YS Jagan: నేడు భీమవరం నియోజకవర్గ నేతలతో వైఎస్ జగన్ సమావేశం.

0
211

YS Jagan: నేడు భీమవరం నియోజకవర్గ నేతలతో వైఎస్ జగన్ సమావేశం

28-01-2026 Wed 08:42 | Andhra

YS Jagan to Meet Bhimavaram Leaders Today

ఉదయం 11 గంటలకు వైసీపీ కేంద్ర కార్యాలయంలో సమావేశం

నియోజకవర్గంలోని సమస్యలు, రాజకీయ పరిణామాలపై చర్చించనున్న జగన్

గత వారం ఏలూరు నియోజకవర్గ నేతలతో సమావేశమైన వైనం

వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం అసెంబ్లీ నియోజకవర్గ నేతలతో పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి సమావేశం కానున్నారు. ఉదయం 11 గంటలకు భీమవరం అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో ఆయన భేటీ అవుతారు. ప్రధానంగా నియోజకవర్గంలోని ప్రజా సమస్యలు, రాజకీయ పరిణామాలపై జగన్ చర్చించనున్నారు. 

 

ప్రతి బుధవారం రాష్ట్రంలోని ఒక నియోజకవర్గ నేతలు, కార్యకర్తలు, వైసీపీ ప్రజా ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించుకున్న పార్టీ అధినేత వైఎస్ జగన్ గత వారం ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ స్థానిక నేతలతో సమావేశమయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, జరుగుతున్న పరిణామాలను వివరించిన వైఎస్ జగన్ .. పార్టీని మరింత బలోపేతం చేయడానికి చేపట్టాల్సిన చర్యల గురించి శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

Search
Categories
Read More
Manipur
Manipur Strengthens Sports Development and Excellence
Manipur continues to reinforce its reputation as one of India's leading sporting states by...
By Fathima Safa 2026-07-03 16:06:29 0 76
Lakshdweep
Lakshadweep Ends 47-Year Prohibition: A New Tourism Era
he Union Territory of Lakshadweep has officially entered a transformative chapter with the...
By Lokeshwari Panthadi 2026-06-29 05:00:38 0 130
Andhra Pradesh
"యెర్రారెడ్డిపాలెంలో పల్లెనిద్ర – విద్యార్థులు, చిన్నారులతో కలెక్టర్ ఆత్మీయ ముచ్చట్లు"
"యెర్రారెడ్డిపాలెంలో పల్లెనిద్ర – విద్యార్థులు, చిన్నారులతో కలెక్టర్ ఆత్మీయ ముచ్చట్లు"...
By Chennaiah Kati 2026-06-22 05:41:15 0 106
Telangana
హనుమకొండ జిల్లాలో దారుణం..
భరత్ ఆవాజ్ (ప్రతి నిధి):  హనుమకొండ జిల్లా వేలేరు మండలం ఎర్రబెల్లి గ్రామంలో ధారావత్ రాజకుమార్...
By Prashanth Goindla 2026-02-26 12:00:29 0 544
Andhra Pradesh
శిరోరక్ష ప్రాణ రక్ష కార్యక్రమం,,హెల్మెట్‌పై అవగాహన
చీరాల: బాపట్ల జిల్లా చీరాలలో శిరోరక్ష ప్రాణ రక్ష కార్యక్రమాన్ని ఈరోజు మసీద్ సెంటర్‌లో జిల్లా...
By Gadiyapudi Narendra 2026-04-27 07:17:48 0 501
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com