డ్రగ్స్ పై దండయాత్ర

0
206

*ఎన్. టి. ఆర్. జిల్లా పోలీస్ కమీషనర్ వారి కార్యాలయం, విజయవాడ* 

 

 *పత్రికా ప్రకటన* *తేదీ. 05.02.2026*

 

 *🔴 డ్రగ్స్ పై దండయాత్ర నున్న పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యంత వైభవంగా ప్రారంభమైన పదవ రోజు🚴 సైకిల్ యాత్ర కార్యక్రమం.* 

 

🔴 *పదవ రోజు అయిన ఈ రోజు నున్న నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నున్న వాంబే కాలని జి బ్లాక్ వద్ద నుండి వద్ద జీవితాన్ని ప్రేమించు డ్రగ్స్ కు దూరంగా ఉండు అనే నినాదంతో సుమారు 200 విద్యార్థులు సైకిల్స్ తొక్కుతూ సైకిల్ యాత్ర కార్యక్రమం ప్రారంభమైనది.*

 

*🔴 అజిత్ సింగ్ నగర్ పోలీస్ వారు దండయాత్రను వాంబే కాలని జి బ్లాక్ వద్దకు రాగా నున్న పోలీస్ స్టేషన్ వారు డప్పులు, సన్నాయి లతో స్థానిక మహిళలు ఘనంగా పూలు చల్లుతూ హారతులు ఇచ్చి ఘనంగా స్వాగతం పలికినారు .* 

 

*🔴 ఈ కార్యక్రమంలో ఈ రోజుకూడా నగర పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్.వి. రాజశేఖర్ బాబు ఐ.పి.ఎస్ గారు, ఈగల్ ఐ.జి. శ్రీ ఆకే రవికృష్ణ ఐ.పి.ఎస్.గారు, ఎం.ఎల్.ఏ.శ్రీ బోండా ఉమమహేశ్వర రావు గార్లు ముఖ్య అతిధులుగా పాల్గొని అవగాహన కల్పించారు.*

 

*🔴 ఈ కార్యక్రమం ఏ.డి.సి.పి. శ్రీ జి.రామకృష్ణ గారి పర్యవేక్షణలో నార్త్ ఏ.సి.పి. శ్రీమతి స్రవంతి రాయ్ గారు, ఇన్స్పెక్టర్ శ్రీ కృష్ణ మోహన్ గారు వారి సిబ్బందితో ఘనంగా ఏర్పాట్లు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.* 

 

*🔴9వ రోజు నిరంతర పోరాటాన్ని విజయవంతంగా పూర్తి చేసిన దండయాత్ర ఈరోజు 10వ రోజుకు అడుగుపెట్టింది,కానీ ఉత్సాహం తగ్గలేదు, రెట్టింపు అయింది. ప్రజల మద్దతు పెరుగుతోంది అంటే కారణం ఒక్కటే: ఇది కేవలం కార్యక్రమం కాదు, భవిష్యత్తు కోసం జరుగుతున్న యుద్ధం.*

 

*🔴 ఇప్పటికే 100 కిలోమీటర్లు పూర్తి చేసుకుని నిరంతరాయంగా అత్యంత వైభవంగా కొనసాగుతుంది. ఇది యాత్ర కాదు. ఇది యువత భవిష్యత్తు కాపాడే సంకల్పం*

 

*🔴 ఈ సందర్భంగా అధికారులు డ్రగ్స్ పై ఎటువంటి సమాచారాన్ని అయిన 112 కు గాని 1972 కి గాని తెలియజేయాలని, అదేవిధంగా ప్రతి ఒక్కరూ https://events.ntrpolice.in/ లాగిన్ అయ్యి రిజిస్టర్ అవ్వలని తెలియజేశారు.*

 

*🔴 ఈ కార్యక్రమంలో ఇండ్లాస్ శాంతివనం డా. ఆశిష్ గారు, స్థానిక కార్పొరేటర్ శ్రీమతి దుర్గాగారు, నేతలు , ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ అరవ రమేష్ గారు మరియు పెద్ద ఎత్తున స్థానిక మహిళలు, విద్యార్థులు పాల్గొన్నా రు.*

 

***

Search
Categories
Read More
Arunachal Pradesh
Education and Skill Development in Arunachal Pradesh
Education and skill development in Arunachal Pradesh have witnessed steady progress with focused...
By Fathima Safa 2026-06-30 13:36:23 0 97
Andhra Pradesh
అనకాపల్లిలో పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ మంత్రి అనిగాని సత్యప్రసాద్
అనకాపల్లి 5.1.2026   అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీలో...
By Rajini Kumari 2026-01-05 11:59:06 0 282
Andhra Pradesh
జనసేన పార్టీ నిర్వహించిన జనవాణి కార్యక్రమం
జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరిలో మంగళవారం నిర్వహించిన జనవాణిలో పలువురు తమ సమస్యల్ని...
By Rajini Kumari 2026-01-27 11:37:16 0 219
Andhra Pradesh
జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు కార్డాన్ అండ్ సెర్చ్ నిర్వహించిన రేపల్లె సబ్ డివిజన్ పోలీసులు
జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు కార్డాన్ అండ్ సెర్చ్ నిర్వహించిన...
By Gadiyapudi Narendra 2026-01-08 13:51:33 0 247
Andhra Pradesh
చెడును త్వజించి మంచిని ఆహ్వానించడమే భోగి అంతరార్థం
*చెడును త్యజించి, మంచిని స్వీకరించడమే భోగి అంతరార్థం. ఈ భోగి మీ ఇంట సిరిసంపదలు కురిపించాలని...
By Rajini Kumari 2026-01-14 12:29:11 0 198
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com