మున్సిపల్ ఉద్యోగులతో ఓటర్ల ప్రతిజ్ఞ చేయించిన కమిషనర్

0
195

కర్నూలు : 

ప్రతి ఓటు విలువైనదే..

• కర్నూలు నియోజకవర్గ ఆర్వో, కమిషనర్ పి.విశ్వనాథ్

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ప్రతి ఓటు ఎంతో విలువైనదని, ఒక్క ఓటుతోనే ఎన్నికల్లో అభ్యర్థులు గెలుపొందిన సంఘటనలు ఎన్నో ఉన్నాయని కర్నూలు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కమిషనర్ పి.విశ్వనాథ్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయాలంటే ప్రతి ఓటరు బాధ్యతగా తన ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. శుక్రవారం 16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరపాలక సంస్థ కార్యాలయంలో ఉద్యోగులచే కమిషనర్ ఓటర్ల ప్రతిజ్ఞ చేయించారు. 

ఈ సందర్భంగా ఆర్వో మాట్లాడుతూ.. ఓటు హక్కు ప్రతి పౌరుడి హక్కు మాత్రమే కాక బాధ్యత సైతం అని, మతం, కులం, భాష, ఇతర ప్రలోభాలకు లోనుకాకుండా స్వేచ్ఛాయుతంగా, నైతికంగా ఓటు వేయడం ద్వారానే నిజమైన ప్రజాస్వామ్యం నిలబడుతుందని తెలిపారు. ఈ ఏడాది “నా భారత్, నా ఓటు” అనే నినాదంతో అనేక చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేరు నమోదు చేసుకుని, ప్రతి ఎన్నికలో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఓటు హక్కుపై అవగాహన పెంపొందించేందుకు స్వీప్ కార్యక్రమాలను వినియోగించుకోవాలని సూచించారు.

కార్యక్రమంలో మేనేజర్ చిన్నరాముడు, డిప్యూటీ తహశీల్దార్ ధనుంజయ, సూపరింటెండెంట్లు సుబ్బన్న, మంజూర్ బాష, నాగరాజు, సిబ్బంది షబానా బేగం, తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
West Bengal
'We are with centre, but they cannot decide our representative': Mamata Banerjee on Op-Sindoor outreach
West Bengal Chief Minister Mamata Banerjee has reaffirmed her party’s support for the...
By BMA ADMIN 2025-05-19 18:06:33 1 2K
Andhra Pradesh
మదనపల్లె: అంజలి అరెస్ట్ కోసం ప్రత్యేక బృందాలు: డిఎస్పి.
ఏడేళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో ఏ2 ముద్దాయిగా ఉన్న కులవర్ధన్ తల్లి అంజలిని పట్టుకునేందుకు...
By Pagadala Venkateswar 2026-02-21 04:18:07 0 166
SURAKSHA
Bridging the Gap: Trust & Unity in Assam Policing
The Assam Police department is deeply committed to fostering a "participatory democracy" by...
By Lokeshwari Panthadi 2026-07-04 09:33:22 0 152
Andhra Pradesh
ట్విన్స్ సర్ప్రైజ్.. సేమ్ మార్క్స్
పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండంలో ట్విన్స్ తమకొచ్చిన ఇంటర్ మార్కులతో అందరినీ ఆశ్చర్యానికి...
By Boiena Rajesh 2026-04-15 13:04:02 0 187
SURAKSHA
112: Your Unified Emergency Response
The 112 emergency helpline serves as a vital, integrated lifeline for citizens, ensuring rapid...
By Kalaga Sailaja 2026-06-26 11:54:21 0 74
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com