Pemmasani Chandrasekhar: ఇప్పటివరకు అంబటిని భరించాం... ఈ రోజు నుంచి సినిమా చూపిస్తాం: కేంద్రమంత్రి పెమ్మసాని.

0
199

వైసీపీ నేత అంబటి రాంబాబుకు కేంద్రమంత్రి పెమ్మసాని తీవ్ర హెచ్చరిక

 

ఇకపై అంబటికి అసలు సినిమా చూపిస్తామని వ్యాఖ్య

సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కారణమని వెల్లడి

24 గంటల్లో తమ స్పందన ఎలా ఉంటుందో తెలుస్తుందని స్పష్టీకరణ

అంబటి వ్యాఖ్యలను ఖండించిన హోంమంత్రి వంగలపూడి అనిత

మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుపై కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి అంబటి అత్యంత అనుచితమైన భాషలో వ్యాఖ్యలు చేశారంటూ మండిపడ్డారు. ఇప్పటివరకు అంబటిని సహనంతో భరించామని, ఇకపై ఆయనకు అసలు సినిమా చూపిస్తామని హెచ్చరించారు. 24 గంటల్లో తమ స్పందన ఎలా ఉంటుందో తెలుస్తుందని అల్టిమేటం జారీ చేశారు.

 

ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ, "బరితెగించి మాట్లాడేవారికి భయపడేలా ట్రీట్‌మెంట్‌ ఉంటుంది. మేం చట్టబద్ధంగా వెళితే ఏం జరుగుతుందో అంబటికి త్వరలోనే తెలుస్తుంది" అని వ్యాఖ్యానించారు. వైసీపీ నేతలు కావాలనే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ రాష్ట్రంలో అశాంతి సృష్టించాలని చూస్తున్నారని ఆరోపించారు.

 

మరోవైపు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత కూడా అంబటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రిని అవమానించడం అంటే రాష్ట్ర ప్రజలను అవమానించినట్లేనని అన్నారు. అధికారం కోల్పోయిన అసహనంతో వైసీపీ నేతలు రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తున్నారని, అలాంటి చర్యలను ప్రభుత్వం ఉపేక్షించబోదని ఆమె హెచ్చరించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం :నారా లోకేష్‌ను కలిసిన మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాసుల నాయుడు
అన్నమయ్య జిల్లా సోమల మండలం, మండల మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాసుల నాయుడు విజయవాడలో నారా...
By Kothuru Murali 2026-02-07 06:43:36 0 188
Telangana
నిజామాబాద్:మక్కజొన్న కేంద్రం వెంటనే ఏర్పటుచేయాలి
నిజామాబాద్ జిల్లాలో రైతులు పండించిన మక్క పంటకు కొనుగోలు వెంటనే ఏర్పాటుచేయాలని నిజామాబాద్ జిల్లా...
By Sadaq Sadaq 2026-03-16 17:26:55 0 218
Tamilnadu
CM Vijay Announces DA Hike for 16 Lakh Employees
In a major post-election move, Chief Minister C. Joseph Vijay has announced a 2% increase in...
By Dunna Jessicaruth 2026-05-14 11:10:19 0 158
BMA
Samizdat 2.0: The Revival of Underground Print
In response to prolonged, months-long internet suspensions in conflict zones, journalists are...
By JoinBMA 2026-08-21 11:21:40 0 136
Andhra Pradesh
పుంగనూరులో కృష్ణ జలాలతో పుణ్యమ్మకు ఘనంగా మరవ విడుదల
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో హంద్రీనీవా రివర్ ద్వారా కృష్ణ జలాలు పుంగమ్మ చెరువుకు చేరాయి....
By Kothuru Murali 2026-02-11 08:48:19 0 194
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com