జాతీయ స్థాయి తైక్వాండో పోటీల్లో సత్తా చాటిన పోలీస్ వారసులు

0
301
 
చీరాల: జాతీయ స్థాయి తైక్వాండో పోటీల్లో సత్తా చాటిన చిన్నారులను అభినందించిన జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు
జాతీయ స్థాయిలో రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ పట్టణంలోని ఎస్‌ఎమ్‌ఎస్ ఇండోర్ స్టేడియంలో జనవరి 18 నుండి 23వ తేదీ వరకు నిర్వహించిన ఇండియా తైక్వాండో థర్డ్ కిడ్స్ ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్ 2025–2026 పోటీలలో బాపట్ల జిల్లాలో ఏఆర్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న 2013 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్ మల్లెల విజయ్ బాబు కుమార్తె రంజయు లోచన్, కుమారుడు నిక్షిప్త విజయ్ మెడల్స్ సాధించారు.
మంగళవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఈ చిన్నారులు తమ తండ్రి విజయ్ బాబుతో కలిసి జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు చిన్నారులను ఆత్మీయంగా అభినందించి, సాధించిన పతకాలను అందజేశారు.
మల్లెల విజయ్ బాబు కుమార్తె రంజయు లోచన్ (9 సం.), కుమారుడు నిక్షిప్త విజయ్ (7 సం.) లు గత సంవత్సరం డిసెంబర్ 27, 28 తేదీలలో గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో తైక్వాండో అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సెకండ్ ఏపీ స్టేట్ కిడ్స్ అండ్ ఫెడరేషన్ కప్–2025 లో ఇరువురు గోల్డ్ మెడల్స్ సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
జాతీయ స్థాయిలో జనవరి 18 నుండి 23వ తేదీ వరకు రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ పట్టణంలోని ఎస్‌ఎమ్‌ఎస్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన ఇండియా తైక్వాండో థర్డ్ కిడ్స్ ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్ 2025–2026 పోటీలలో ఇరువురు సత్తా చాటారు. రంజయు లోచన్ రజత పతకం, నిక్షిప్త విజయ్ కాంస్య పతకం సాధించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ, పోలీస్ శాఖలో విధులు నిర్వహించే సిబ్బంది నిరంతరం విధి నిర్వహణలోనే ఎక్కువ సమయం గడపాల్సి ఉంటుందని, కుటుంబానికి ప్రత్యేకంగా సమయం కేటాయించే అవకాశం చాలా తక్కువగా ఉంటుందన్నారు. అయినప్పటికీ విధి నిర్వహణలో బిజీగా ఉన్నా తన పిల్లలను క్రీడల వైపు ప్రోత్సహించిన కానిస్టేబుల్ విజయ్ బాబును ప్రత్యేకంగా అభినందించారు.
పోలీస్ కుటుంబాల్లోని పిల్లలు చిన్న వయసులోనే క్రమశిక్షణతో కూడిన క్రీడల్లో రాణించడం ఎంతో ఆనందదాయకమన్నారు. తైక్వాండో వంటి ఆత్మరక్షణ క్రీడల్లో రంజయు లోచన్, నిక్షిప్త విజయ్ జాతీయ స్థాయిలో పతకాలు సాధించి జిల్లా పేరు, పోలీస్ శాఖ ప్రతిష్టను పెంపొందించడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో ఈ చిన్నారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించి మంచి గుర్తింపు పొంది జిల్లాకు, జిల్లా పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ మల్లెల విజయ్ బాబు, చిన్నారులు రంజయు లోచన్, నిక్షిప్త విజయ్, చిన్నారులకు కోచ్ గా వ్యవహరించిన ఎం.సురేష్ తదితరులు పాల్గొన్నారు.
 
#Narendra
Search
Categories
Read More
SURAKSHA
Manoj Abraham IPS: Driving Innovation and Excellence in Kerala Policing
"A police force becomes stronger when it combines discipline with innovation and public trust."...
By Fathima Safa 2026-07-08 08:00:51 0 192
Andhra Pradesh
మై టిడిపి పోస్టర్ను ఆవిష్కరించిన రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
మై టిడిపి పోస్టర్ను ఆవిష్కరించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో ప్రతి...
By Benguluri Madhubabu 2026-02-17 05:44:28 0 310
Andhra Pradesh
పుంగనూరు: ఘనంగా సంత్ సేవాలాల్ మహారాజ్ ఆలయ శంకుస్థాపన
పుంగనూరు మండలంలోని సుగాలిమిట్ట సేవాగఢ్ పరిధిలో గురువారం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ ఆలయ నిర్మాణ...
By Kothuru Murali 2026-06-25 17:34:32 0 125
Telangana
రామ్‌నగర్‌ మురుగు సమస్యకు శాశ్వత పరిష్కారం.|
● HMWSSB అధికారులతో కలిసి పరిశీలించిన మాజీ కార్పొరేటర్‌ శాంతి శ్రీనివాస్‌రెడ్డి ● తరచూ...
By Sidhu Maroju 2026-09-16 17:45:17 0 90
Telangana
తెలంగాణలో చికెన్ షాపుల బంద్ : ఏప్రిల్ 1 నుండి నిరవధిక సమ్మెకు పిలుపు.|
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని చికెన్ వ్యాపారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు.  పౌల్ట్రీ...
By Sidhu Maroju 2026-03-25 08:27:21 0 191
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com