46వ జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించిన హోంగార్డ్‌ G.కృష్ణ కిషోర్ ను అభినందించిన గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారు.

0
192

📍కేరళ రాష్ట్రం తిరువనంతపురం నగరంలోని చంద్రశేఖర్ నాయర్ స్టేడియంలో తేది. 28.01.2026 నుండి 01.02.2026 వరకు నిర్వహించిన 46వ జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ – 2026లో గుంటూరు జిల్లా హోం గార్డ్ జి. కృష్ణ కిషోర్ పాల్గొని గణనీయమైన ప్రతిభను ప్రదర్శించారు.

📍ఈ పోటీలలో 30+ వయో వర్గం – 5 కిలోమీటర్ల రేస్ వాక్ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన 00:32:40.2 సెకన్ల సమయంలో రేస్ పూర్తి చేసి రెండవ స్థానం సాధించి రజత పతకాన్ని గెలుచుకున్నారు.

🚩 ఈ సందర్భంగా ఈ రోజు గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారిని హోంగార్డ్ జి. కృష్ణ కిషోర్‌ మర్యాదపూర్వకంగా కలిసి, తాను పతకం సాధించిన విషయాన్ని ఎస్పీ గారికి తెలుపగా ఎస్పీ గారు అభినందనలు తెలిపారు.

📍భవిష్యత్తులో జరగబోయే పోటీలలో మరిన్ని పతకాలు సాధించి గుంటూరు జిల్లా పేరు ప్రతిష్టలను మరింత ఉన్నతంగా నిలబెట్టాలని ఆకాంక్షించారు.

📍గుంటూరు జిల్లా పోలీస్ శాఖ తరఫున హోంగార్డ్ జి. కృష్ణ కిషోర్‌కు గౌరవ ఎస్పీ గారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

👉ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ ఏఆర్ శ్రీ ఏ హనుమంతు గారు, హోమ్ గార్డు ఆర్ఐ రామకృష్ణ రెడ్డి గారు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
ఆర్టీసీ ఇకపై ప్రజా రవాణా విభాగం!!
ప్రభుత్వ ఉద్యోగులుగా 38,300 మంది ఆర్టీసీ సిబ్బంది ప్రభుత్వంపై ఏటా సుమారు రూ.వెయ్యి కోట్ల...
By Gujile Ramu 2026-04-26 04:04:38 0 483
International
35+ People died in Iran.
There are big strikes going against Govt of Iran due to Huge hikes in Rates and also decrease of...
By Terli Ashok 2026-01-07 14:38:30 0 402
Andhra Pradesh
ఈరోజు సింగపూర్ లో సిఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ 2026 బిజినెస్ రోడ్ షోలో ప్రసంగించడం సంతోషంగా ఉంది.
ఈరోజు సింగపూర్ లో సిఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ 2026 బిజినెస్ రోడ్ షోలో ప్రసంగించడం సంతోషంగా ఉంది....
By Chennaiah Kati 2026-06-18 08:33:31 0 136
Mizoram
Mizoram Sees Sharp Drop in Visible Street Drug Abuse
In a major breakthrough for public safety, Chief Minister Lalduhoma announced a significant...
By Lokeshwari Panthadi 2026-06-26 07:32:39 0 133
Telangana
"డ్రైనేజీ సమస్యలపై మాజీ కార్పొరేటర్ ఫోకస్.|"
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ఓల్డ్ ఆల్వాల్ పరిధిలోని అయ్యంగారి బస్తీలో నెలకొన్న డ్రైనేజీ సమస్యలను...
By Sidhu Maroju 2026-03-31 10:57:54 0 201
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com