Pawan Kalyan: ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరలకు మద్యం అమ్ముతుండటంపై పవన్ కల్యాణ్ సీరియస్.

0
184

ఎక్కువ ధరలకు మద్యం అమ్మడం నిబంధనలకు విరుద్ధమన్న పవన్

 

ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నా కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక

మద్యం దుకాణాలపై నిరంతర నిఘా ఉంచాలని ఆదేశం

ఏపీలో పలుచోట్ల వైన్ షాపుల్లో ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరలకు మద్యం అమ్ముతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. అధిక ధరలకు మద్యం అమ్మడం నిబంధనలకు విరుద్ధమని ఆయన అన్నారు. కాకినాడ జిల్లాతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరకు మద్యం విక్రయిస్తున్నారనే ఫిర్యాదులు తనకు అందాయని చెప్పారు. 

 

ఇలాంటి అమ్మకాల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని పవన్ చెప్పారు. ఎంఆర్పీ ధరలకే మద్యం విక్రయించాలని... ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలను దోచుకుంటామంటే చూస్తూ ఊరుకోబోమని వార్నింగ్ ఇచ్చారు. మద్యం దుకాణాలపై నిరంతర నిఘా ఉంచాలని... అధిక ధరలకు మద్యం విక్రయించే దుకాణదారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధింత శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మద్యం విక్రయాల్లో ఎలాంటి అక్రమాలకు తావు ఉండటానికి వీల్లేదని అన్నారు. ప్రజల ప్రయోజనాలే కూటమి ప్రభుత్వానికి ప్రధానమని చెప్పారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: బండ రాయి పడి వలస కార్మికుడి మృతి
పుంగనూరు మండలం, పాలెంపల్లి సమీపంలోని ఓ కార్వీలో ఒడిస్సా రాష్ట్రానికి చెందిన జనార్ధన్ నాయక్ అనే...
By Kothuru Murali 2026-05-13 18:50:28 0 124
Telangana
నిజామాబాద్
ఈ రోజు 19 వ డివిజన్ లోని కంటేశ్వర్ సంషేమ సంఘం లో పాల్స్ పోలియో కేంద్రానీ ప్రారంభించడం జరిగింది
By Sadaq Sadaq 2026-06-28 11:35:05 0 197
Andhra Pradesh
పుంగునూరు:పుంగనూరులో రథసప్తమి వేడుకలు: సూర్యప్రభ వాహనంపై స్వామివారి దర్శనం.
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయంలో ఆదివారం రథసప్తమి వేడుకలు...
By Kothuru Murali 2026-01-25 12:06:20 0 214
Andhra Pradesh
Tirumala Theft: తిరుమలలో భక్తులకు టోకరా వేసే ముఠా అరెస్ట్.
తిరుమలలో నేరాలకు పాల్పడుతున్న కొండ బాలకృష్ణ అలియాస్‌ రమేష్‌, మండ నవీన్‌  ఈ...
By Pagadala Venkateswar 2026-01-31 06:08:11 0 376
Telangana
ఓటర్ల హియరింగ్‌ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి ఆసిఫాబాద్ కలెక్టర్ హరిత
🎤 ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్:  కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అనామలీస్, మ్యాపింగ్ కాని...
By Chunarkar Jagadeesh 2026-09-01 14:27:42 0 427
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com