కూడల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు : కమిషనర్

0
496

కర్నూలు : 

కర్నూలు సిటీ : 

కూడళ్ల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు

➡️ నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్

 

కర్నూలు నగరంలోని కూడళ్ల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ తెలిపారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించి వాహన రాకపోకలు సులభతరం చేయడమే లక్ష్యంగా అవసరమైన ప్రాంతాల్లో కూడళ్ల ఏర్పాటు చేసి వాటిని ఆధునికంగా అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. మంగళవారం ఆయన శివాజీ మహారాజ్ ఛత్రపతి (వై.జంక్షన్) కూడలిని పరిశీలించారు.

 

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకుని కూడళ్ల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ కూడలిని రూ.54 లక్షల వ్యయంతో అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. పనులను నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. 

 

  ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తో పాటు రమణ మూర్తి, డిసిపి వెంకటరమణ, డిఈఈ గిరిరాజ్, పట్టణ ప్రణాళిక అధికారి అంజాద్ బాష, టిఏఈ ఖాసీం తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లె: హత్య కేసులో నిందితుల అరెస్టు కోరుతూ ధర్నా.
మదనపల్లె మండలం సీటీఎం దళితవాడకు చెందిన మేస్త్రి మురళి (45) హత్య కేసులో నిందితులను వెంటనే అరెస్టు...
By Pagadala Venkateswar 2026-04-29 04:56:45 0 93
Andhra Pradesh
ముఖ్యమంత్రి మారిన విశాఖ ఉక్కు సమస్య తీరేనా
ముఖ్యమంత్రి స్థానంలో నాయకులు మారినా విశాఖ ఉక్కు కార్మికుల నిరసన శిబిరాలు అలాగే ఉన్నాయని తెలంగాన...
By Rajini Kumari 2025-12-27 10:27:07 0 206
Lakshdweep
Heavy Rain Alert Issued Across Lakshadweep
The India Meteorological Department (IMD) has issued a heavy rain alert for Lakshadweep as the...
By Navya Sree 2026-06-27 07:16:05 0 163
Telangana
నష్ట పరిహారం కోసం రైతు వినూత్న నిరసన
నష్ట పరిహారం కోసం రైతు వినూత్న నిరసన   సారు మా పై దయాచూపండి     ...
By Vanmoj Suryamohan 2026-01-12 15:08:58 0 526
SURAKSHA
Sanjeev Kumar Jain: A Beacon of Human Rights
Upholding Justice: The Integrity of a Dedicated Officer JOURNEY ; In the complex landscape of...
By Kalaga Sailaja 2026-07-17 05:59:08 0 30
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com