మంచినీటి పనులను అడ్డుకున్న వెల్లంపల్లి మైలవరం రత్నకుమారి ఆగ్రహం

0
216

*విద్యాధరపురం మంచినీటి రిజర్వాయర్ మరమ్మత్తు పనులను అడ్డుకున్న వెలంపల్లి*

 

*44వ డివిజన్ కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి ఆగ్రహం*

 విజయవాడ పశ్చిమ, జనవరి 28: స్థానిక 44వ డివిజన్ విద్యాధరపురం చెరువు సెంటర్ కొండపై ఉన్న మంచినీటి రిజర్వాయర్ మరమ్మతు పనులను రాజకీయ కక్షతోనే మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి అడ్డుకున్నారని 44వ డివిజన్ కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వాయర్ అడుగుభాగం పూర్తిగా దెబ్బతిన్నదని , అలాగే రిజర్వాయర్ పై స్లాబ్ పెచ్చులూడి ఇనుప చువ్వలు కనిపిస్తున్నాయని, పైనుండి స్లాబు ముక్కలు ముక్కలుగా పెచ్చులూడి పడిపోతోందని, ఈ రిజర్వాయర్ ను మరమ్మత్తులు చేయించాలని గత రెండేళ్ల నుంచి తాము కౌన్సిల్లో కోరుతున్నా ఏ మాత్రం పట్టించుకోకుండా తమ ప్రతిపాదనలను పక్కన పెట్టేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం చెరువు సెంటర్ కొండపై దెబ్బతిన్న స్థితిలో ఉన్న రిజర్వాయర్ ను కూటమి కార్పొరేటర్లు, నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ రత్నకుమారి మాట్లాడుతూ రిజర్వాయర్ మరమత్తులపై 34.12 లక్షల రూపాయలు మేరకు అధికారులు అంచనా వేశారని, దీన్ని స్టాండింగ్ కమిటీ తిరస్కరిస్తూ పలుమార్లు వాయిదాలు వేయడం దారుణమని విమర్శించారు. మంచినీరు కలుషితమైన రావడంతో డివిజన్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కలుషిత మంచినీటి వలన ప్రజలకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఏర్పడితే దానికి మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ , అలాగే స్టాండింగ్ కమిటీ సభ్యులు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. బిజెపి కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ మాట్లాడుతూ కూటమి కార్పొరేటర్ల ప్రతిపాదనలను వాయిదాలు వేస్తున్న వైసీపీ పాలక పక్షం ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతోందని, ఇది మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కి, వైసిపి పాలక పక్షానికి సరికాదని అన్నారు. తెలుగుదేశం నాయకులు మైలవరపు దుర్గారావు మాట్లాడుతూ స్టాండింగ్ కమిటీ తీసుకోవాల్సిన నిర్ణయాలను మాజీమంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు తన ఇంట్లో కూర్చుని తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసమే తాము తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగిందని చెప్పారు. తనను పార్టీ మారాడని విమర్శించే నైతిక అర్హత మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావుకు లేదని అన్నారు. ఆయన 2014 లో కాంగ్రెస్ టికెట్ తీసుకుని ఆ మరుసటి రోజు బిజెపి టికెట్ పొంది ఎమ్మెల్యేగా పోటీ చేశారని, ఆయన కంటే పెద్ద ఫిరాయింపుదారుడు ఎవరు ఉండరని ఎద్దేవా చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మంచినీటి రిజర్వాయర్ మరమ్మత్తు పనులకు వెంటనే స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలపాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి కార్పొరేటర్లు గుడివాడ నరేంద్ర, అత్తులూరి ఆదిలక్ష్మి, మహదేవు అప్పాజీ రావు, అబ్దుల్ హర్షద్, కూటమి నాయకులు మైలవరపు కృష్ణ, అత్తులూరి పెద్దబాబు, బొడ్డుపల్లి శ్రీనివాసరావు, రెడ్డిపల్లి రాజు, సంభాన బాబురావు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
మితిమీరిన పంచాయతీరాజ్ శాఖ అధికారుల నిర్లక్ష్యం.|
  హైదరాబాద్ :  ఉప సర్పంచ్ చెక్ పవర్ రద్దు అంటూ మొదట మెమో విడుదల చేసిన అధికారులు....
By Sidhu Maroju 2025-12-23 13:47:13 0 402
Andhra Pradesh
మత్తు పదార్థాలతో కుటుంబాలు చిన్నాభిన్నం
మత్తు పదార్దాలు వలన కుటుంబాలు చిన్నాభిన్నం అవుతాయని పట్టణ సీఐ కె.నారాయణరావు అన్నారు. బొబ్బిలి...
By Boiena Rajesh 2026-03-03 12:59:40 0 235
Andhra Pradesh
ఏపీలో కొత్తగా మరో 70 అన్న క్యాంటీన్లు ఏర్పాటు.. జిల్లాల వారీగా లిస్ట్ ఇదే
 సంక్రాంతికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామీణ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. నియోజకవర్గ, మండల...
By John Baji 2025-12-24 07:31:09 0 257
Telangana
స్వర్గీయ ఇందిరా గాంధీ 108 వ జయంతి— నివాళులు అర్పించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్.|
సికింద్రాబాద్ : జూబ్లీ బస్ స్టేషన్ ఎదురుగా ఉన్న మాజీ ప్రధాని, స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారి...
By Sidhu Maroju 2025-11-19 07:37:40 0 262
Andhra Pradesh
మదనపల్లి: కరెంట్ షాక్‌తో బాలుడికి తీవ్ర గాయాలు.
మదనపల్లెలోని అమ్మచెరువుమిట్టలో మంగళవారం విష్ణు (7) అనే బాలుడు కరెంట్ షాక్‌కు గురై తీవ్రంగా...
By Pagadala Venkateswar 2026-06-04 05:29:18 0 93
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com