తాడేపల్లి హెచ్ఎఫ్ కన్వెన్షన్ హాల్‌లో డా. ఉండవల్లి శ్రీదేవి గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ.

0
591

తాడేపల్లి హెచ్ఎఫ్ కన్వెన్షన్ హాల్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్పర్సన్‌, మాజీ శాసనసభ్యురాలు గౌరవనీయులు డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి గారి జన్మదిన వేడుకలు ఇవాళ ఘనంగా నిర్వహించబడ్డాయి.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిడిపి సీనియర్ నాయకులు మరియు పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య గారు మాలకార్పొరేషన్ చైర్మన్ గౌరవనీయులు విజయ్ కుమార్ గారు, ఈశ్వర్ గారు వడెర్రా కార్పొరేషన్ ఛైర్మన్, 

ఈశ్వర్ గారు శాతవాహన కార్పొరేషన్ ఛైర్మన్ గారు హాజరై డాక్టర్ శ్రీదేవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ శ్రీదేవి గారు ప్రజాసేవకు, దళిత వర్గాల అభ్యున్నతికి, మహిళా సాధికారతకు చేసిన సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. సామాజిక న్యాయం కోసం ఆమె చేసిన కృషి అనేకమందికి ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు.

ఈ వేడుకల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని డాక్టర్ శ్రీదేవి గారి నాయకత్వానికి తమ మద్దతు ప్రకటించారు. భవిష్యత్తులో డాక్టర్ శ్రీదేవి గారు మరింత ఉన్నత పదవులు అధిరోహించి ప్రజలకు ఇంకా విస్తృతంగా సేవ చేయాలని పలువురు ఆకాంక్షించారు.

వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో కేక్ కట్ చేసి, శుభాకాంక్షలతో ముగిశాయి.

Search
Categories
Read More
Andhra Pradesh
కొండపల్లి ఐడిఏ డ్రెస్ ఫ్యాక్టరీలో 200 కేజీల ఆల్ట్రా జోల స్వాధీనం
*ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం*   *కొండపల్లి ఐడిఏ లో డ్రస్ ఫ్యాక్టరీలో పెద్ద ఎత్తున...
By Rajini Kumari 2026-03-13 13:50:17 0 210
Andhra Pradesh
YS Jagan: ప్రభుత్వ వైఫల్యమే కారణం.. కల్తీ పాల ఘటనపై జగన్ ఫైర్.
రాజమండ్రిలో కల్తీ పాలతో నలుగురి మృతి! ఈ ఘటనపై మాజీ సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి ప్రభుత్వ...
By Pagadala Venkateswar 2026-02-23 10:16:07 0 196
Uttarkhand
Uttarakhand Boosts Tourism Infrastructure for Growth
Uttarakhand continues to strengthen its tourism infrastructure through improved road...
By Fathima Safa 2026-06-27 06:41:28 0 77
Andhra Pradesh
చింతూరు పోలీసుల తనిఖీలో గంజాయితో పట్టుబడ్డ యువకులు!
చింతూరు మండలం మోటు జంక్షన్ వద్ద పోలీసులు బుధవారం సాధారణ తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో ఒకే స్కూటీపై...
By Shyamala Yadagiri 2026-06-03 16:14:28 0 232
Telangana
రాత్రి లేదు...!పగలు లేదు..!.. ములుగు జిల్లా...Sp
*రాత్రి లేదు...!! పగలు లేదూ...!!!*    *మంచు లేదు..!! ఎండలేదు...!!!* ...
By CM_ Krishna 2026-01-14 04:56:48 0 350
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com