APPSC Group 1: ఏపీపీఎస్‌సీ గ్రూప్ - 1 ఫలితాలు విడుదల.

0
220

హైకోర్టు ఆదేశాలతో క్రీడా కోటాకు సంబంధించి రెండు పోస్టులు రిజర్వు చేసిన ఏపీపీఎస్‌సీ

హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులకు సంబంధించి అడ్డంకులు తొలగడంతో నిన్న సాయంత్రం ఏపీపీఎస్‌సీ గ్రూప్‌ -1 అభ్యర్థుల ఎంపిక జాబితాను ఎట్టకేలకు విడుదల చేసింది. మొత్తం 89 పోస్టులకు గాను 87 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక జాబితాను విడుదల చేసింది. క్రీడా కోటాకు సంబంధించిన రెండు పోస్టులను రిజర్వు చేయాలని హైకోర్టు ఆదేశించడంతో వాటిని పక్కన పెట్టింది. క్రీడా కోటా పరిధిలోకి వచ్చే సహాయ కమిషనర్‌ ఆఫ్‌ స్టేట్‌ ట్యాక్స్‌, డీఎస్పీ పోస్టులపై కోర్టు ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. 

 

గ్రూప్‌–1 పోస్టుల భర్తీకి సంబంధించి 2023 డిసెంబరు 8న నోటిఫికేషన్‌ విడుదలైంది. 2024 మార్చి 17న ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించగా, 2025 మే నెలలో మెయిన్స్‌ పరీక్షలు పూర్తయ్యాయి. జూన్‌లో మెయిన్స్‌ ఫలితాలు ప్రకటించారు. అనంతరం గతేడాది జూన్‌ 23 నుంచి జులై 15 వరకు జనరల్‌ అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. క్రీడా కోటాకు సంబంధించిన ఇంటర్వ్యూలు ఈ ఏడాది జనవరి 7న పూర్తి చేశారు. 

 

ఈ ఎంపిక జాబితాలో డిప్యూటీ కలెక్టర్‌ పోస్టులు 9, అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ స్టేట్‌ ట్యాక్స్‌ 17, డీఎస్పీ పోస్టులు 25 ఉన్నాయి. అలాగే డీఎస్పీ (జైళ్లు) ఒకటి, డివిజనల్‌/జిల్లా ఫైర్‌ సర్వీస్‌ అధికారి రెండు, ఆర్టీవోలు ఆరు పోస్టులు ఉన్నాయి. జిల్లా బీసీ సంక్షేమ అధికారి ఒకటి, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి మూడు, డిప్యూటీ రిజిస్ట్రార్స్‌ ఆరు, పురపాలక కమిషనర్‌ (సెకండ్‌ గ్రేడ్‌) మూడు పోస్టులు ఎంపికయ్యాయి. సహాయ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ ఒకటి, సహాయ ట్రెజరీ అధికారి/సహాయ అకౌంటింగ్‌ అధికారి మూడు, జిల్లా ఉపాధి కల్పన అధికారి నాలుగు, సహాయ ఆడిట్‌ అధికారి రెండు, మండలాభివృద్ధి అధికారి నాలుగు పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేశారు.

Search
Categories
Read More
BMA
Quashing Sedition: The Right to Criticize the State
The strength of a free press is proven by its ability to criticize the government without being...
By JoinBMA 2026-08-21 10:13:13 0 182
Andhra Pradesh
మదనపల్లెలో 'ఏక్తాన్' ర్యాలీని ప్రారంభించిన జిల్లా ఎస్పీ.
అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లెలో ఆదివారం ఉదయం ఏక్తాన్ ర్యాలీ ఘనంగా జరిగింది. జిల్లా ఎస్పీ ధీరజ్...
By Pagadala Venkateswar 2026-03-08 04:51:58 0 189
Telangana
రాజపేట మండలం ఎమ్మార్వోగా జి రవి కిరణ్ కుమార్
పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల ఎమ్మార్వోగా మంగళవారం బాధ్యతలు...
By Pindikura Mahesh 2026-06-23 17:45:40 0 251
Telangana
పూర్ణచందర్ ను జడ్జి ముందు హాజరు పరిచిన పోలీసులు
స్వేచ్ఛ మృతి కేసులో పూర్ణ చందర్ కు రిమాండ్ 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్. పూర్ణ చందర్ ను చంచల్...
By Sidhu Maroju 2025-06-29 14:56:56 0 1K
Andhra Pradesh
కూటమి నాయకుల వేధింపులు దుర్మార్గం - గోపి కుటుంబానికి పార్టీ తరుపున అన్ని విధాలా అండగా ఉంటాం - మాజీ శాసనసభ్యులు నంబూరు శంకరరావు *
*కూటమి నాయకుల వేధింపులు దుర్మార్గం - గోపి కుటుంబానికి పార్టీ తరుపున అన్ని విధాలా అండగా ఉంటాం -...
By John Baji 2025-12-25 14:00:58 0 263
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com