Tirumala: కిటకిటలాడుతున్న తిరుమల.. సర్వదర్శనానికి 24 గంటలు.

0
383

Tirumala: కిటకిటలాడుతున్న తిరుమల.. సర్వదర్శనానికి 24 గంటలు

24-01-2026 Sat 14:14 | Andhra

 

Tirumala Crowded with Devotees Sarvadarshan Takes 24 Hours

శ్రీవారి దర్శనానికి పోటెత్తుతున్న భక్తులు

భక్తులతో నిండిపోయిన అన్ని కంపార్టుమెంట్లు

నిన్న స్వామిని దర్శించుకున్న 69,726 మంది భక్తులు

కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి కొలువుదీరిన పుణ్యక్షేత్రం తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. స్వామి వారి దర్శనం కోసం భక్తులు పోటెత్తుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులతో తిరుమల జనసంద్రంగా మారింది. కొండపై ఉన్న అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. 

 

మరోవైపు, స్వామి వారిని నిన్న 69,726 మంది భక్తులు దర్శించుకున్నారు. మొత్తం 27,832 మంది తలనీలాలు సమర్పించారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల రూ. 4.12 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది. 

Search
Categories
Read More
Himachal Pradesh
Himachal Pradesh Expands Digital Governance Services
Himachal Pradesh is steadily advancing digital governance to improve transparency, efficiency,...
By Fathima Safa 2026-06-29 12:21:16 0 178
Andhra Pradesh
,ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్న బిజెపి పార్టీ అధికార ప్రతినిధి గురురాజ్ దేశాయ్,
  మండలకేంద్రమైన నందవరం లొని బిజెపి కార్యలయంలో బిజెపి జిల్లా అధికార ప్రతినిథి గురురాజ్...
By Boya Dasthagiri 2026-03-24 09:07:16 0 354
Telangana
వర్షానికి ఇల్లు కూలిన బాధితురాలికి కొండంత భరోసా. ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యేలా కృషి చేస్తాం మున్సిపల్ చైర్‌పర్సన్ ఆకాష్, వైస్ చైర్‌పర్సన్ ఎండి అహ్మద్
🎤భారత్ ఆవాజ్ న్యూస్, ఆసిఫాబాద్ పట్టణంలోని మేకలవాడలో వర్షాల ధాటికి జూలాల లక్ష్మి అనే నిరుపేద మహిళ...
By Chunarkar Jagadeesh 2026-07-23 11:23:40 0 245
Telangana
సైకిల్ పై ప్రయాణించిన ఆలేరు ఎమ్మెల్యే
భారత్ ఆవాజ్ న్యూస్ ఆలేరు 18   ఉదయం 6 గంటల నుండి యాదగిరిగుట్ట నుండి ఆలేరు వరకు సైకిల్పై...
By Pindikura Mahesh 2026-05-18 03:12:10 0 384
Andhra Pradesh
ఏపీ ఎస్పీడీసీఎల్
మదనపల్లి కేంద్రంగా ఏర్పడిన అన్నమయ్య జిల్లాకు 30 మెగావాట్ల సోలార్ విద్యుత్ కేటాయించాలని కోరిన...
By Pagadala Venkateswar 2026-01-22 07:14:48 0 208
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com