏకు రిపోర్టు చేయాలని ఆదేశించారు. అలాగే, కల్యాణదుర్గంలో శానిటరీ ఇన్స్‌పెక్టర్‌‌గా ఉన్న ఎస్‌. నూర్ అలీఖాన్‌ను కమలాపురం నగరపంచాయతీ కమిషనర్‌గా నియమించారు. అక్కడ పనిచేస్తున్న ప్రహ్లాద్‌ను సీడీఎంఏకు రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Search
Categories
Read More
SADHANA
Landmark Study Links Hyper-Flexible Hybrid Schooling to High Graduation Rates
A multi-country longitudinal report released by the International Education Bureau reveals that...
By Dunna Jessicaruth 2026-05-20 06:16:23 0 112
Andhra Pradesh
మదనపల్లి: రైతులకు లక్షల్లో మోసం… ఎస్పీకి ఫిర్యాదు.
మదనపల్లెలో రైతులను లక్షల్లో మోసం చేసిన వ్యాపారిపై చర్యలు తీసుకోవాలని బాధితులు జిల్లా ఎస్పీకి...
By Pagadala Venkateswar 2026-04-21 03:12:24 0 114
Haryana
Haryana Accelerates Industrial Growth and Investments
Haryana continues to strengthen its position as one of India's leading industrial states by...
By Fathima Safa 2026-07-06 08:46:59 0 270
BMA
Drone Journalists Targeted: The New Frontline Risk
The evolution of drone journalism has introduced entirely new risks for media operators capturing...
By JoinBMA 2026-08-20 04:57:14 0 250
Andhra Pradesh
అంగరంగ వైభవంగా జగన్నాథ స్వామి రథయాత్ర
బొబ్బిలి పట్టణంలో శుక్రవారం జగన్నాధస్వామి రథయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. కంచరవీధిలో ఉన్న...
By Boiena Rajesh 2026-07-24 05:24:03 0 163
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com