శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా రాత్రి వేళలో కట్టుదిట్టమైన నైట్ బీట్ చెకింగ్ నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

0
241

శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా రాత్రి వేళల్లో కట్టుదిట్టమైన నైట్ బీట్ చెకింగ్ నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

 ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, ప్రకాశం పోలీసులు ప్రజల ప్రాణ, ఆస్తి భద్రతల పరిరక్షణతో పాటు జిల్లాలో శాంతి భద్రతలు కట్టుదిట్టంగా కొనసాగించేందుకు ప్రకాశం జిల్లా పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు, సిబ్బంది రాత్రి వేళల్లో విస్తృతంగా నైట్ బీట్ చెకింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ నైట్ బీట్ చెకింగ్ సమయంలో పట్టణాలు, గ్రామాలు, హైవే రోడ్లు, ప్రధాన కూడళ్లు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్ల పరిసర ప్రాంతాలు, అనుమానాస్పద ప్రదేశాలు, లాడ్జీలు, ధాబాలు, బహిరంగ ప్రదేశాలు మొదలైన చోట్ల ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. రాత్రి వేళల్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులను ప్రశ్నించి, వారి వివరాలను పరిశీలించారు.

అక్రమ కార్యకలాపాలు, చోరీలు, దొంగతనాలు, బహిరంగ మద్యం సేవనం, గంజాయి వినియోగం, జూదం, అసాంఘిక చర్యలను అరికట్టేందుకు ఈ తనిఖీలు ఎంతో ఉపయోగకరంగా నిలిచాయి. నైట్ బీట్ నిర్వహణలో భాగంగా వాహనాలను కూడా తనిఖీ చేసి, ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనదారులకు సూచనలు, హెచ్చరికలు జారీ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా పోలీసు అధికారులు మాట్లాడుతూ, ప్రజలు ఎలాంటి అనుమానాస్పద కార్యకలాపాలను గమనించినా వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్ 100 / 112 కు సమాచారం అందించాలని సూచించారు. ప్రజల సహకారంతోనే నేర రహిత సమాజాన్ని నిర్మించగలమని, భవిష్యత్తులో కూడా ఇలాంటి నైట్ బీట్ చెకింగ్ కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు 

Search
Categories
Read More
Bharat Aawaz
“You Are Not Just a Voter – You Are the Owner of This Nation”
Know Your Rights. Use Your Voice. Change Your India.  Why This Article Matters Most people...
By Citizen Rights Council 2025-06-25 11:53:49 0 2K
Telangana
మనూర్ :- రంజాన్ వేడుకలు
మనూర్ మండలంలోని గ్రామాలలో రంజాన్ వేడుకలు ఘనంగా అత్యంత భక్తి శ్రద్దలతో చేశారు. ఒక నెల రోజుల పాటు...
By Gandla Vaijanath 2026-03-21 06:07:33 0 538
Andhra Pradesh
పుంగనూరు:పుంగునూరు పట్టణ పరిధిలో రోడ్డు ప్రమాదం
శనివారం మధ్యాహ్నం పుంగనూరు మండలం, భీమ గాని పల్లి కృష్ణదేవరాయల సర్కిల్ వద్ద బైరెడ్డిపల్లి మండలం...
By Kothuru Murali 2026-02-08 10:13:44 0 216
SURAKSHA
K. A. P. Sinha, IAS: Steering Punjab with Vision & Integrity
A Distinguished IAS Officer Driving Administrative Excellence, Governance Reforms, and Inclusive...
By Lokeshwari Panthadi 2026-07-17 10:42:32 0 151
Andhra Pradesh
స్టేట్ మీడియా అక్రిడిటేషన్ జీవోను తక్షణమే రద్దు చేయండి
స్టేట్ మీడియా అక్రిడిటేషన్ కమిటీ జీవోను తక్షణమే రద్దు చేయండి.: సమాచార శాఖ మంత్రి కొలసు పార్థసారథి...
By Rajini Kumari 2025-12-23 09:52:41 0 235
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com