Pawan Kalyan: తిరుమల లడ్డూ వ్యవహారంలో సీబీఐ ఎక్కడా క్లీన్ చిట్ ఇవ్వలేదు: పవన్ కల్యాణ్.

0
208

గత వైసీపీ ప్రభుత్వంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర ఆరోపణలు

తిరుమల లడ్డూ ప్రసాదంలో నెయ్యికి బదులు పామాయిల్, రసాయనాలు వాడారని వ్యాఖ్య

అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి కూడా లక్ష కల్తీ లడ్డూలు పంపారని ఆరోపణ

గత ప్రభుత్వం దేవుడిపైనే పగబట్టిందని, ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనని విమర్శ

ఈ వ్యవహారంలో ఎక్కడా సీబీఐ క్లీన్ చిట్ ఇవ్వలేదని, వాస్తవాలు బయటపెడతామని స్పష్టీకరణ

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో గత ప్రభుత్వ హయాంలో భారీ కుంభకోణం జరిగిందని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లినా, ఇందులో సీబీఐ ఎక్కడా క్లీన్ చిట్ ఇవ్వలేదని ఆయన గుర్తుచేశారు. ఈ వ్యవహారంలో దోషులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని, భగవంతుడి ముందు వారు మోకరిల్లే వరకు తమ యుద్ధం ఆగదని హెచ్చరించారు.

 

నెయ్యి పేరుతో పామాయిల్, ప్రమాదకరమైన రసాయనాలు వాడి భక్తుల మనోభావాలను, ఆరోగ్యాన్ని దెబ్బతీశారని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఈ వ్యవహారంపై మాట్లాడేటప్పుడు తాము అన్ని పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, ఈ అంశాన్ని ప్రజల దృష్టికి తీసుకురావడం తన బాధ్యత అని స్పష్టం చేశారు. ఇవాళ ఉండవల్లిలో కూటమి నేతల సమావేశం అనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్ లో పవన్ మాట్లాడారు.

Search
Categories
Read More
Andhra Pradesh
జిల్లా కలెక్టర్ గారు డా||వి. వినోద్ కుమార్ ,ఐ.ఏ.ఎస్ గారు రిజిస్ట్రేషన్ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు.
జిల్లా కలెక్టర్ గారు డా||వి. వినోద్ కుమార్ ,ఐ.ఏ.ఎస్ గారు రిజిస్ట్రేషన్ ప్రక్రియను అత్యంత...
By Gadiyapudi Narendra 2026-01-07 10:10:29 0 326
Andhra Pradesh
మదనపల్లి లో పోలీసుల భారీ కార్డెన్ సెర్చ్: 20 బైక్‌లు సీజ్.
మదనపల్లె పట్టణంలోని నీరుగట్టువారిపల్లెలో గురువారం తెల్లవారుజామున పోలీసులు భారీ కార్డెన్...
By Pagadala Venkateswar 2026-02-26 11:22:26 0 162
Telangana
లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల అందజేత.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పలువురు పేదలు గత కొన్ని రోజులుగా...
By Sidhu Maroju 2025-11-28 16:20:20 0 252
Telangana
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
By Pindikura Mahesh 2026-06-23 17:33:57 0 73
Tripura
Tripura Expands Governance and Digital Services in 2026
Tripura is advancing digital governance by expanding online public services, improving...
By Fathima Safa 2026-07-02 05:13:50 0 69
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com