Madhavireddy: సర్వే రాళ్లపై జగన్ బొమ్మ వేయించేందుకు ప్రజాధనం దుర్వినియోగం చేశారు: ఎమ్మెల్యే మాధవీరెడ్డి.

0
198

 

Madhavireddy: సర్వే రాళ్లపై జగన్ బొమ్మ వేయించేందుకు ప్రజాధనం దుర్వినియోగం చేశారు: ఎమ్మెల్యే మాధవీరెడ్డి

28-01-2026 Wed 16:46 | Andhra

Madhavireddy Alleges Misuse of Public Funds for Jagans Survey Stones

 

గత వైకాపా ప్రభుత్వం రూ.700 కోట్లను దోచుకుందని ఆరోపణ

వైసీపీ నాయకులు క్రెడిట్ చోరీ అంటూ గగ్గోలు పెడుతున్నారని విమర్శ

పేటీఎం బ్యాచ్‌తో తప్పుదారి పట్టిస్తున్నారని మండిపాటు

సర్వే రాళ్లపై జగన్ బొమ్మ వేయించేందుకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి, సుమారు రూ.700 కోట్లను వైకాపా ప్రభుత్వం దోచుకుందని ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, వైసీపీ పార్టీ నాయకులు 'క్రెడిట్ చోరీ' అంటూ పెద్ద ఎత్తున గగ్గోలు పెడుతున్నారని మండిపడ్డారు. డబ్బులు పెట్టుకుని మాట్లాడించే పేటీఎం బ్యాచ్‌ను ముందు పెట్టుకుని ప్రజలను తప్పుదారి పట్టించాలనే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

 

కానీ అసలు నిజం ఏంటంటే, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు అందజేస్తుండటమే వీళ్ల భయానికి కారణమని అన్నారు. ఒక ఆయుధం పిచ్చోడు చేతిలో ఉంటే ఎలా నాశనం చేస్తుందో, అదే ఆయుధం మంచి వ్యక్తి చేతిలో ఉంటే ఎలా ప్రజలకు ఉపయోగపడుతుందో ఈరోజు పట్టాదారు పాస్ పుస్తకాలు దానికి నిదర్శనంగా నిలుస్తున్నాయని అన్నారు. జజగన్ మోహన్ రెడ్డి భూ రీసర్వే పేరుతో గత ఐదేళ్లలో చేసిన దోపిడీలు, ఆక్రమణలు ప్రజలు ఇంకా మర్చిపోలేదని అన్నారు.

 

అందుకే పట్టాదారు పాస్ పుస్తకాలు చేతికి వస్తే తమ దుర్మార్గాలు మళ్లీ గుర్తొస్తాయేమో అన్న భయంతో, వీళ్లంతా బయటకు వచ్చి 'క్రెడిట్ చోరీ' అంటూ విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కానీ వాస్తవం ఏమిటంటే, 2018లోనే తెలుగుదేశం ప్రభుత్వం మంచి ఉద్దేశంతో, రైతుల భూములకు భద్రత కల్పించాలనే లక్ష్యంతో భూ రీసర్వే ప్రక్రియను ప్రారంభించిందని గుర్తు చేశారు.

 

"తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జగ్గయ్యపేట నియోజకవర్గంలోని తక్కెళ్లపాడులో పైలట్ ప్రోగ్రామ్‌గా భూ రీసర్వే మొదలుపెట్టింది. కంటిన్యూస్ ఆపరేటింగ్ రెఫరెన్స్ స్టేషన్స్ (సీఓఆర్ఎస్) ద్వారా సాంకేతికంగా రీసర్వే చేయాలనే ఉద్దేశంతో 2018 సెప్టెంబర్ 25న జీఓ నెంబర్ 1348ను కూడా జారీ చేసింది. అయితే 2019లో దురదృష్టవశాత్తు టీడీపీ ఓడిపోవడంతో, వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చి ఈ భూ రీసర్వేను ప్రజల భూములు దోచుకునే ఆయుధంగా మార్చింది. వైకాపా ప్రభుత్వం రీసర్వే పేరుతో భూవివాదాలు సృష్టించి, ప్రజలను కోర్టుల చుట్టూ తిరగలేని పరిస్థితి తీసుకొచ్చింది. వేలాది భూములను 22-ఏ జాబితాలో చేర్చి, సమస్యలు పరిష్కరించకుండా ప్రజలను అల్లకల్లోలం చేసింది. ఆ తర్వాత 'క్లియర్ టైటిల్స్ ఇస్తాం' అని మోసం చేస్తూ 2023 అక్టోబర్ 31న ల్యాండ్ టైటిల్ యాక్ట్‌ను తీసుకొచ్చింది. ఈ చట్టం ద్వారా ప్రజల స్వేచ్ఛను హరించి, ఆస్తులను లాక్కోవాలనే దురుద్దేశమే స్పష్టంగా కనిపించింది" అని మండిపడ్డారు.

 

నీతి ఆయోగ్ సూచనల ప్రకారం నిపుణులు, న్యాయ అధికారులు ఉండాల్సిన అపిలేట్ ట్రిబ్యునల్‌లో 'ఎనీ పర్సన్' అనే పదాన్ని చేర్చి, వైసీపీ తన కార్యకర్తలనే నియమించుకునేలా వ్యవస్థను వక్రీకరించిందని ఆరోపించారు. స్థానిక కోర్టులకు వెళ్లే అవకాశం లేకుండా చేసి, నేరుగా హైకోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి తెచ్చిందని మండిపడ్డారు. రెవెన్యూ వ్యవస్థ మొత్తాన్ని రిజిస్ట్రేషన్ అధికారుల చేతుల్లో పెట్టి, ప్రజల ఆస్తులను గుప్పెట్లో పెట్టుకోవాలనే పెద్ద కుట్రకు తెరలేపిందని అన్నారు. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత అసలు డాక్యుమెంట్లు ఇవ్వకుండా, డూప్లికేట్ కాపీలు ఇస్తామని, అసలు పత్రాలు ప్రైవేట్ కంపెనీల వద్ద ఉంచుతామని చట్టంలో చేర్చడం అత్యంత ప్రమాదకరమని అన్నారు. తరతరాలుగా ప్రజల దగ్గరే ఉన్న ఆస్తి పత్రాలను ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలనుకోవడం వైసీపీ దురుద్దేశానికి నిదర్శనమని మండిపడ్డారు. ఈ కుట్రను ప్రజలు గుర్తించారు కాబట్టే 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి భారీ మెజారిటీ ఇచ్చారని పేర్కొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించిన జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు.
బాపట్ల: జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించిన...
By Gadiyapudi Narendra 2026-01-19 14:51:05 0 267
Telangana
ఖమ్మం జిల్లాలో పంచాయతీ కార్యదర్శుల బదిలీలు..
ఖమ్మం జిల్లాలో 10 మంది గ్రామ పంచాయతీ కార్యదర్శులను బదిలీ చేస్తూ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి...
By Krishna Balina 2026-03-06 09:48:03 0 452
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : షేర్ ఆటో బోల్తా పడి ఇద్దరి పరిస్థితి విషమం
శనివారం పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, గడ్డం వారిపల్లి సమీపంలో ఫోన్ మాట్లాడుతూ ఆటో...
By Kothuru Murali 2026-01-31 16:03:17 0 194
Telangana
ప్రమాదవకరంగా ఏర్పడ్డ రాళ్లగుట్ట : పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్.|
    సికింద్రాబాద్ : మోండా డివిజన్ పరిధిలోని ఈస్ట్ మారేడ్ పల్లి వడ్డెర బస్తి ప్రాంతంలో...
By Sidhu Maroju 2025-11-03 12:25:31 0 296
SURAKSHA
Anurag Jain, IAS:Driving India's Growth Through Visionary Leadership
The Journey Begins "Good governance is built on transparency, innovation, and unwavering public...
By Fathima Safa 2026-07-20 12:11:58 0 210
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com