చీరాలలో యువకుడి హత్య..! తలకు తీవ్ర గాయం, మెడ చుట్టూ కత్తిపోట్లు
Posted 2026-01-28 12:06:06
0
255
చీరాల: చీరాల పట్టణంలోని ఆర్ఓబి క్రింద గుర్తు తెలియని యువకుడు మృతదేహం స్థానికులను భయాందోళనలకు గురిచేసింది. అనుమానస్పద స్థితిలో ఉన్న యువకుడి మృతదేహాన్ని బుధవారం వేకువజామున గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
మృతిని మెడపై పదునైన ఆయుధంతో దాడి చేసిన గాయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తలకు కూడా తీవ్ర గాయాలు అయినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఒకటవ పట్టణ ఒన్ టౌన్ సిఐ సుబ్బారావు సంఘటనా స్థలానికి చేరుకుని మృతి దేహాన్ని పరిశీలించారు. సంఘటనా ప్రాంతంలో మద్యం షాపు ఉండటం వలన నిత్యం రద్దీగా ఉంటుంది. నిత్యం మందుబాబుల హడావిడితో కోలాహలంగా ఉండే ఈ ప్రాంతం ఈ యువకుడి హత్య పట్టణంలో సంచలనంగా మారింది. విషయం తెలిసిన స్థానికులు వందల సంఖ్యలో ఫ్లైఓవర్ వద్దకు చేరుకుని వీక్షిస్తున్నారు. ఘటనా స్థలం రైల్వే శాఖ పరిధిలో ఉండటం వలన కేసు దర్యాప్తును ఎవరు చేపడతారని విషయంలో రైల్వే పోలీసులకు గాని, సివిల్ పోలీసులకు కానీ ఇంకా స్పష్టత రాలేదు.పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.
#Narendra
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మంచిర్యాల్: ముగిసిన ఉమ్మడి జిల్లాల బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలు
మంచిర్యాల్ క్లబ్ నిర్వహించిన ఉమ్మడి జిల్లాల బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ పోటీలు, సెలక్షన్ ముగి సాయి....
మర్రి రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా లేబర్ కార్డుల పంపిణీ.|
మల్కాజ్‌గిరి: అల్వాల్‌లో కార్మికుల సంక్షేమానికి సంబంధించిన కీలక కార్యక్రమం ఘనంగా...
CM Yogi Felicitates Instructors, Touts 96% School Infrastructure Upgrade
Uttar Pradesh Chief Minister Yogi Adityanath addressed a felicitation ceremony for part-time...
కరీంనగర్ కొత్తపల్లి తేజస్ అకాడమీ నుండి 160 మంది విద్యార్థులు డిఫెన్స్ ఉద్యోగాలు పొందిన సందర్భంగా తేజస్ సౌర్య 2026 అభినందన వేడుక
కరీంనగర్ కొత్తపల్లి తేజస్ అకాడమీ నుండి హనుమకొండ జూన్ 2025 ఆర్మీ ఓపెన్ ర్యాలీలో పాల్గొని మెరిట్...
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...