మెప్మా బజారున ప్రారంభించిన డోన్ ఎమ్మెల్యే కోట్ల !!

0
521

కర్నూలు : నంద్యాల : డోన్ 

77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని డోన్ మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో మెప్మ (MEPMA) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెప్మ బజార్‌ను గౌరవనీయులు డోన్ శాసనసభ్యులు శ్రీ కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి గారు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, స్వయం ఉపాధి ద్వారా ఆర్థిక స్వావలంబన సాధించడమే మెప్మ కార్యక్రమాల ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు తమ ప్రతిభను ప్రదర్శించి, ఉపాధి అవకాశాలను విస్తరించుకునేందుకు మెప్మ బజార్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.

ప్రభుత్వం మహిళలు, పేద వర్గాల అభ్యున్నతికి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ముందుకు సాగాలని ఎమ్మెల్యే గారు సూచించారు. ఇలాంటి బజార్లు స్థానిక ఉత్పత్తులకు మార్కెట్ కల్పించడంతో పాటు ప్రజలకు నాణ్యమైన వస్తువులు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, మెప్మ సిబ్బంది, స్వయం సహాయక సంఘాల సభ్యులు, రిసోర్స్ పర్సన్స్, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు పట్టణ ప్రజలు ప పాల్గొన్నారు. మెప్మ బజార్ ప్రారంభంతో మున్సిపల్ కార్యాలయ ప్రాంగణం సందడి మరియు ఉత్సాహంతో నిండిపోయింది.

Search
Categories
Read More
Andhra Pradesh
హరిబాబు కుటుంబం పై మురళి దాడి
బాపట్ల జిల్లా చీరాల మండలం బోయినవారిపాలెం గ్రామంలో పోలేరమ్మ తిరునాళ్ల సందర్భంగా ఉద్రిక్తత...
By Vadlamudi NagaVenkat 2026-07-09 02:46:21 0 78
Lakshdweep
Massive 1800 Year Old Potato Patch Coral Discovered In Lakshadweep
A remarkable UNDP survey near Kadmat Island, Lakshadweep, identified a colossal Pavona clavus...
By Tejaswini Komanduru 2026-06-05 10:29:20 0 466
Andhra Pradesh
పుంగనూరు: ఘనంగా సంత్ సేవాలాల్ మహారాజ్ ఆలయ శంకుస్థాపన
పుంగనూరు మండలంలోని సుగాలిమిట్ట సేవాగఢ్ పరిధిలో గురువారం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ ఆలయ నిర్మాణ...
By Kothuru Murali 2026-06-25 17:34:32 0 77
Andhra Pradesh
ట్రెండ్ ను ఫాలో కావొద్దు... సవాళ్లను స్వీకరించండి: బెంగళూరులో నారా లోకేశ్.
యువత సవాళ్లను స్వీకరించి ముందుకు సాగాలని, ట్రెండ్‌ను అనుసరించకుండా నిర్దిష్ట లక్ష్యంపై...
By Pagadala Venkateswar 2026-04-11 06:44:11 0 113
Andhra Pradesh
మహిళల భద్రతకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు : కర్నూలు జిల్లా పోలీసులు
కర్నూలు :  కర్నూలు జిల్లా మహిళల భద్రత కు పటిష్ట చర్యలు చేపట్టిన కర్నూలు...
By Hari Krishna 2026-01-23 14:06:55 0 187
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com