Chandrababu Naidu: బెగ్గిపల్లె గ్రామంలో ఇంటింటికీ తిరిగి పింఛన్లు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు.

0
214

Andhra

Chandrababu Distributes Pensions Door to Door in Beggi Palle

కుప్పం నియోజకవర్గంలో రెండో రోజు పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు

బెగ్గిపల్లె గ్రామంలో ఇంటింటికీ వెళ్లి పింఛన్ల పంపిణీ

 

లబ్ధిదారులను ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలు విచారణ

పథకాల అమలు తీరుపై స్వయంగా ఆరా తీసిన ముఖ్యమంత్రి

ముగ్గురు లబ్ధిదారులకు తన చేతుల మీదుగా పింఛన్లు అందజేత

ముఖ్యమంత్రి చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో రెండో రోజు పర్యటనలో భాగంగా ప్రజలతో మమేకమయ్యారు. శనివారం ఆయన బెగ్గిపల్లె గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే స్వయంగా వెళ్లి, వారిని ఆప్యాయంగా పలకరించారు.

 

గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. వారి యోగక్షేమాలను విచారించి, ఏవైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ముగ్గురు లబ్ధిదారులకు తన చేతుల మీదుగా పింఛన్లు అందించారు.

 

మునెమ్మ అనే వృద్ధురాలికి వృద్ధాప్య పింఛను, చిన్నతాయమ్మ అనే మహిళకు వితంతు పింఛను, వెంకటరామప్పకు వృద్ధాప్య పింఛను అందజేసి వారికి భరోసా కల్పించారు. ముఖ్యమంత్రే నేరుగా తమ ఇంటికి వచ్చి పింఛను అందించడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాల అమలును క్షేత్రస్థాయిలో పర్యవేక్షించడంలో భాగంగా సీఎం ఈ కార్యక్రమం చేపట్టారు.

Search
Categories
Read More
Andhra Pradesh
చింతూరు వరద బాధితులకు నిత్యావసర వస్తువులు పంపిణీ!
పోలవరం జిల్లా చింతూరు మండలంలోని గోదావరి వరద ముంపు గ్రామాల్లో ఈ రోజు ప్రభుత్వం నిత్యావసర సరుకులు...
By Shyamala Yadagiri 2026-08-04 17:00:40 0 187
Odisha
MMPY Expansion: Mid-Day Meals for Classes 9 and 10
The Odisha government has announced a significant expansion of the Mukhyamantri Poshan Yojana...
By Lokeshwari Panthadi 2026-07-02 07:31:10 0 158
Andhra Pradesh
మత్స్య ఉత్పత్తులకు మార్కెటింగ్ మేనేజర్‌లా వ్యవహరిస్తా: సీఎం చంద్రబాబు.
  మత్స్య ఉత్పత్తులకు మార్కెటింగ్ మేనేజర్‌లా వ్యవహరిస్తా: సీఎం చంద్రబాబు Andhra...
By Pagadala Venkateswar 2026-05-20 03:49:29 0 112
Andhra Pradesh
మదనపల్లిలో చిన్నారి రిషిక కుటుంబ సభ్యులు పరామర్శించిన రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు
మదనపల్లిలో చిన్నారి రిషిక కుటుంబ సభ్యులను పరామర్శించిన రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ...
By Benguluri Madhubabu 2026-02-18 03:42:28 0 291
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : గార్గేయ స్వామి ఆలయంలో శివరాత్రికి ముమ్మర ఏర్పాట్లు
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలం, దుర్గం కొండపై వెలసిన శ్రీ గార్గేయ మహాముని...
By Kothuru Murali 2026-02-13 06:09:33 0 196
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com